iDreamPost
android-app
ios-app

Charmy Kaur: ‘డబుల్ ఇస్మార్ట్’ రిలీజ్​కు ముందు ఛార్మి సెన్సేషనల్ కామెంట్స్.. ఈ కౌంటర్ వాళ్లకేనా?

  • Published Aug 10, 2024 | 4:00 PM Updated Updated Aug 10, 2024 | 4:10 PM

Double iSmart: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ రిలీజ్​కు రెడీ అయింది. పంద్రాగస్టు కానుకగా ఆడియెన్స్ ముందుకు రానుందీ చిత్రం.

Double iSmart: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ రిలీజ్​కు రెడీ అయింది. పంద్రాగస్టు కానుకగా ఆడియెన్స్ ముందుకు రానుందీ చిత్రం.

  • Published Aug 10, 2024 | 4:00 PMUpdated Aug 10, 2024 | 4:10 PM
Charmy Kaur: ‘డబుల్ ఇస్మార్ట్’ రిలీజ్​కు ముందు ఛార్మి సెన్సేషనల్ కామెంట్స్.. ఈ కౌంటర్ వాళ్లకేనా?

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ రిలీజ్​కు రెడీ అయింది. పంద్రాగస్టు కానుకగా ఆడియెన్స్ ముందుకు రానుందీ చిత్రం. స్టార్ హీరో రామ్ పోతినేని యాక్ట్ చేసిని ఈ ఫిల్మ్​ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. పూరి-రామ్ కాంబోలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ ఎంత పెద్ద హిట్​గా నిలిచిందో తెలిసిందే. ఆ సినిమాలో రామ్ మేనరిజం, పూరి మార్క్ మాస్ డైలాగ్స్, పాటలు యూత్​ను ఓ ఊపు ఊపాయి. దీంతో త్వరలో రాబోతున్న ‘డబుల్ ఇస్మార్ట్’ మీద కూడా అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆగస్టు 15కి ఇతర సినిమాలతో పోటీ ఉన్నా పూరి-రామ్ కాంబో మూవీ కావడం, ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్ కావడంతో ‘డబుల్ ఇస్మార్ట్’ మీద భారీ బజ్ నెలకొంది.

ఒకవైపు ‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి బయటకు వచ్చిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ సినిమాపై ఊపు పెంచేయడం, మరోవైపు ప్రమోషన్స్​లో కూడా వేగం పెరగడంతో రామ్ ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. తమ హీరో మరో బ్లాక్​బస్టర్ కొట్టడం పక్కా అని భావిస్తున్నారు. అయితే ‘డబుల్ ఇస్మార్ట్’ రిలీజ్ అవడం కష్టమేనని.. ‘లైగర్’ సినిమాకు సంబంధించిన నష్టపరిహారం గొడవ వల్ల విడుదల ఆగిపోవచ్చంటూ నెట్టింట రూమర్స్ మొదలయ్యాయి. మూవీ బిజినెస్ ఆల్రెడీ క్లోజ్ అయిందని కానీ ఎగ్జిబిటర్లు సహకరించడం లేదని.. ‘డబుల్ ఇస్మార్ట్’ పంద్రాగస్టుకు రిలీజ్ అవడం సాధ్యం కాదని సోషల్ మీడియాలో పుకార్లు ఊపందుకున్నాయి. తాజాగా ఈ అంశంపై చిత్ర నిర్మాత ఛార్మి రియాక్ట్ అయ్యారు. సినిమా ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15న రిలీజ్ అవుతుందని ఆమె క్లారిటీ ఇచ్చారు.

ఛార్మి కౌర్ తాజాగా ట్విట్టర్ వేదికగా ఓ సంచలన పోస్ట్ పెట్టారు. ఇందులో ‘డబుల్ ఇస్మార్ట్’ రిలీజ్ గురించి ఆమె క్లారిటీ ఇచ్చారు. డబ్బు మనుషుల్ని మార్చలేదని అన్నారు. ఇలాంటి అనుభవాలు ఎంతో నేర్పిస్తాయని.. ఇక్కడ ఉన్నవారికి మాత్రమే అవి తెలుస్తాయన్నారు. ఆగస్టు 15వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీగా ‘డబుల్ ఇస్మార్ట్​’ను విడుదల చేయనున్నామని ఛార్మి స్పష్టం చేశారు. నిర్మాతగా ఉన్నందుకు ఎంతో గర్విస్తున్నానని తెలిపారు. దీన్ని చూసిన ఫ్యాన్స్.. నిన్న మొన్నటి వరకు మూవీ రిలీజ్​పై ఉన్న అనుమానాలను ఛార్మి ఒక్క పోస్ట్​తో పటాపంచలు చేశారని అంటున్నారు. సినిమా విడుదల అవ్వదంటూ ప్రచారం చేసిన ట్రోలర్స్​కు ఒక్క పోస్ట్​తో ఆమె గట్టిగా ఇచ్చిపడేశారని చెబుతున్నారు. మరి.. ‘డబుల్ ఇస్మార్ట్’ రిలీజ్ కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomJojobetjojobetholiganbetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet