iDreamPost
android-app
ios-app

Dil Raju: పెద్ద నష్టం నుంచి బయటపడ్డ దిల్ రాజు! ఇందుకే సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అనేది..

  • Published Jul 15, 2024 | 2:33 PM Updated Updated Jul 15, 2024 | 2:33 PM

భారీ నష్టం నుంచి ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు బయటపడ్డాడని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జోరుగా నడుస్తోంది. మరి పెద్ద నష్టం ఏంటి? అసలు ఏం జరిగింది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

భారీ నష్టం నుంచి ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు బయటపడ్డాడని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జోరుగా నడుస్తోంది. మరి పెద్ద నష్టం ఏంటి? అసలు ఏం జరిగింది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

Dil Raju: పెద్ద నష్టం నుంచి బయటపడ్డ దిల్ రాజు! ఇందుకే సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అనేది..

దిల్ రాజు.. టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ లో ఒకరు. ఆయన ఓ సినిమా తీస్తున్నారు అంటే.. గ్యారెంటీగా హిట్ అవుతుందన్న నమ్మకం ప్రేక్షకులతో పాటుగా ఇండస్ట్రీ ప్రముఖుల్లో కూడా ఉంటుంది. అంతలా కథలపై ఆయనకు గురి ఉంటుంది. ఏ మూవీ హిట్ అవుతుందో.. ఏ మూవీ ఫ్లాప్ అవుతుందో ముందుగానే పసిగట్టగల సమర్థుడు దిల్ రాజు అన్న పేరు పరిశ్రమలో ఉండనే ఉంది. ఇంత అనుభవం ఉన్న దిల్ రాజు ఓ పెద్ద నష్టం నుంచి బయటపడ్డాడని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. అసలు ఏం జరిగింది?

టాలీవుడ్ లో పెద్ద చిత్రాలతో పాటుగా చిన్న చిత్రాలు నిర్మిస్తూ.. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గానే కాకుండా అభిరుచి గల వ్యక్తిగా మన్ననలు పొందుతున్నాడు నిర్మాత దిల్ రాజు. ప్రస్తుతం రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ఓ భారీ నష్టం నుంచి దిల్ రాజు బయటపడ్డాడని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. అసలేం జరిగిందంటే?

కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్ లో లేటెస్ట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ భారతీయుడు 2. జూలై 12న వరల్డ్ వైడ్ గా విడుదల అయిన ఈ మూవీ ఫ్లాప్ టాక్ ను మూటగట్టుకుంది. దారుణమైన కలెక్షన్లతో ఇటు కమల్, అటు శంకర్ ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశపరిచింది. ఇంతవరకు అందరికి తెలిసిన విషయమే. తెలియని విషయం ఏంటంటే? భారతీయుడు 2 మెుదట దిల్ రాజు నిర్మించాలని అనుకున్నాడట. అందుకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు కూడా చేశారు. అయితే శంకర్ ఆలస్యం చేస్తుండటం, భారీ బడ్జెట్ కారణంగా ఫలితంపై దిల్ రాజు ఆలోచించి.. ఈ మూవీ నుంచి తప్పుకున్నాడట.

ఇక ఇప్పుడు భారతీయుడు మూవీ ఫలితం చూసిన తర్వాత నెటిజన్లు దిల్ రాజు భారీ నష్టం నుంచి బయటపడ్డాడు అని కామెంట్స్ చేస్తున్నారు. సినిమా ఆలస్యమైతే.. దాని ప్రభావం ఫలితం మీద చూపిస్తుందని, అలాగే బడ్జెట్ కూడా ఎక్కువ అవ్వడం రిస్క్ తో కూడుకున్న పని అని దిల్ రాజు గ్రహించి వెనక్కి తగ్గారు. ఆయన అలా తగ్గడంతో.. భారీ నష్టం నుంచి బయటపడ్డాడు. ఇక ఈ మూవీని భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ నిర్మించి.. నష్టాలు చవిచూస్తోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.