iDreamPost
iDreamPost
కేజీఎఫ్ 2కి ఇప్పటికిప్పుడు సీక్వెల్ లేదని తెల్సినా సరే, కేజీయఫ్ 3పై సోషల్ మీడియాలో హడావిడి నడుస్తూనే ఉంది. కేజీయఫ్ 2 క్లైమాక్స్ లో ప్రశాంత్ నీల్ కేజీయఫ్ 3 కి లీడ్ ఇవ్వడంతోనే చాలా థియరీలు పుట్టుకొచ్చాయి. కేజీఎఫ్ ఫ్రాంఛైజీలోకి బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ అడుగు పెడుతున్నాడట.
కేజీఎఫ్ పూర్తిగా సౌత్ ఇండియన్ స్టార్ లతోనే నిండిపోతే, పెరిగిన క్రేజ్ ని బట్టి కేజీయఫ్ 2లో బాలీవుడ్ స్టార్స్ వచ్చారు. రమికా సేన్ గా రవీనాటాండన్, అలాగే అధీరాగా సంజయ్ దత్ అదరగొట్టారు. వీరిద్దరి కాంబినేషన్ తోపాటు, రాకీభాయ్ ఎలివేషన్స్, నార్త్ లోనే 430 కోట్ల కలెక్షన్స్ అందించాయి. బాహుబలి 2 తర్వాత హిందీ మార్కెట్ లో ఆ రేంజ్ వసూళ్లుసాధించిన రెండో సినిమా రికార్డు క్రియేట్ చేసింది కేజీయఫ్2.
మరి కేజీఎఫ్ 3 టార్గెట్ ఎంత? 1500 కోట్లు? అవునంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఆస్థాయి రిజల్ట్స్ రావాలంటే మెరుపులాంటి స్టార్లు కావాలి. అందుకే ప్రశాంత్ నీల్ పార్ట్ 3లో, హీరో హృతిక్ ను రాకీభాయ్ కి తోడుగా దింపుతున్నాడన్నది ప్రచారం. ఈ ఏడాదిలో కేజీయఫ్-3 ఉండదని, హృతిక్ నటిస్తాడో లేడో ఇప్పుడే చెప్పలేమని అంటున్నారు ప్రొడ్యుసర్ విజయ్ కిరంగదూర్. డైరెక్టర్ నీల్ ఇప్పటికే సలార్ షూటింగ్ లో బిజీ. యష్ కూడా కొత్త ప్రాజెక్ట్‌కు కొద్దిరోజుల్లోనే ప్రకటించనున్నారు.
కేజీఎఫ్ బ్లాక్ బస్టర్ ఎఫెక్ట్ సలార్ మీదకూడా పెడింది. సలార్ బడ్జెట్ ను మరో 20 శాతం డైరెక్టర్ పెంచారని, ఆమేరకు భారీ సెట్స్ వేస్తున్నారన్నది శాండల్ వుడ్ టాక్. ముందు బడ్జెట్ 200 కోట్లు. కేజీఎఫ్ ని మించి యాక్షన్ సీన్స్ ఉండాలికాబట్టి, మరో 40 కోట్లు బడ్జెట్ పెంచారు. అంటే ప్రభాస్ మూవీ బడ్జెట్ 250 కోట్లు. ప్రభాస్ స్టామినాకు ఆ బడ్జెట్ అంతా హిందీలోనే రావచ్చు.