iDreamPost
android-app
ios-app

ఈ స్టార్ డైరెక్టర్స్.. ఫేమస్ కాకముందు ఈ చిత్రాల్లో నటించారని తెలుసా..?

  • Published Dec 30, 2023 | 3:41 PM Updated Updated Dec 30, 2023 | 3:41 PM

దర్శకులుగా రాణించాలంటే ముందుగా అసిస్టెంట్, అసోసియేట్ డైరెక్టర్లుగా పనిచేయాల్సి ఉంటుంది. కొన్నాళ్ల పాటు పనిచేశాక.. ఆ తర్వాత దర్శకుడిగా ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు వస్తున్న యంగ్ డైరెక్టర్స్ అంతా ఇలా వచ్చిన వారే. ఆ సమయంలో యాక్టింగ్ కూడా షురూ చేస్తుంటారు. ఈ స్టార్ డైరెక్టర్స్.. ఫేమస్ కాకముందు ఈ చిత్రాల్లో నటించారని తెలుసా

దర్శకులుగా రాణించాలంటే ముందుగా అసిస్టెంట్, అసోసియేట్ డైరెక్టర్లుగా పనిచేయాల్సి ఉంటుంది. కొన్నాళ్ల పాటు పనిచేశాక.. ఆ తర్వాత దర్శకుడిగా ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు వస్తున్న యంగ్ డైరెక్టర్స్ అంతా ఇలా వచ్చిన వారే. ఆ సమయంలో యాక్టింగ్ కూడా షురూ చేస్తుంటారు. ఈ స్టార్ డైరెక్టర్స్.. ఫేమస్ కాకముందు ఈ చిత్రాల్లో నటించారని తెలుసా

  • Published Dec 30, 2023 | 3:41 PMUpdated Dec 30, 2023 | 3:41 PM
ఈ స్టార్ డైరెక్టర్స్.. ఫేమస్ కాకముందు ఈ చిత్రాల్లో నటించారని  తెలుసా..?

ఒక మూవీకి కెప్టెన్ ఎవరూ అంటే అది దర్శకుడే. హీరో, హీరోయిన్లు లేకపోయినా సినిమా తీయొచ్చు కానీ.. దర్శకుడు లేకపోతే.. స్క్రీన్ పై మూవీని చూడలేం. ఒక చిత్రాన్ని నడిపించే నావికుడు డైరెక్టర్. 24 క్రాప్టుల్లోని టెక్నీషియన్లను లీడ్ చేసే వ్యక్తి దర్శకుడు మాత్రమే. సినిమా ఇండస్ట్రీలో అనేక మంది డైరెక్టర్లు ప్రూవ్ చేసుకున్నారు.. చేసుకుంటూనే ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో యంగ్ దర్శకులు దూసుకు వచ్చి.. వరుస సక్సెస్‌లు అందుకుంటున్నారు. వీరు దర్శకులుగా మారక ముందు అసిస్టెంట్ లేదా అసోసియేట్ దర్శకులుగా పని చేశారు. కేవలం స్టార్ కెమెరా, రోలింగ్, యాక్షన్ అంటూ సరిపెట్టుకోవడం లేదు.. కదన రంగంలోకి దిగి నటుల అవతారం కూడా ఎత్తారు.

ఇప్పుడు వరుస హిట్లతో మంచి ఫాంలో ఉన్న కొంత మంది యంగ్ అండ్ స్టార్ డైరెక్టర్లు.. గతంలో కొన్ని సినిమాల్లో తెరపై కనిపించారు. వారిని గుర్తు పట్టడం కష్టమే అయినా.. కొంత మంది నెటిజన్లు ఠక్కున గుర్తు పెట్టి.. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న యానిమల్ మూవీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. నాగార్జున కేడీ మూవీలో ఉన్నానంటూ ఓ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేసింది. అలాగే ఆయన అర్జున్ రెడ్డిలో కూడా కనిపిస్తాడు. మరికొంత మంది యంగ్ డైరెక్టర్లు కూడా నటించారు. వారెవరూ ఆ సినిమాలు ఏంటో చూద్దాం. హరీష్ శంకర్.. అందరి వాడు చిత్రంలో బ్రహ్మానందంతో వచ్చే ఓ సీనులో కనిపిస్తాడు. వర్షం మూవీ బస్సు సీనులో వెనుక ఉంటాడు వంశీ పైడిపల్లి.

శ్రీకాంత్ అడ్డాల ఆర్య సినిమాలో ఓ సీన్‌లో మెరుస్తాడు. గోపిచంద్ మలినేని.. స్టాలిన్ చిత్రంలో కనిపిస్తాడు. అతడినైతే మనం గుర్తుపట్టలేం. కల్కితో రాబోతున్న నాగ్ అశ్విన్.. తను దర్శకత్వం వహించిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ మూవీలో క్రికెట్ ఆడే సీనులో మెరుస్తాడు. అనిల్ రావిపూడి.. శౌర్యం పిక్చర్‌లో ఉన్నాడు. ఇలా ఒకరేమిటీ చాలా మంది డైరెక్టర్లు.. పలు సీన్లలో కనిపిస్తారు. కనీసం ఓ పాటలోనైనా అలా దర్శనమిచ్చి వెళుతుంటారు. దర్శక ధీరుడు రాజమౌళి కూడా తన సినిమాలతో పాటు.. ఇతర సినిమాల్లోకూడా కనిపించారు. అలాగే ఇప్పుడు ప్రముఖ స్టార్ డైరెక్టర్స్ సూర్య, గౌతమ్ వాసు దేవ మీనన్ అయితే.. ఏకంగా యాక్టింగ్ లోకి దిగి పోయిన సంగతి విదితమే. మీకు తెలిసిన డైరెక్టర్.. ఏ మూవీలో కనిపించాడో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetcell girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom