Nidhan
టాలీవుడ్లో ఇప్పుడు మోస్ట్ ఎగ్జయిటింగ్ ప్రాజెక్ట్స్‌లో ఒకటిగా ‘కుబేర’ను చెప్పొచ్చు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల నుంచి వస్తున్న ఈ మూవీ అప్డేట్స్ కోసం అందరూ ఎంతో ఎదురు చూస్తున్నారు.
టాలీవుడ్లో ఇప్పుడు మోస్ట్ ఎగ్జయిటింగ్ ప్రాజెక్ట్స్‌లో ఒకటిగా ‘కుబేర’ను చెప్పొచ్చు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల నుంచి వస్తున్న ఈ మూవీ అప్డేట్స్ కోసం అందరూ ఎంతో ఎదురు చూస్తున్నారు.
Nidhan
తెలుగులో సున్నితమైన కథలతో చిత్రాలు తీసేవారు చాలా తక్కువ. అలాంటి మూవీస్ వస్తే హిట్ చేద్దామని ఆడియెన్స్ రెడీగా ఉన్నారు. కానీ సెన్సిబుల్ సబ్జెక్ట్స్‌తో మూవీస్ తీయడం ఓ కళ. అది అందరికీ రాదు. కొందరు మాత్రమే అలాంటి ఫిల్మ్స్ తీయగలరు. మన తెలుగులో ఉన్న అతికొద్ది మంది సెన్సిబుల్ డైరెక్టర్స్‌లో శేఖర్ కమ్ముల ఒకరు. చిన్న పాయింట్‌ను పట్టుకొని తెలుగుదనాన్ని జోడించి ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా సినిమాలు తీయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఈ నేపథ్యంలో ఆడపిల్లల ఆలోచన తీరు కానివ్వండి, సమాజ పోకడలు కానివ్వండి ఏదైనా ఆయన ప్రెజెంట్ చేసే తీరు అద్భుతంగా ఉంటుంది. అలాంటి కమ్ముల వెర్సటైల్ యాక్టర్ ధనుష్‌తో ‘కుబేర’ మూవీ తీస్తున్నారు అనగానే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అలాంటి ఈ ఫిల్మ్ స్టోరీ ఇదేనంటూ ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది.
‘కుబేర’ కథ ఇదేనంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీని ప్రకారం ఈ మూవీ స్టోరీ అంతా ముంబైలోని ధారావి బ్యాక్‌డ్రాప్‌లో నడుస్తుంది. ఓ బిచ్చగాడు మాఫియా డాన్‌గా ఎలా ఎదిగాడు అనేదే ‘కుబేర’ మెయిన్ పాయింట్ అని రూమర్స్ వస్తున్నాయి. కింగ్ నాగార్జున ఇందులో ఓ ప్రభుత్వ అధికారి పాత్ర పోషించనున్నట్లు వినికిడి. అయితే ముంబైలోని మాఫియా డాన్ చుట్టూ కథ తిరుగుతుందని చెప్పినా.. ఆ డాన్ ధనుషేనా? లేదా డాన్‌కు ధనుష్‌కు మధ్య ఇంకేదైనా లింక్ ఉంటుందా? అనేది క్లారిటీ లేదు. ఇందులో బిచ్చగాడి పాత్రలో ధనుష్ కనిపించబోతున్నాడంటూ టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. అయితే ఇందులో యాక్షన్ పార్ట్ కూడా ఉంటుందని ఫిల్మ్ నగర్ సమాచారం.
శేఖర్ కమ్ముల మూవీస్ అనగానే డిఫరెంట్‌గా, కొత్తగా ఉంటాయి. కాఫీ తాగుతూ చూసే సినిమాలతో పాటు ఆలోచనల్ని రేకెత్తించే సెన్సిటివ్ సబ్జెక్ట్స్ వరకు ఆయన టచ్ చేశారు. అలాంటిది ‘కుబేర’తో ఆయన రూటు మార్చి యాక్షన్ జోన్లోకి వచ్చేశారని టాక్ నడుస్తోంది. తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఆయన ఈ సినిమా రూపొందిస్తున్నారని అంటున్నారు. ముంబైలోని ధారావితో పాటు బ్యాంకాక్‌లో కథ ఎక్కువగా జరుగుతుందని తెలుస్తోంది. ఇది విన్న నెటిజన్స్ షాకవుతున్నారు. శేఖర్ కమ్ముల నుంచి యాక్షన్ మూవీని తాము ఎక్స్పెక్ట్ చేయలేదని అంటున్నారు. రాసుకున్న కథను బలంగా చెప్పే దర్శకుడు.. ఇప్పుడు యాక్షన్‌ను కూడా అంతే ఎఫెక్టివ్‌గా తెరకెక్కిస్తే చూడాలని ఉందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ‘కుబేర’ కథ ఇదేనంటూ చక్కర్లు కొడుతున్న వార్తలో నిజం ఎంత ఉందో తెలియదు. ఇదే సినిమా స్టోరీ అని చెప్పలేం. స్టోరీ లైన్ ఏంటనేది మూవీ యూనిట్ అధికారికంగా చెబితేనో లేదా రిలీజ్ రోజు తెర మీద చూస్తేనో తప్ప క్లారిటీ రాదు. మరి.. ‘కుబేర’ కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.
#Kubera #Dhanush pic.twitter.com/vPKUNxLZS6
— Skyups Media (@skyupsMedia) March 15, 2024