iDreamPost
android-app
ios-app

Jr. NTR పక్కన ప్రేమలు బ్యూటీ మమితా బైజు? నిజమైతే లక్కీ ఛాన్స్!

  • Published Mar 16, 2024 | 2:07 PM Updated Updated Mar 16, 2024 | 2:07 PM

"ప్రేమలు" సినిమాతో తెలుగు వారి మదిని దోచుకున్న మలయాళీ భామ మమిత బైజు.. పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ కు జోడిగా నటించే ఛాన్స్ కొట్టేసిందంటూ.. సోషల్ మీడియాలో బాగా బజ్ నడుస్తోంది. మరి, దీనికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

"ప్రేమలు" సినిమాతో తెలుగు వారి మదిని దోచుకున్న మలయాళీ భామ మమిత బైజు.. పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ కు జోడిగా నటించే ఛాన్స్ కొట్టేసిందంటూ.. సోషల్ మీడియాలో బాగా బజ్ నడుస్తోంది. మరి, దీనికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

  • Published Mar 16, 2024 | 2:07 PMUpdated Mar 16, 2024 | 2:07 PM
Jr. NTR పక్కన ప్రేమలు బ్యూటీ మమితా బైజు? నిజమైతే లక్కీ ఛాన్స్!

మలయాళీ సినిమా “ప్రేమలు” ఒరిజినల్ లాంగ్వేజ్ తో పాటు.. తెలుగులోనూ సంపాదించుకున్న క్రేజ్ అంత ఇంత కాదు. తెలుగు ఇండస్ట్రీకి డబ్బింగ్ సినిమాగా వచ్చి.. స్టార్ డైరెక్టర్స్ , హీరోస్ ప్రశంసలు సైతం అందుకుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన మమిత బైజుకు.. కుర్రకారంతా ఫిదా అయిపోయారు. తెలుగులో ఇండస్ట్రీలో ఈ అమ్మడికి సినిమా ఆఫర్లు క్యూ కడుతున్నాయన్న బజ్ కూడా బాగానే వినిపిస్తోంది. అది కూడా పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్ కు జోడిగా మమిత ఛాన్స్ కొట్టేసిందంటూ.. నెట్టింట ఓ వార్త షికార్లు చేస్తోంది. మలయాళీ భామలకు తెలుగులో ఆఫర్లు రావడం మాట పక్కన పెడితే.. మమితకు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ తో కలిసి నటించే అవకాశం వచ్చిందంటూ టాక్ మొదలైంది. మరి దానిలో ఎంతవరకు నిజం ఉంది!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ అండ్ ఫ్యాన్ బేస్ గురించి.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ హీరోతో జత కట్టాలంటే .. హీరోయిన్స్ కు రాసి పెట్టి ఉండాలని అంతా అనుకుంటూ ఉంటారు. అందుకే ఈ హీరోతో కలిసి నటించడం కోసం చాలా మంది హీరోయిన్స్ ఎదురు చూస్తూ ఉంటారు. కానీ, నిన్న మొన్న సైలెంట్ గా డబ్బింగ్ సినిమాతో తెలుగు వారికి పరిచయం అయినా.. మమిత బైజుకు మాత్రం ఈ అదృష్టం వెంటనే లభించిందని.. తారక్ తో కలిసి హీరోయిన్ గా నటించే ఛాన్స్ మమితకు దక్కిందనే టాక్ మొదలైంది. మమితకు అటు యాక్టింగ్ తో పాటు, ఇటు డ్యాన్స్ కూడా బాగానే వచ్చు. సో ప్రేమలు తో అందరిని కట్టిపడేసింది. కాబట్టి ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. అయితే, ఇప్పుడు ఎన్టీఆర్ నటిస్తున్న వార్-2 సినిమాలో తారక్ కు జోడిగా ఓ సౌత్ హీరోయిన్ కావాలి. సరిగా ఇదే సమయానికి మమితకు క్రేజ్ పెరగడంతో.. వార్-2 సినిమాలో నటించేందుకు.. మమిత బైజును సెలెక్ట్ చేశారంటూ టాక్ వినిపిస్తోంది.

Mamitha

మరి, ఒకవేళ ఈ న్యూస్ కనుక నిజమైతే.. వార్ -2 సినిమాతో మమిత క్రేజ్ .. ఇంకా పెరిగిపోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే, ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ అంటే చాలా పెద్ద డీల్. వరల్డ్ వైడ్ గా ఈ సినిమాపై అందరికి భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు ఈ సినిమాలో నటించేవారంతా పెద్ద స్టార్స్ ఏ ఉన్నారు. సో నిన్న మొన్న వచ్చిన మమిత బైజును వార్-2 లో ఎందుకు తీసుకుంటారు! అని ఓ వర్గం ప్రేక్షకులు భావిస్తున్నారు. కానీ, దర్శకుడు అయాన్ ముఖర్జీ మాత్రం ఎన్టీఆర్ కు జోడిగా మమిత బావుంటుందని అనుకున్నాడట. పైగా వీరిద్దరి జోడి అందరికి ఫ్రెష్ గా కనిపిస్తుందని భావిస్తున్నాడట దర్శకుడు. ఈ విషయమై మూవీ మేకర్స్ నుంచి పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో మమిత బైజు గురించి నడుస్తున్న టాక్ పై .. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom