iDreamPost
android-app
ios-app

Double iSmart: భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్​తో బరిలోకి ‘డబుల్ ఇస్మార్ట్’! పూరి-రామ్​ సాధిస్తారా?

  • Published Aug 13, 2024 | 7:21 PM Updated Updated Aug 13, 2024 | 7:21 PM

Ram Pothineni-Puri Jagannadh: స్టార్ హీరో రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కిన కొత్త చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఈ మూవీ ఇంకో రెండ్రోజుల్లో ఆడియెన్స్ ముందుకు రానుంది. రామ్-పూరి లాంటి క్రేజీ కాంబోలో రూపొందడం, ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్​బస్టర్​కు సీక్వెల్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Ram Pothineni-Puri Jagannadh: స్టార్ హీరో రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కిన కొత్త చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఈ మూవీ ఇంకో రెండ్రోజుల్లో ఆడియెన్స్ ముందుకు రానుంది. రామ్-పూరి లాంటి క్రేజీ కాంబోలో రూపొందడం, ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్​బస్టర్​కు సీక్వెల్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

  • Published Aug 13, 2024 | 7:21 PMUpdated Aug 13, 2024 | 7:21 PM
Double iSmart: భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్​తో బరిలోకి ‘డబుల్ ఇస్మార్ట్’! పూరి-రామ్​ సాధిస్తారా?

ఈ ఏడాది మోస్ట్ అవేటెడ్ మూవీస్​లో ఒకటైన ‘డబుల్ ఇస్మార్ట్’ ఇంకో రెండ్రోజుల్లో ఆడియెన్స్ ముందుకు రానుంది. పూరి జగన్నాథ్-రామ్ పోతినేని లాంటి క్రేజీ కాంబోలో తెరకెక్కడం, ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్​బస్టర్​కు సీక్వెల్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పంద్రాగస్టు కానుకగా విడుదల కానున్న ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది? ఫస్ట్ పార్ట్ వసూళ్లను క్రాస్ చేస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో అసలు రామ్ లేటెస్ట్ ఫిల్మ్​కు అయిన బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలి? అనేది తెలుసుకునేందుకు కూడా మూవీ లవర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండిపెండెన్స్ డే బరిలోకి దిగుతున్న ‘డబుల్‌ ఇస్మార్ట్’ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతనేది ఇప్పుడు తెలుసుకుందాం..

‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ నైజాం హక్కులు రూ.15 కోట్లుగా ట్రేడ్ పండితులు లెక్కగట్టారు. ఈ ఏరియాలో ప్రైమ్ షో ఫిల్మ్స్ సినిమాను ఓన్ రిలీజ్ చేస్తోంది. ఈ చిత్రం సీడెడ్ రైట్స్ రూ.7 కోట్లు, ఆంధ్రాలో అన్ని ప్రాంతాలు కలుపుకొని రూ.17 కోట్లకు అమ్ముడుపోయాయని ట్రేడ్ టాక్ నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రామ్ పోతినేని నయా ఫిల్మ్ రూ.39 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్​ చేసిందని సమాచారం. హిందీ వెర్షన్​తో పాటు కర్ణాటక స్టేట్, రెస్టాఫ్ ఇండియా హక్కులు కలిపితే రూ.6 కోట్లు వచ్చాయని వినిపిస్తోంది. ఓవర్సీస్ రైట్స్ కింద ఇంకో రూ.3 కోట్లు వచ్చాయని.. మొత్తంగా ‘డబుల్ ఇస్మార్ట్’ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.48 కోట్లు అని ఫిల్మ్ నగర్ టాక్.

‘డబుల్ ఇస్మార్ట్’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.49 కోట్ల షేర్ అని సమాచారం. పంద్రాగస్టుకు ‘మిస్టర్ బచ్చన్’, ‘తంగలాన్’, ‘ఆయ్’ రూపంలో భారీ పోటీ ఉంది. దీంతో బాక్సాఫీస్ వద్ద టఫ్ కాంపిటీషన్ తప్పేలా లేదు. అయితే పూరి-రామ్ కాంబోకు ఉన్న క్రేజ్ దృష్ట్యా పాజిటివ్ టాక్ వస్తే ‘డబుల్ ఇస్మార్ట్’ భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్​ను ఈజీగా రీచ్ అవుతుందని ట్రేడ్ ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. లాంగ్ వీకెండ్ ఉన్నందున సినిమా ఈజీగా ప్రాఫిట్ జోన్​లోకి వస్తుందని చెబుతున్నారు. మంచి టాక్ వచ్చి లాంగ్ రన్ కొనసాగితే రామ్ కెరీర్​లో బిగ్ హిట్​గా నిలిచే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. సినిమాలో యూత్, మాస్​ను ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉన్నాయని.. వాళ్లకు కనెక్ట్ అయితే బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురవడం గ్యారెంటీ అని అంటున్నారు. మరి.. ‘డబుల్ ఇస్మార్ట్’ ఫుల్ రన్​లో ఎంత కలెక్ట్ చేస్తుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by Skyupsmedia (@skyupsmedia)