iDreamPost
android-app
ios-app

రంభ పక్కన ఉన్న ఈ కుర్రాడు.. ఎవరో తెలుసా..?

  • Published Feb 13, 2024 | 1:06 PM Updated Updated Feb 13, 2024 | 1:06 PM

ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ పక్కన నిల్చుని అమాయకంగా చూస్తున్న ఈ కుర్రాడిని గుర్తు పట్టారా.. ఇప్పుడు సోషల్ మీడియా సంచలనం. ఎన్నికలు రానీ, హీరోయిన్ కెరీర్ బాగోకపోనీ.. అతడే కావాలి. ఇంతకు ఆ వ్యక్తి ఎవరంటే..?

ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ పక్కన నిల్చుని అమాయకంగా చూస్తున్న ఈ కుర్రాడిని గుర్తు పట్టారా.. ఇప్పుడు సోషల్ మీడియా సంచలనం. ఎన్నికలు రానీ, హీరోయిన్ కెరీర్ బాగోకపోనీ.. అతడే కావాలి. ఇంతకు ఆ వ్యక్తి ఎవరంటే..?

  • Published Feb 13, 2024 | 1:06 PMUpdated Feb 13, 2024 | 1:06 PM
రంభ పక్కన ఉన్న ఈ కుర్రాడు.. ఎవరో తెలుసా..?

తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావు, వచ్చినా వారు స్టార్ హోదాను సంపాదించలేరు అన్న మాటలకు మినహాయింపు రంభ. అచ్చ తెలుగు పదాహారాణాల తెలుగు అమ్మాయి అయిన విజయలక్ష్మి అలియాస్ రంభ. టాలీవుడ్డే కాకుండా బాలీవుడ్, కన్నడ, మలయాళ, బెంగాలీ, భోజ్ పురి, ఇంగ్లీష్ భాషల్లో నటించింది. వందకు పైగా చిత్రాలు నటించిన కథా నాయిక ఆమె. చిరంజీవితో రాధ, విజయ శాంతి తర్వాత అంతే ధీటుగా డ్యాన్స్ చేయగలదన్న పేరును తెచ్చుకుంది. ఆ ఒక్కటి అడక్కుతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చిన్నది.. ఇంద్రకుమార్ అనే వ్యాపార వేత్తను వివాహం చేసుకుని కెనడా టొరంటో వెళ్లిపోయింది. అయితే తిరిగి ఇండియాకు వచ్చి.. టీవీ షోలో పాల్గొంది.

ఇదిగో రంభ పక్కన నిల్చున్న కుర్రాడిని చూశారా.. ఎవరో గుర్తు పట్టండి చూద్దాం. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్. కాస్త చూడగానే అర్థం అయిపోతుంది కదూ.. ప్రముఖ సినీ జ్యోతిష్యుడు వేణు స్వామి అని. ఈ పిక్ ఏ మూవీలో తెలియదు కానీ.. సినిమా ఓపెనింగ్స్ సమయంలా కనిపిస్తుంది. ఇక వేణు స్వామి సంగతి చాలా మందికి తెలిసిందే.  హీరోయిన్లతో పూజలు చేస్తూ ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. చిన్న వయస్సు నుండే ఆయన ఇండస్ట్రీలో ఉన్నట్లు తెలుస్తోంది.  ప్రముఖ హీరోల జ్యోతిష్యం చెబుతూ సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్‌లో రచ్చ రచ్చ చేస్తుంటారు. తనకు ఇండస్ట్రీలోని ప్రముఖుల గురించి, వారి జాతకాలు గురించి బాగా తెలుసునంటూ కబుర్లు చెబుతుంటారు. పేర్లు ప్రస్తావించకుండా.. ఆ సంవత్సరంలో ప్రముఖ హీరో హీరోయిన్లు చనిపోతారంటూ అంటుంటారు.

అలాగే సెలబ్రిటీ పెళ్లిళ్లు పెటాకులు అవుతాయంటూ అపశకునం పలుకుతూ ఉంటారు. అప్పుడప్పుడు అవి నిజమైతే.. ఆ క్రెడిట్ అంతా తనదే అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు.  ఇతడు చెబుతున్న జాతకాలపై హీరోల ఫ్యాన్స్ హార్టై.. తిట్టిపోస్తున్నా పట్టించుకోకుండా జ్యోతిష్యం చెబుతూనే ఉంటారు. విమర్శలు వచ్చినా.. ఆయనతో పూజ చేయించుకుంటే.. కెరీర్ సక్సెస్ అవుతుందని, భవిష్యత్తు బాగుంటుందని నమ్ముతూ ఉంటారు హీరోయిన్లు. రష్మిక మందన్న మొదలుకుని.. ఇనయా సుల్తానా, అషురెడ్డి వరకు వేణు స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేయించుకున్నవారే. ఇక ఆయన భార్య ప్రముఖ సంగీత కళాకారిణి వీణా శ్రీవాణి. మొత్తానికి ఇండస్ట్రీలో ఎప్పటి నుండో సినిమా ఓపెనింగ్స్ సమయంలో పూజాది కార్యక్రమాలు చేస్తూ.. చివరకు ఆ హీరోల జాతకాల చెబుతూ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటారు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetmeritbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom