iDreamPost
android-app
ios-app

Double iSmart Movie OTT: రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ వచ్చేది ఆ OTTలోకే!

  • Published Aug 15, 2024 | 10:48 AM Updated Updated Aug 15, 2024 | 3:14 PM

ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన కొత్త చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా పంద్రాగస్టు కానుకగా గురువారం ఆడియెన్స్ ముందుకు వచ్చింది.

ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన కొత్త చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా పంద్రాగస్టు కానుకగా గురువారం ఆడియెన్స్ ముందుకు వచ్చింది.

  • Published Aug 15, 2024 | 10:48 AMUpdated Aug 15, 2024 | 3:14 PM
Double iSmart Movie OTT: రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ వచ్చేది ఆ OTTలోకే!

ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన కొత్త చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బ్లాక్​బస్టర్ హిట్ ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్ కావడం, పూరి-రామ్ కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో ‘డబుల్ ఇస్మార్ట్’పై ఎక్స్​పెక్టేషన్స్ మరింత పెరిగాయి. ఇద్దరూ సూపర్ హిట్ కోసం ఎదురు చూస్తుండటం, విజయం సాధించాలని కసిగా కనిపిస్తుండటంతో ఈ ఫిల్మ్​ అదిరిపోతుందని అంతా అనుకుంటున్నారు. టీజర్, ట్రైలర్, సాంగ్స్ రూపంలో వచ్చిన ప్రమోషన్ కంటెంట్ కూడా బాగుండటంతో భారీ బజ్ నెలకొంది. దీంతో ఈ మూవీ ఎలా ఉంది? అనే ఇంట్రెస్ట్​తో పాటు ఏ ఓటీటీలోకి రాబోతోంది అనే క్వశ్చన్ కూడా ప్రేక్షకుల్లో ఉంది. ఈ నేపథ్యంలో అసలు ‘డబుల్ ఇస్మార్ట్’ ఏ ఓటీటీలోకి రాబోతోందనేది ఇప్పుడు చూద్దాం..

రామ్ గత చిత్రం ‘స్కంద’ బాగానే వసూళ్లు సాధించినా అంతగా అంచనాలను అందుకోలేకపోయింది. అటు పూరి జగన్నాథ్ లాస్ట్ ఫిల్మ్ ‘లైగర్’ అందర్నీ నిరాశపర్చింది. దీంతో ఈ ఇద్దరికీ అర్జెంట్​గా హిట్ అవసరం ఉంది. అలాంటి ఇద్దరూ కలసి సినిమా చేయడంతో ‘డబుల్ ఇస్మార్ట్’ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్​గా మారింది. ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ అవడం, పూరి-రామ్ కాంబో అంటే ఫుల్ మాస్​గా ఉంటుందని తెలుసు కాబట్టి ప్రేక్షకులు చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. సినిమా నుంచి వచ్చిన అప్​డేట్స్ చూసి బొమ్మ బ్లాక్​బస్టర్ అని ఫిక్స్ అయిపోయారు. దీంతో మూవీ ఎలా ఉంటుందనే క్వశ్చన్​ను పక్కనబెట్టేసి ఏ ఓటీటీలోకి వస్తుందనేది కనుక్కునే పనిలో పడ్డారు.

double ismart ott

గతంలో కొత్త సినిమాల ఓటీటీ పార్ట్​నర్​ ఎవరనేది అఫీషియల్​గా అనౌన్స్ చేసేవరకు తెలిసేది కాదు. కానీ థియేటర్లలో ప్రదర్శించే సమయంలో డిజిటల్ మీడియా పార్ట్​నర్స్​కు క్రెడిట్స్ ఇస్తున్నారు. దీంతో వెండితెర మీద బొమ్మ పడగానే ఏ ఓటీటీలోకి వస్తుందనేది తెలిసిపోతోంది. ఇలాగే ఇప్పుడు ‘డబుల్ ఇస్మార్ట్’ ఓటీటీ పార్ట్​నర్ ఎవరో తెలిసిపోయింది. ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ రామ్ కొత్త చిత్రం ఓటీటీ రైట్స్​ను సొంతం చేసుకుంది. అయితే ‘డబుల్ ఇస్మార్ట్’ స్ట్రీమింగ్ మీద మాత్రం ఇప్పుడే ఏదీ చెప్పలేం. డిజిటల్ పార్ట్​నర్​తో మూవీ టీమ్ చేసుకున్న ఒప్పందం, అలాగే థియేట్రికల్ రన్​ను బట్టి ఓటీటీ స్ట్రీమింగ్​ను డిసైడ్ చేస్తారు. మరి.. ‘డబుల్ ఇస్మార్ట్’ను మీరు చూశారా? ఒకవేళ చూసినట్లయితే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.