iDreamPost

అబ్దుల్ కలాంతో ఉన్న ఈ పాపని గుర్తుపట్టారా? మెగాస్టార్ లేటెస్ట్ మూవీలో..

  • Published May 15, 2024 | 10:13 PMUpdated May 15, 2024 | 10:13 PM

హీరోలు, హీరోయిన్లకు సంబంధించి త్రో బ్యాక్ ఫోటోలు, చైల్డ్ హుడ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అబ్దుల్ కలాంతో ఉన్న ఈ పాప ఫోటో కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ అమ్మాయిని గుర్తుపట్టారా?

హీరోలు, హీరోయిన్లకు సంబంధించి త్రో బ్యాక్ ఫోటోలు, చైల్డ్ హుడ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అబ్దుల్ కలాంతో ఉన్న ఈ పాప ఫోటో కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ అమ్మాయిని గుర్తుపట్టారా?

  • Published May 15, 2024 | 10:13 PMUpdated May 15, 2024 | 10:13 PM
అబ్దుల్ కలాంతో ఉన్న ఈ పాపని గుర్తుపట్టారా? మెగాస్టార్ లేటెస్ట్ మూవీలో..

ఈ ఫోటోలో కనబడుతున్న పాపను గుర్తుపట్టారా? దివంగత మాజీ రాష్ట్రపతి, దేశం గర్వించే శాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి పక్కన నిలబడి ఉన్న స్టూడెంట్ ఇప్పుడో హీరోయిన్. ఢిల్లీలో పుట్టిన ఈమె ఆర్ట్స్ డిగ్రీ కాలేజ్ లో ఫైన్ ఆర్ట్స్ చేసింది. ఆ టైంలో సినిమాలంటే ఆసక్తి ఏర్పడింది. దీంతో యాక్టింగ్ స్కూల్లో చేరింది. అక్కడ ప్రముఖ దర్శకుడు బేరీ జాన్, నటుడు మనోజ్ బాజ్ పాయ్ ల దగ్గర యాక్టింగ్ లో శిక్షణ తీసుకుంది. తమిళ హీరో విక్రమ్ ప్రభు నటించిన ఇవన్ వెరమథిరి మూవీతో హీరోయిన్ గా కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న ఈమె.. రెండో సినిమాతోనే ధనుష్ తో కలిసి నటించే ఛాన్స్ కొట్టేసింది.

ధనుష్ హీరోగా వచ్చిన వీఐపీ (తెలుగులో రఘువరన్ బీటెక్) మూవీలో నటించింది. తెలుగులో సందీప్ కిషన్ హీరోగా వచ్చిన మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా పేరు ఇంట్లో దాచుకునే వస్తువుతో ముడిపడి ఉంటుంది. అదేనండి.. చీరలు, నగలు పెట్టుకునే బీరువా. ఆ బీరువాలోనే ఈ హీరోయిన్ నటించింది. ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత శర్వానంద్ సరసన ఎక్స్ ప్రెస్ రాజా అనే మూవీలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకుంది.

మంచు వారబ్బాయి నటించిన ఎటాక్ సినిమాలో నటించిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత నాని జెంటిల్ మన్ సినిమాలో కూడా నటించింది. ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత ఒక్క క్షణం, ఓటర్, శశి, సినిమాల్లో నటించింది. కానీ ఆ సినిమాలు ఆశించిన విజయాలను నమోదు చేయలేదు. ప్రస్తుతం అయితే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలో నటిస్తుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు సురభి. బీరువా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఢిల్లీ బ్యూటీనే ఈ ఫోటోలో ఉన్న చిన్నారి. స్కూల్లో చదువుతున్న సమయంలో అబ్దుల్ కలాం గారితో కలిసి ఫోటో దిగింది.     

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి