Keerthi
Kerala Wayanad Floods: కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లో భారీ వర్షాలు, వరదలు కారణంగా ఎంతటి భీభత్సం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో వరద బాధితులును కాపాడి సహాయక చర్యలు అందించడం కోసం ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సినీ సెలబ్రిటీస్ కూడా ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కేరళ నటుడు మోహన్ లాల్ కూడా వయనాడు వరద బాధితుల కోసం రీల్ హీరో నుంచి రియల్ హీరోగా మారారు.
Kerala Wayanad Floods: కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లో భారీ వర్షాలు, వరదలు కారణంగా ఎంతటి భీభత్సం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో వరద బాధితులును కాపాడి సహాయక చర్యలు అందించడం కోసం ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సినీ సెలబ్రిటీస్ కూడా ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కేరళ నటుడు మోహన్ లాల్ కూడా వయనాడు వరద బాధితుల కోసం రీల్ హీరో నుంచి రియల్ హీరోగా మారారు.
Keerthi
కేరళల రాష్ట్రంలోని ప్రకృతి కన్నెర్ర చేసినట్లు భీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా వయనాడ్ జిల్లాలోని ముండక్కయ్, చూరాల్ మాల, అత్తమల నూల్ పూజా వంటి గ్రామాల్లో కొండ చరియలు విరిగిపడటంతో.. వందలాది మంది ప్రజలు మృతి చెందారు. అలాగే మరి కొందరు అచూకీ కూడా గల్లంతు అ్యింది. దీంతో వయనాడు బాధితులను కాపాడటానికి, అలాగే గల్లంతైనా వారి ఆచూకి తెలుసుకోవడానికి ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాయి. ఇక వారితో పాటు సినీ సెలబ్రిటీస్ సైతం వయనాడ్ బాధితులను ఆదుకోవడం కోసం భారీ ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నారు. కాగా, అందులో ఇప్పటికే సూర్య, జ్యోతిక, కార్తీలు 50 లక్షలు ఇవ్వగా.. కమల్ హాసన్ రూ.25, ముమ్మట్టి రూ.15, దులక్కర్ సల్మాన్ రూ. 10, రష్మిక రూ.10, టాలీవుడ్ నుంచి నిర్మాత నాగవంశఈ రూ.5 లక్షల రూపాయలు విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. తాజాగా ఇప్పుడు కేరళ నటుడు మోహన్ లాల్ స్వయంగా వయనాడ్ వరద బాధితుల కోసం రంగంలో దిగారు. ఇప్పటికే మోహన్ లాల్ తన వంతు సీఎం సహాయనిధికి రూ. 25లక్షలు సహాయం అందించగా.. ఇప్పుడు నేరుగా గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే.. కోజికోడ్ నుంచి రోడ్డుమార్గంలో వయనాడ్‌కి వచ్చిన మోహన్‌లాల్… ఆర్మీ బేస్ క్యాంప్‌లో సైనికులను కలిశారు. ఆ తర్వాత ఆర్మీతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా.. తాత్కాలిక బ్రిడ్జ్‌ల నిర్మాణం, బాధితులకు సహాయం చేయడంలో తనవంతు కృషి చేశారు.
ఈ సందర్భంగా మోహన్ లాల్ మాట్లాడుతూ.. ‘దేశంలో జరిగిన ఘోర విపత్తుల్లో వయనాడ్ విధ్వంసం ఒకటని పేర్కొన్నారు. అలాగే స్పాట్ కి వచ్చి చూశాక.. ఏ స్థాయిలో నష్టం జరిగిందో అర్ధమైందని, అందుకే వయనాడ్ వరద బాధితులకు తానే స్వయంగా సాయం చేసేందుకు వచ్చానని’ మోహన్ లాల్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వయనాడ్ లో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ప్రజలకు సేవలు అందిస్తున్న మోహన్ లాల్ వీడియో అనేది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్, ఫ్యాన్స్ రీల్ హీరో అయిన రియల్ హీరో అనిపించుకున్నరంటూ ఈ హీరో పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరీ, వయనాడ్ లో ప్రజలకు నేరుగా సేవలు అందిస్తున్న మోహన్ లాల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#WATCH | Actor Mohanlal who is a Lieutenant Colonel in the Territorial Army, reached the landslide-hit Mundakkai area in Wayanad.#Kerala pic.twitter.com/feEpYNZa5B
— ANI (@ANI) August 3, 2024