Venkateswarlu
చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం ప్రముఖ తెలుగు సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూశారు. ఈ విషాదంనుంచి తెలుగు చిత్ర పరిశ్రమ కోలుకోకముందే..
చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం ప్రముఖ తెలుగు సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూశారు. ఈ విషాదంనుంచి తెలుగు చిత్ర పరిశ్రమ కోలుకోకముందే..
Venkateswarlu
ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం ప్రముఖ తెలుగు సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. చంద్రమోహన్ మరణంనుంచి తేరుకునే లోపే మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత రవీంద్ర బాబు చనిపోయారు. రవీంద్ర బాబు నిర్మాతగా తెలుగులో 17 సినిమాలను నిర్మించారు. మా నాన్న నక్సలైట్, వెయిటింగ్ ఫర్ యూ, సొంతూరు, గల్ఫ్, గంగపుత్రులు, హనీట్రాప్‌తో పాటు మరికొన్ని సినిమాలు చేశారు.
అనారోగ్యం కారణంగా శనివారం ఆయన తుదిశ్వాస విడిచారు. ఇండస్ట్రీ ఈ రెండు మరణాలనుంచి ఇంకా కోలుకోకముందే మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ తమిళ మాటల రచయిత రాశి తంగదురై చనిపోయారు. గత కొద్దిరోజులుగా హృదయ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తుది శ్వాస విడిచారు. రాశి తంగదురైది తమిళనాడులోని తేని జిల్లా, ఆదిపట్టిలోని కధిరనారాసింగాపురం గ్రామం. సినిమాల మీద ఆసక్తితో ఆయన చెన్నై వచ్చారు. దాదాపు 200లకు పైగా చిన్న కథలు రాశారు.
కొన్ని సినిమాలకు మాటల రచయిత పని చేశారు. అంతేకాదు! వాగై నది పరివాహక ప్రాంతంలో నివసించే వారి జీవితాలపై దాదాపు 1000 పేజీల నవల రాశారు. ఆ నవల తమిళనాడులో చాలా ప్రాచూర్యం పొందింది. తర్వాత 2018లో వచ్చిన ‘‘ వెర్కట్ గార్చి మాలై’ అనే సినిమాకు కథ, మాటలు అందించారు. లెనిన్ భారతి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు తమిళ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాలోని డైలాగులకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రాశి తంగదురై విజయ ప్రస్థానం అంతటితో ఆగలేదు.
ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న ‘తేన్’ అనే సినిమాకు కూడా డైలాగులు రాశారు. కెవి, ఫైల్, ఆధార్‌తో పాటు మరికొన్ని సినిమాలకు తంగదురై పని చేశారు. అనారోగ్యం కారణంగా గత కొన్ని నెలల నుంచి తన సొంతూరులో ఉంటున్నారు. అక్కడే తన అనారోగ్యానికి చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే, అనారోగ్యం తీవ్రమై.. గుండెపోటుకు దారి తీసింది. డాక్టర్ల ప్రయత్నాలు విఫలమయ్యాయి. చికిత్స పొందుతూ తంగదురై మరణించారు. తంగదురై మరణంతో తమిళ చిత్ర సీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు ప్రముఖులు తంగదురై మరణంపై తమ సంతాపం తెలియజేస్తున్నారు.
కాగా, తంగదురైకి తన తల్లిదండ్రులంటే ఎనలేని ప్రేమ. తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమతో తన పేరు ముందు రాశి అనే పదాన్ని చేర్చుకున్నారు. ఆ పదం.. తండ్రి రామయ్య.. తల్లి శ్రీనియమ్మాల్‌లోంచి తీసుకున్నది కావటం విశేషం. అలా తన పేరు ముందు తల్లిదండ్రుల పేర్లలోని అక్షరాలను చేర్చుకుని.. రాశి తంగదురైగా ఫేమస్ అయ్యారు. మరి, భారత చిత్ర పరిశ్రమలో చోటుచేసుకుంటున్న వరుస విషాదాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.