iDreamPost
android-app
ios-app

సిద్ధార్థ్ – అదితి రావుల రిలేషన్ పై ఓపెన్ అయిన డైరెక్టర్.. ట్వీట్ వైరల్!

  • Author ajaykrishna Updated - 10:33 PM, Mon - 30 October 23

ఇండస్ట్రీలో చాలకాలంగా జంటగా చలామణి అవుతున్నారు హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరి. వీరిద్దరూ కలిసి మహా సముద్రం సినిమా చేశారు. అప్పటినుండి ఎక్కడ చూసినా జంటగా కనిపిస్తున్నారు. కానీ.. తమ మధ్య ఎలాంటి రిలేషన్ షిప్ ఉందనేది క్లారిటీ ఇవ్వట్లేదు. ఈ విషయంపై తాజాగా డైరెక్టర్ అజయ్ భూపతి రియాక్ట్ అయ్యారు. ఆ వివరాల్లోకి వెళ్తే..

ఇండస్ట్రీలో చాలకాలంగా జంటగా చలామణి అవుతున్నారు హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరి. వీరిద్దరూ కలిసి మహా సముద్రం సినిమా చేశారు. అప్పటినుండి ఎక్కడ చూసినా జంటగా కనిపిస్తున్నారు. కానీ.. తమ మధ్య ఎలాంటి రిలేషన్ షిప్ ఉందనేది క్లారిటీ ఇవ్వట్లేదు. ఈ విషయంపై తాజాగా డైరెక్టర్ అజయ్ భూపతి రియాక్ట్ అయ్యారు. ఆ వివరాల్లోకి వెళ్తే..

  • Author ajaykrishna Updated - 10:33 PM, Mon - 30 October 23
సిద్ధార్థ్ – అదితి రావుల రిలేషన్ పై ఓపెన్ అయిన డైరెక్టర్.. ట్వీట్ వైరల్!

ఇండస్ట్రీలో హీరోహీరోయిన్స్ మధ్య రిలేషన్ షిప్ ఏర్పడిందని తెలిస్తే అందరికంటే ముందు ఫ్యాన్స్ లో కనిపించే హడావిడి మామూలుగా ఉండదు. హీరోహీరోయిన్స్ కన్ఫర్మ్ చేయకపోయినా.. కలిసి కనిపిస్తే చాలు సోషల్ మీడియాలో పుకార్లు వచ్చేస్తాయి.. వెంటనే వాళ్ళకు సంబంధించి ఫ్లైట్ జర్నీస్.. ప్రైవేట్ గా డిన్నర్ కి వెళ్లిన ఫోటోలు అన్ని వైరల్ చేసేస్తారు. సరే అసలు ఎప్పుడు కనిపించకుండా.. సడన్ గా కలిసి కనిపించారంటే ఏదో ఉందని అనుకోవచ్చు. లేదా కలిసి సినిమాలో వర్క్ చేసాక క్లోజ్ అయ్యారంటే.. పక్కాగా లవ్ కాకపోయినా కనీసం ఫ్రెండ్ షిప్ అయినా స్ట్రాంగ్ గా ఉంటుందని నమ్మవచ్చు. ప్రస్తుతం హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరిల మధ్య ఏముంది? అనేది మాత్రం చాలకాలంగా సమాధానం లేని ప్రశ్న.

వీరిద్దరూ కలిసి ‘ఆర్ఎక్స్100’ ఫేమ్ డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కించిన ‘మహా సముద్రం’ సినిమాలో జంటగా నటించారు. ఆ సినిమాకు ఎప్పుడు సిద్ధార్థ్ – అదితి కలిసి కనిపించలేదు. ఎప్పుడైతే మహా సముద్రం సినిమా చేశారో.. ఆ తర్వాత నుండి ఎక్కడ చూసినా జంటగా కనిపించడం.. కలిసి పార్టీస్, డిన్నర్స్ కి వెళ్లడం.. క్లోజ్ గా మూవ్ అవ్వడం చేస్తూ చాలాసార్లు మీడియా కంటపడ్డారు. మొదట్లో ఫ్రెండ్స్ అనుకున్నప్పటికి.. ఒకానొక టైమ్ లో మీ మధ్య ఏముంది? ఏం జరుగుతుంది? ప్రేమనా లేకపోతే ఏం లేదా? లాంటి ప్రశ్నలు మీడియా ముఖంగా ఎదురయ్యాయి. అయినా.. సమాధానం చెప్పకుండా నవ్వుతూ వెళ్లిపోయారు.

అప్పటినుండి సిద్ధార్థ్ – అదితి మధ్య రిలేషన్ షిప్ ఉందని.. ఇద్దరు లవ్ లో ఉన్నారని ప్రచారం మొదలైంది. అయినా సరే.. ఎవరికి వారే పనులు చేసుకుంటున్నారు గానీ క్లారిటీ ఇవ్వలేదు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. సిద్ధార్థ, అదితి లవ్ లో ఉన్నారో లేదో తెలియదు. బట్ వాళ్ళని కలిపింది మాత్రం డైరెక్టర్ అజయ్ భూపతి అని కథనాలు వచ్చాయి. దీంతో ఇప్పుడు తాజాగా సిద్దార్థ్-అదితి కలిసున్న ఫోటో షేర్ చేస్తూ.. అజయ్ భూపతి ట్విట్టర్ లో హీరోహీరోయిన్ ని డైరెక్ట్ గా అడిగేసాడు. ‘దీనికి కారణం నేనే అంటున్నారు.. నిజం గా మీ మధ్య ఏం జరుగుతుంది?’ అని ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఇద్దరు పార్టనర్స్ అంటూ పోస్టులు, విషెస్ చెప్పుకుంటారు. అదేదో ఇకనైనా ఓపెన్ గా చెప్పేస్తే బాగుంటుందని అందరు వెయిట్ చేస్తున్నారు. మరి త్వరలోనే సిద్ధార్థ్, అదితి తమ రిలేషన్ పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetine girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom