iDreamPost
android-app
ios-app

బింబిసార డైరెక్టర్ లక్కీ ఛాన్స్ కొట్టేశాడా? ఏకంగా మెగాస్టార్ తో..

  • Author Soma Sekhar Published - 04:21 PM, Mon - 24 July 23
  • Author Soma Sekhar Published - 04:21 PM, Mon - 24 July 23
బింబిసార డైరెక్టర్ లక్కీ ఛాన్స్ కొట్టేశాడా? ఏకంగా మెగాస్టార్ తో..

ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ డైరెక్టర్ల హవా నడుస్తోంది. సీనియర్ డైరెక్టర్లు స్టార్ హీరో సినిమాలతో బిజీగా ఉంటే.. యంగ్ డైరెక్టర్లు మాత్రం చిన్న హీరోల దగ్గర నుంచి పెద్ద హీరోల వరకు లైన్లో పెట్టాలని చూస్తున్నారు. తొలి సినిమాతో హిట్ కొట్టి.. తర్వాత ఏకంగా కుంభస్థలాన్నే బద్దలు కొట్టాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే స్టార్ హీరోలకు కథలు వినిపిస్తున్నారు. ఈ లిస్ట్ లో మెుదటి వరుసలో ఉన్నాడు బింబిసార డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ. కళ్యాణ్ రామ్ తో బింబిసార లాంటి సూపర్ హిట్ అందించిన వశిష్ఠ్.. ప్రస్తుతం మెగా వేటలో ఉన్నట్లు సమాచారం. తాజాగా మెగాస్టార్ ను కలిసి.. కథ వినిపించినట్లు, దానికి మెగాస్టార్ కూడా ఒకే అన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

మల్లిడి వశిష్ఠ.. బింబిసార లాంటి సోషియో ఫాంటసీ సినిమాతో ఇండస్ట్రీ మెుత్తాన్ని తనవైపు తిప్పుకునేలా చేశాడు. హిట్ లేక కష్టాల్లో ఉన్న కళ్యాణ్ రామ్ కు సరైన టైమ్ లో సూపర్ హిట్ ను అందించాడు. దాంతో ఒక్కసారిగా పరిశ్రమలో లైమ్ లైట్ లోకి వచ్చాడు వశిష్ఠ. ఇటీవలే సూపర్ స్టార్ రజినీ కాంత్ ను కలిసి కథ వినిపించినట్లు వార్తలు వచ్చాయి. అయితే రజినీ కాంత్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమాను ఒప్పుకోవడంతో.. వశిష్ఠ సినిమాను పక్కన పెట్టాడట సూపర్ స్టార్. దాంతో యూటర్న్ తీసుకున్న అతడు మెగాస్టార్ కు తన కథ వినిపించాడట.

ఈ నేపథ్యంలో వశిష్ఠ చెప్పిన సోషియో ఫాంటసీ కథ నచ్చడంతో.. ఈ కథకు మెగాస్టార్ చిరంజీవి ఒకే చెప్పినట్లు ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాను రూ. 200 కోట్ల భారీ బడ్జెట్ తో స్టార్ ప్రొడక్షన్ కంపెనీ యూవీ క్రియేషన్ నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ నుంచి ప్రారంభం కానుందట. అయితే చిరంజీవి మాత్రం ప్రస్తుతం కమిట్ అయిన చిత్రాలను పూర్తి చేసుకుని డిసెంబర్ లో సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ క్రేజీ కాంబోకు సంబంధించిన న్యూస్ ఫిల్మ్ నగర్ లో తెగ చెక్కర్లు కొడుతోంది. మరి మెగాస్టార్ ను వశిష్ఠ డైరెక్ట్ చేస్తే.. ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Skyupsmedia (@skyupsmedia)


ఇదికూడా చదవండి: పవన్‌ కళ్యాణ్‌కు అహం ఎక్కువ.. AP రాజకీయాల్లో ఆయన స్థానం ఇదే: రాజు రవితేజ

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss