Somesekhar
అనంత్ అంబానీ-రాధికా మర్చెంట్ వివాహానికి దేశవ్యాప్తంగా ఉన్న అతిరథ మహారథులు అందరూ తరలివచ్చారు. కానీ స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను మాత్రం హాజరుకాలేదు. దానికి గల కారణాలను తాజాగా వెల్లడించింది ఈ బ్యూటీ.
అనంత్ అంబానీ-రాధికా మర్చెంట్ వివాహానికి దేశవ్యాప్తంగా ఉన్న అతిరథ మహారథులు అందరూ తరలివచ్చారు. కానీ స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను మాత్రం హాజరుకాలేదు. దానికి గల కారణాలను తాజాగా వెల్లడించింది ఈ బ్యూటీ.
Somesekhar
ప్రపంచ కుబేరుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ-రాధికా మర్చెంట్ ల పెళ్లి అంగరంగవైభంగా జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ వివాహానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులే కాకుండా.. గ్లోబల్ సెలబ్రిటీలు కూడా హాజరైయ్యారు. బాలీవుడ్, టాలీవుడ్ కు చెందిన స్టార్ హీరోలు, హీరోయిన్స్ ఎంతో మంది ఈ వేడుకలో తళుక్కున మెరిశారు. కానీ స్టార్ హీరోయిన్ తాప్సీ మాత్రం ఈ పెళ్లికి వెళ్లలేదు. ఆమె ఈ మ్యారేజ్ కు వెళ్లకపోవడానికి కారణం ఏంటో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆ వివరాల్లోకి వెళితే..
అనంత్ అంబానీ-రాధికా మర్చెంట్ వివాహాం ముంబైలో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా ఉన్న అతిరథ మహారథులు అందరూ తరలివచ్చారు. బాలీవుడ్, టాలీవుడ్ నుంచి స్టార్ హీరోలు, హీరోయిన్స్ ఈ వేడుకకు హాజరైయ్యారు. కొందరు స్టార్స్ పెళ్లిలో డ్యాన్స్ లతో అలరించారు కూడా. ఇంత మంది సినీ ప్రముఖులు వచ్చిన ఈ పెళ్లికి స్టార్ హీరోయిన్ తాప్సీ మాత్రం రాలేదు. దానికి కారణం లేటెస్ట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
తాప్సీ మాట్లాడుతూ..”పెళ్లి అన్నది ఎన్నో అనుబంధాలతో కూడుకున్నది. జీవితంలో జరిగే ఈ ప్రత్యేకమైన వేడుక ఎంతో గొప్పది. అలాంటి పెళ్లికి ఆతిథ్యం ఇచ్చే కుటుంబానికి, అతిథికి ఏదో ఒకవిధమైన సంబంధం ఉండాలని నేను భావిస్తాను. అలా తెలిసిన వారి పెళ్లికే నేను వెళ్తాను. అంబానీ కుటుంబంతో నాకు వ్యక్తిగతంగా సంబంధం లేదు. అందుకే ఆ వివాహానికి వెళ్లలేదు. అంతే తప్ప అందులో ఇంకేం లేదు” అంటూ చెప్పుకొచ్చింది ఈ సొట్టబుగ్గల సుందరి. ఇక తాప్సీ సినిమాల విషయానికి వస్తే.. వో లడ్కీ హై కహన్, ఫిర్ ఆయి హసీనా దిల్ రూబా, ఖేల్ ఖేల్ మే అనే మూడు చిత్రాల్లో నటిస్తోంది. ఇక ఈ సంవత్సరమే ఈ బ్యూటీ ప్రియుడితో ఏడడుగులు వేసిన విషయం తెలిసిందే. మరి అంబానీ ఇంట పెళ్లికి వెళ్లకపోవడానికి తాప్సీ చెప్పిన కారణంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.