iDreamPost
android-app
ios-app

జూ ఎన్టీఆర్‌తో ఉన్న ఈ చిన్నారి ఎవరో తెలుసా..? వైరల్ అవుతున్న పిక్

  • Published Oct 01, 2023 | 12:40 PM Updated Updated Oct 01, 2023 | 12:40 PM
  • Published Oct 01, 2023 | 12:40 PMUpdated Oct 01, 2023 | 12:40 PM
జూ ఎన్టీఆర్‌తో ఉన్న ఈ చిన్నారి ఎవరో తెలుసా..? వైరల్ అవుతున్న పిక్

ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు జూ ఎన్టీఆర్. అతడి నెక్ట్ మూవీపై ఫ్యాన్స్ మస్త్ ఎక్స్ పెక్టెషన్స్ పెట్టుకున్నారు. వారి అంచనాలు ఏ మాత్రం తగ్గించుకుండా మరో పాన్ ఇండియా సినిమా దేవరతో ముందుకు వస్తున్నాడు తారక్. ఆచార్య ప్లాప్ తర్వాత కొరటాల శివ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ హిట్ కొట్టిన సంగతి విదితమే. ఇప్పుడు అదే కాంబినేషనలో సినిమా వస్తుండటంతో మరింత ఆసక్తి నెలకొంది. అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇంకా చిత్రీకరణే పూర్తి చేసుకుని ఈ సినిమాకు ముందు నుండే భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. ఇప్పటికే ఓటీటీ హక్కులను రూ. 40 కోట్లకు కొనుగోలు చేసింది నెట్ ఫ్లిక్స్.

ఇదిలా ఉంటే..షూటింగ్ గ్యాప్‌లో ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లొస్తుంటారు తారక్. ఇటీవల సైమా అవార్డ్స్ దుబాయ్‌లో జరగ్గా.. ఆర్ఆర్ఆర్ సినిమాకు గానూ ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్న సంగతి విదితమే. అయితే ఆయన ఏ టూర్ కు వెళ్లినా, ఎక్కడ కనిపించినా.. ఎవరితో ఉన్నా.. ఆ ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వెంటనే ప్రత్యక్షమౌతాయి. అలాగే వైరల్ కూడా అవుతుంటాయి. తాజాగా ఓ చిన్నారితో ఉన్న ఫోటో హల్ చల్ చేస్తుంది. తారక్‌కు ఇద్దరు అబ్బాయిలేనన్న విషయం అందరికీ తెలిసిందే.  ఓ చిన్నారిని తారక్ తన ఒడిలో కూర్చొబెట్టుకుని, తనతో ఆడుతున్నట్లు ఉన్న ఫోటోను చూసి  ఆ పాప ఎవరా అని ఆరా తీస్తున్నారు. దీంతో ఆ పాప తన మేనకోడలు అంటూ క్లారిటీ ఇచ్చారు ఆటో రాం ప్రసాద్.. అలియాస్ జబర్దస్త్ రాం ప్రసాద్. ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు.

సముద్రం బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కుతున్న దేవర సినిమాకు భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేశారట దర్శకుడు కొరటాల శివ. అన్ని జాగ్రత్తలు తీసుకుని ఫైట్లను తెరకెక్కించారని వినికిడి. ముఖ్యంగా అండర్ వాటర్ ఫైట్స్ ఈ మూవీకే హైలెట్‌గా నిలుస్తుందని తెలుస్తోంది. మొత్తం 300 కోట్ల రూపాయలతో తెరకెక్కించబోతున్న ఈ చిత్రం, వీఎఫ్ఎక్స్ కోసమే రూ. 140కోట్లు ఖర్చు పెడుతున్నారని ఇండస్ట్రీ టాక్. సవ్యంగా అన్ని సాగిపోతే.. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న థియేటర్లలో సందడి చేయడం ఖాయం. ఇక థియేటర్లు దద్దరిల్లుడే తరువాయి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet