iDreamPost

ఆర్యకు 20 ఏళ్లు.. నా జీవితాన్ని మార్చేసిన సినిమా: అల్లు అర్జున్

అల్లు వారి పిల్లగాడు అర్జున్ డాడీలో క్యామియోలో నటించి.. గంగోత్రిలో తన నటనతో అదరగొట్టాడు. కానీ వ్యక్తిగతంగా కొన్ని విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత వచ్చిన ఆర్యతో ఒక్కసారిగా మేకోవర్ అయ్యి.. లవర్ బాయ్ పాత్రలో కనిపించాడు.

అల్లు వారి పిల్లగాడు అర్జున్ డాడీలో క్యామియోలో నటించి.. గంగోత్రిలో తన నటనతో అదరగొట్టాడు. కానీ వ్యక్తిగతంగా కొన్ని విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత వచ్చిన ఆర్యతో ఒక్కసారిగా మేకోవర్ అయ్యి.. లవర్ బాయ్ పాత్రలో కనిపించాడు.

ఆర్యకు 20 ఏళ్లు.. నా జీవితాన్ని మార్చేసిన సినిమా: అల్లు అర్జున్

అల్లు వారి ఇంటి నుండి వచ్చిన తొలి హీరో అర్జున్. తాత అల్లు రామలింగయ్య కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తే.. తండ్రి చిన్న క్యారెక్టర్స్‌తో పాటు నిర్మాతగా పేరు గడించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్స్ పేరుతో ఎన్నో మంచి చిత్రాలను అందించారు అల్లు అరవింద్. వీరిద్దరిని నుండి వారసత్వాన్ని తీసుకున్న బన్నీ.. తొలి రెండు సినిమాలతో (డాడీ, గంగోత్రి) నటనలో మెప్పించాడు కానీ.. ఫిజికల్‌గా పలు విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ విమర్శలను తిప్పికొడుతూ.. అతడిని లవర్ బాయ్‌గా మార్చేసిన చిత్రం ఆర్య. విమర్శించిన నోళ్లతోనే మెప్పుపొందాడు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరోకు దక్కని అరుదైన గౌరవ పురస్కారాన్ని అందుకున్నాడు. సుమారు 70 ఏళ్ల జాతీయ చలన చిత్ర అవార్డుల్లో జాతీయ ఉత్తమ నటుడిగా నిలిచిన ఏకైన టాలీవుడ్ నటుడిగా నిలిచాడుఈ ఐకాన్ స్టార్.

ఇంతటి పేరు గడించడానికి కారణమైన మూవీ ఆర్య. ఈ సినిమా వచ్చి నేటితో 20 ఏళ్లు గడించింది. ఈ సందర్భంగా ఆర్య మూవీ గురించి ఓ ఇంట్రస్టింగ్ పోస్టు రాశాడు బన్నీ. ‘20 ఇయర్స్ ఆర్య. ఇది కేవలం మూవీ మాత్రమే కాదు. నా జీవితాన్ని గమనాన్ని మార్చేసిన అతి పెద్ద మూమెంట్. ఎప్పటికి రుణపడి ఉంటా’ అంటూ ట్వీట్ చేశాడు. కేవలం అల్లు అర్జున్నే కాదు పలువురి జీవితాను మార్చేసిన చిత్రం ఇది. తొలి పిక్చర్‌తోనే తన మార్క్ డైరెక్షన్‌తో ఆకట్టుకున్నాడు ఈ లెక్కల మాస్టార్ సుకుమార్. దిల్ రాజు, దేవీశ్రీ ప్రసాద్, డీపీఓ రత్నవేల్ వంటి ఇలా ఈ సినిమాతో ముడిపడిన ప్రతి ఒక్కరి లైఫ్ చేంజిగ్ చిత్రంగా మారిపోయింది. సినిమా స్టోరీ కొత్తగా ఉండటంతో పాటు పాటలు మనస్సును హత్తుకుంటూ ఉంటాయి.

‘ఫీల్ మై లవ్’, ‘ఏదో ప్రియ రాగం వింటున్నా’, ‘ఆ అంటే అమలా పురం’ , ‘థకదిమితోం..థకదిమితోం’ సాంగ్స్ ఇప్పటికి చార్ట్ బస్టర్సే. కేవలం రూ. 4 కోట్లతో నిర్మించిన ఆర్య మూవీ. . 2004లో మే 7న థియేటర్లలో రిలీజైన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాకుండా.. రూ. 30 కోట్ల వసూళ్లను చేసింది. ఇందులో అన్షూ మెహతా హీరోయిన్‌గా నటించగా.. శివ బాలాజీ, రాజన్ పి దేవ్, సునీల్, వేణు మాధవ్, సుబ్బరాజు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాతో అల్లు అర్జున్ కాస్త.. మలయాళ ఇండస్ట్రీలోకి మల్లు అర్జున్‌గా మారిపోయాడు. మాలీవుడ్ హీరోలతో సమానంగా.. బన్నీ సినిమాలను వాచ్ చేసి.. సక్సెస్ చేస్తుంటారు. ఒక్క సినిమాతోనే సుకుమార్.. స్టార్ డైరెక్టర్‌గా అవతరించారు. ఆ తర్వాత సుక్కు-అర్జున్ కాంబోలో వచ్చిన పుష్పతో బాక్సాఫీసును షేక్ చేసేశారు. ఇప్పుడు పుష్ప-2తో రికార్డులు తిరగరాసేందుకు సిద్ధమయ్యారు ఈ ఇద్దరు. ఆగస్టు 15న పుష్ప-2 విడుదల కానుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి