Venkateswarlu
ఈ మద్య సెలబ్రెటీలు తమ పెళ్లి వీడియోలు ఓటీటీకి అమ్ముకోవడం ట్రెండ్ గా మారింది. టాలీవుడ్ కొత్త జంట లావణ్య త్రిపాఠి- వరుణ్ తేజ్‌ల వివాహం కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వైభవంగా జరిగింది.
ఈ మద్య సెలబ్రెటీలు తమ పెళ్లి వీడియోలు ఓటీటీకి అమ్ముకోవడం ట్రెండ్ గా మారింది. టాలీవుడ్ కొత్త జంట లావణ్య త్రిపాఠి- వరుణ్ తేజ్‌ల వివాహం కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వైభవంగా జరిగింది.
Venkateswarlu
సినిమా సెలెబ్రిటీలు ఏం చేసినా డబ్బులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతూ ఉంటాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో వారు పెట్టే పోస్టులకు కూడా డబ్బులు వస్తుంటాయి. ఒక్కో పోస్టుకు కోట్లు తీసుకునే సెలెబ్రిటీలు కూడా ఉన్నారు. ఈ మధ్య కాలంలో పెళ్లి వీడియోలు ఓటీటీలకు అమ్ముకోవటం కూడా సెలెబ్రిటీలకు బాగా కలిసి వస్తోంది. ఓటీటీ ప్లాట్ ఫామ్‌లు కోట్లు పెట్టి పెళ్లి వీడియోలను కొంటూ ఉన్నాయి. గతంలో దీపిక-రణ్‌వీర్ సింగ్‌ల పెళ్లి వీడియో అప్పట్లో భారీ మొత్తానికి అమ్ముడై పెద్ద చర్చకే దారి తీసింది. ఆ తర్వాత మరికొంత మంది సెలబ్రెటీలు తమ వివాహ వేడుకను కమర్షియల్ గా మార్చుకున్న విషయం తెలిసిందే.
అందాల భామ హన్సిక తన పెళ్లి వీడియోను ఓటీటీకి అమ్ముకుంది. టాలీవుడ్ కొత్త జంట లావణ్య త్రిపాఠి- వరుణ్ తేజ్‌లు ఇటీవల మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అయితే వీరి పెళ్లి వీడియోపై కొత్త రూమర్లు పుట్టుకొచ్చాయి. ఈ జంట ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌కు తమ పెళ్లి వీడియోను అమ్మిందన్న ప్రచారం జరుగుతోంది. నెట్‌ఫ్లిక్స్ ఏకంగా 8 కోట్ల రూపాయలు వెచ్చించి మరీ ఈ జంట పెళ్లి వీడియోను కొనుగోలు చేసినట్లు రెండు రోజులుగా సోషల్ మీడియాలో తెగ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయం కాస్త లావణ్య త్రిపాఠి-వరుణ్ తేజ్ టీమ్ దృష్టికి వెళ్లింది. వెంటనే దీనిపై స్పందించారు. ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని.. ఏ ఓటీటీకి తాము ఇవ్వలేదని వారు స్పష్టం చేశారు. ఇలాంటి అవాస్తవాలను మీడియాలో ఎలా పుట్టిస్తారో అర్థం కాదని.. రూమర్లను నమ్మకండి అంటూ టీమ్ స్పష్టం చేసింది.
లావణ్య త్రిపాఠి- వరుణ్ తేజ్‌లు శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన మిస్టర్ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డట్లు తెలుస్తోంది. కొంత కాలం ప్రేమించుకున్న ఈ జంట పెద్దలకు తమ ప్రేమ విషయాన్ని చెప్పారు. ఇరు కుటుంబాల పెద్దలు వీరి పెళ్లి అంగీకరించారు. దీంతో పెళ్లి బాజాలు మోగాయి. 2023 జూన్ నెలలో లావణ్య త్రిపాఠి- వరుణ్ తేజ్‌ల నిశ్చితార్థ వేడుక జరిగింది. ఈ పెళ్లి వేడుకకు పెద్దగా ఎవర్నీ పిలవలేదు. కేవలం ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఇక, పెళ్లి వేడుక నవంబర్ 1వ తేదీన జరిగింది. అది కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ పేరిట ఇటలీలో ఈ వేడుక జరిగింది. ఈ వేడుకకు కూడా ఇరుకుటుంబాలు, అతి కొద్ది మంది సినిమా సన్ని హితులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లి జరిగిన మరుసటి రోజు హైదరాబాద్‌లో ఘనంగా పెళ్లి రిసస్పెన్ జరిగింది. ఈ కార్యక్రమానికి అన్ని రంగాలనుంచి పెద్ద సంఖ్యలో జనం హజరయ్యారు.