iDreamPost
android-app
ios-app

సలార్ తో పోటీ నుండి తప్పుకోనున్న డుంకి..?

  • Author ajaykrishna Updated - 11:53 AM, Fri - 13 October 23
  • Author ajaykrishna Updated - 11:53 AM, Fri - 13 October 23
సలార్ తో పోటీ నుండి తప్పుకోనున్న డుంకి..?

ఈ ఏడాది క్రిస్మస్ ఫెస్టివల్ చాలా రసవత్తరంగా ఉండబోతుందని ఇండియా వైడ్ మూవీ లవర్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. అందుకు కారణం.. రెండు బిగ్గెస్ట్ మూవీస్ ఒకేరోజు రిలీజ్ కన్ఫర్మ్ చేసుకున్నాయి. అందులో ఒకటి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్.. రెండోది బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ నటించిన డుంకి. ఈ రెండు సినిమాలు క్రిస్మస్ సందర్బంగా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించేశారు మేకర్స్. దీంతో రెండు సినిమాల ఫ్యాన్స్ చాలా ఎక్సయిట్ మెంట్ తో ఉన్నారు. అటు ప్రభాస్.. ఇటు షారుఖ్ అసలు బాక్సాఫీస్ వార్ ఎలా ఉండబోతుందో చూద్దామని ఇంటరెస్ట్ పీక్స్ కి చేరుకుంది.

ఎందుకంటే.. పాన్ ఇండియా క్రేజ్ ఉన్న సౌత్ హీరోకి, ఆల్రెడీ ఇండియా వైడ్ క్రేజ్ ఉన్న షారుఖ్ ఖాన్ తో పోటీ పడటం అంటే మామూలు విషయం కాదు. పైగా రెండు సినిమాలపై హైప్ మాములుగా లేదు. అందుకు కారణం.. హీరోలు మాత్రమే కాదు. దర్శకులు కూడా. సలార్ సినిమాని కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. కేజీఎఫ్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతేడాది కేజీఎఫ్ 2 ఏకంగా రూ. 1200 కోట్లకు పైన వసూల్ చేసింది. ఇప్పుడు ప్రశాంత్ – ప్రభాస్ కాంబినేషన్ లో సలార్ వస్తుండటంతో ఫ్యాన్స్ లో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

మరోవైపు డుంకి సినిమా దర్శకుడు రాజ్ కుమార్ హిరాని. ఇండియన్ సినిమాని డిఫరెంట్ వేలో ప్రెజెంట్ చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఒక మున్నాభాయ్, త్రీఇడియట్స్, పీకే, సంజూ.. ఇలా ఒకదాన్ని మించి మరోటి బ్లాక్ బస్టర్స్ తీశారు. ఆయన ఇప్పుడు షారుఖ్ తో డుంకి చేసేసరికి ఖచ్చితంగా అంచనాలు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. కాకపోతే.. ప్రస్తుతం డుంకి రిలీజ్ కి సంబంధించి ఇండస్ట్రీ వర్గాలలో పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. అదేంటంటే.. ఇన్నిరోజులు షారుఖ్ డుంకి డిసెంబర్ 22న వస్తుందని కన్ఫర్మ్ చేస్తూ వచ్చారు. కానీ.. తాజా సమాచారం ప్రకారం.. డుంకి క్రిస్మస్ కి రావడం కష్టమేనని టాక్ నడుస్తుంది. ఎందుకంటే.. డుంకికి సంబంధించి టెక్నికల్ వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదట. అది కంప్లీట్ అవ్వడానికి టైమ్ పడుతుందని.. సో.. డుంకి డిసెంబర్ కి కాకుండా వచ్చే ఏడాది వస్తుందని ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో గానీ.. సలార్ పోటీ నుండి డుంకి తప్పుకోనుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మరి డుంకి రిలీజ్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom