iDreamPost
android-app
ios-app

పాజిటివ్ నోట్‌తో మొదలైన ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్

  • Published Feb 06, 2024 | 6:53 PM Updated Updated Feb 06, 2024 | 6:53 PM

పరుశురామ్- విజయ్ దేవర కొండ కాంబోలో వచ్చిన గీతా గోవిందం ఎంతటి సక్సెస్ సాధించిందో అందరికీ తెలుసు. ఇప్పుడు ఇదే కాంబోలో మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రాబోతుంది. అదే ఫ్యామిలీ స్టార్. తాాాజాగా ప్రమోషన్ స్టార్ చేసింది చిత్ర యూనిట్.

పరుశురామ్- విజయ్ దేవర కొండ కాంబోలో వచ్చిన గీతా గోవిందం ఎంతటి సక్సెస్ సాధించిందో అందరికీ తెలుసు. ఇప్పుడు ఇదే కాంబోలో మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రాబోతుంది. అదే ఫ్యామిలీ స్టార్. తాాాజాగా ప్రమోషన్ స్టార్ చేసింది చిత్ర యూనిట్.

  • Published Feb 06, 2024 | 6:53 PMUpdated Feb 06, 2024 | 6:53 PM
పాజిటివ్ నోట్‌తో మొదలైన ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్

గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ కలిసి ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఎన్టీఆర్ దేవర విడుదల కావాల్సిన ఏప్రిల్ 5న ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ రానుంది. దేవర సినిమా గ్రాఫిక్స్ వర్క్ వల్ల పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. టైటిల్ అనౌన్స్ చేసిన తర్వాత ఇది ఔట్ డేటెడ్ సినిమా అని ఒక వర్గం ప్రేక్షకులు భావించారు. ఇక పరశురామ్ ఇటీవలే మహేష్ బాబుతో చేసిన సినిమా సర్కారు వారి పాట. అది మాస్, ఇది క్లాస్ మూవీ కావడంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలను తగ్గించింది. ఏదేమైనా, ప్రేక్షకుల దృక్పథాన్ని ఫ్యామిలీ స్టార్ చిత్ర యూనిట్ చిన్న ప్రోమోతో మార్చేసింది.

‘నంద నందన’ అంటూ నిన్న చిత్ర బృందం విడుదల చేసిన చిన్న ఆడియో గ్లింప్స్ ప్రేక్షకులతో ఒక ఇన్ స్టంట్ కనెక్షన్ ను ఏర్పరచుకుంది. ఏ సినిమాకైనా మొదటి పాట గనక చార్ట్ బస్టర్ గా మారితే అది ఖచ్చితంగా ఆ సినిమాని బాగా ప్రమోట్ చేస్తుంది. గీత గోవిందం సినిమాకి బ్లాక్ బస్టర్ ఆడియో అందించిన సంగీత దర్శకుడు గోపి సుందర్ ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమాకు కూడా అదే తరహాలో అద్భుతమైన పాటలు ఇస్తారని అందరూ అంచనాలు పెట్టుకున్నారు. నిన్న రాత్రి విడుదలైన నంద నందన పాట ప్రోమో విజయ్ దేవరకొండ అభిమానులతో పాటు ఇతర ప్రేక్షకులకి కూడా ఎంతో నచ్చింది.

కాగా ఫుల్ సాంగ్ రేపు అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ సమయంలో దర్శకుడు పరశురామ్ కంటే గోపీసుందర్ ఈ ప్రాజెక్టు పై మరింత పాజిటివిటీని నింపగలరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. విజయ్ కు జోడీగా నటి మృణాల్ ఠాకూర్ నటించడం కూడా ఫ్యామిలీ స్టార్ కు మరింత క్రేజ్ తీసుకు వస్తుంది. సీతా రామంలో సీతగా, హాయ్ నాన్నలో యశ్న గా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించిన మృణాల్ మరోసారి తన మార్క్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş