Somesekhar
పుష్ప మూవీ చేయడం వల్ల తనకు ఎలాంటి ఉపయోగం లేదని, తన కెరీర్ కు పెద్దగా ఉపయోగపడింది కూడా లేదని షాకింగ్ కామెంట్స్ చేశాడు ఫహద్ ఫాజిల్. పూర్తి వివరాల్లోకి వెళితే..
పుష్ప మూవీ చేయడం వల్ల తనకు ఎలాంటి ఉపయోగం లేదని, తన కెరీర్ కు పెద్దగా ఉపయోగపడింది కూడా లేదని షాకింగ్ కామెంట్స్ చేశాడు ఫహద్ ఫాజిల్. పూర్తి వివరాల్లోకి వెళితే..
Somesekhar
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్– సుకుమార్ కాంబోలో 2021లో వచ్చిన చిత్రం ‘పుష్ప ది రైజ్’. ఈ చిత్రం ఇండియా వైడ్ గా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతూ.. కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో SP షెకావత్ క్యారెక్టర్ లో అదరగొట్టాడు మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్. షెకావత్ పాత్రతో పాన్ ఇండియా రేంజ్ లో అతడి పేరు మారుమోగిపోయింది. అయితే ఇంతటి పేరు తెచ్చి పెట్టిన ఈ పాత్ర వల్ల తనకు ఎలాంటి లాభం లేదని షాకింగ్ కామెంట్స్ చేశాడు ఫహద్. ప్రస్తుతం అతడి కామెంట్స్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.
ఫహద్ ఫాజిల్.. పుష్ప మూవీలో షెకావత్ పాత్రతో ఇండియా మెుత్తం తెలిసిపోయాడు. అయితే ఈ పాత్ర చేయకముందే అతడు మలయాళంలో బిగ్ స్టార్. ఈ పాత్రతో మరింతగా పేరు తెచ్చుకున్నాడు. కానీ పుష్ప మూవీ వల్ల తనకు ఎలాంటి లాభం లేదని చెప్పి అందరికి షాకిచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫహద్ ఈ వ్యాఖ్యలు చేశాడు. పుష్ప మూవీ తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో యాక్టర్ గా ప్రశంసలు వస్తున్నాయి కదా? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అని యాంకర్ ప్రశ్నించగా.. ఫహద్ ఫాజిల్ సమాధానం ఇస్తూ..
“పుష్ప చిత్రం వల్ల నేను ఎలాంటి లాభాన్ని పొందలేదు. పైగా అది నా కెరీర్ కు పెద్దగా ఉపయోగపడింది కూడా లేదు. ఇదే విషయం నేను సుకుమార్ కు కూడా చెప్పాను. ఇందులో దాచాల్సింది ఏమీ లేదు. అబద్దం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఇక పుష్ప తర్వాత నేను ఎక్కువగా మలయాళం మూవీసే చేశాను. కానీ ఇప్పుడు మలయాళం బాష తెలియని వారు కూడా నా సినిమాలు చూస్తున్నారు. అదొక్కటే నాకు సంతోషాన్ని ఇస్తోంది. ఈ విషయం చెప్పి.. నేను ఏ ప్రాంతం వారిని, ఎవ్వరినీ అగౌరవ పరచడం లేదు. అలాంటి ఉద్దేశం కూడా నాకు లేదు” అంటూ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు ఫహద్ ఫాజిల్. అయితే ప్రస్తుతం అతడు చేసిన ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. పుష్ప మూవీ వల్లే నువ్వు ఇండియా వైడ్ గా తెలిశావ్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తుండగా.. అతడి అభిప్రాయం చెప్పాడు అందులో తప్పేముంది అంటూ మరికొందరు రాసుకొస్తున్నారు. మరి ఫహద్ ఫాజిల్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.