కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌కు తమిళంతో పాటు తెలుగులోనూ అభిమాన గణం భారీగానే ఉంది. డిఫరెంట్ మూవీస్‌ను ఇష్టపడే వారు ధనుష్ సినిమాలను ఎక్కువగా ఆదరిస్తుంటారు.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌కు తమిళంతో పాటు తెలుగులోనూ అభిమాన గణం భారీగానే ఉంది. డిఫరెంట్ మూవీస్‌ను ఇష్టపడే వారు ధనుష్ సినిమాలను ఎక్కువగా ఆదరిస్తుంటారు.
తెలుగు నాట సినిమాల సందడి ఎక్కువగా కనిపించే పండుగల్లో సంక్రాంతి ఒకటి. టాలీవుడ్‌కు ఇది పెద్ద ఫెస్టివల్ సీజన్ అని చెప్పొచ్చు. దాదాపు నాల్రోజుల నుంచి వారం రోజుల వరకు ఉండే ఈ సీజన్లో రిలీజ్ అయ్యేందుకు సినిమాలన్నీ క్యూ కడతాయి. ముఖ్యంగా స్టార్ హీరోలు తమ చిత్రాలను సంక్రాంతి బరిలో నిలిపేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. మూవీ టాక్ ఎలా ఉన్న మినిమం కలెక్షన్లు గ్యారెంటీ కాబట్టి విడుదల తేదీ కోసం ముందే కర్చీఫ్ వేసుకుంటారు. ఒకవేళ మంచి టాక్ వచ్చిందా వసూళ్ల జాతర చేసుకోవచ్చు.. బాగోకపోయినా మినిమం రేంజ్ కలెక్షన్లు వస్తాయనే ధీమాతోనే పొంగల్ రేసులోకి దిగేందుకు పోటీపడుతుంటారు స్టార్లు.
వచ్చే ఏడాది సంక్రాంతి రేసు మామూలుగా లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు-బిగ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రూపొందుతున్న ‘గుంటూరు కారం’ సినిమా 2024 పొంగల్‌కు వస్తోంది. పండక్కి ఇంకా చాలా టైమ్ ఉన్నప్పటికీ అప్పుడే రిలీజ్ డేట్‌ను కూడా కన్ఫర్మ్ చేసేసారు మేకర్స్. వచ్చే సంవత్సరం జనవరి 12న మహేష్ కొత్త మూవీ థియేటర్లలోకి రానుంది. అయితే ‘గుంటూరు కారం’ ఒక్కటే కాదు.. ఈ ఫిల్మ్‌తో పాటు మరో 5 సినిమాలు సంక్రాంతి బరిలో ఉండనున్నాయి. ఇవి అన్నీ పెద్ద చిత్రాలే కావడం గమనార్హం. మాస్ మహారాజా ‘ఈగల్’ జనవరి 13న రిలీజ్ కానుంది. ఈ సినిమా మీద కూడా ఆడియెన్స్‌లో మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.
మహేష్ బాబు, రవితేజతో పాటు విక్టరీ వెంకటేష్ కూడా సంక్రాంతి బరిలో ఉన్నారు. ఆయన యాక్ట్ చేస్తున్న కొత్త చిత్రం ‘సైంధవ్’. ఈ ఫిల్మ్‌ను పండక్కి తీసుకురాబోతున్నట్లు మూవీ టీమ్ ఇప్పటికే ప్రకటించింది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’, కింగ్ నాగార్జున ‘నా సామిరంగ’తో పాటు ఫాంటసీ మూవీ ‘హనుమాన్’ కూడా పొంగల్‌కే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ ఫిల్మ్స్ ఇంకా రిలీజ్ డేట్స్ ప్రకటించలేదు. ఇన్ని సినిమాల నడుమ ఇప్పుడు మరో మూవీ కూడా ఇదే ఫెస్టివల్‌ను టార్గెట్ చేసేందుకు వస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న ‘కెప్టెన్ మిల్లర్’ను 2024 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు.
‘కెప్టెన్ మిల్లర్’ మూవీకి అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ధనుష్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. 1930-40 బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ ఫిల్మ్‌లో డాక్టర్ శివరాజ్ కుమార్, సందీప్ కిషన్ కీలక పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. ఇందులో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’తో పాటు ‘పుష్ప’ వంటి సినిమాలకు పనిచేసిన మదన్ కార్కీ ‘కెప్టెన్ మిల్లర్’ తమిళ వెర్షన్‌కు డైలాగ్స్ అందిస్తున్నారు. తమిళంలో ధనుష్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్, మార్కెట్‌కు పొంగల్‌కు రిలీజ్ చేయడం బాగా కలిసొస్తుంది.
తమిళులకు సంక్రాంతి పెద్ద పండుగ కాబట్టి ధనుష్ మూవీకి భారీ ఓపెనింగ్స్ ఖాయం. కానీ తెలుగు నాట ఆరు పెద్ద సినిమాల నడుమ ధనుష్ చిత్రం రావడం కాస్త షాకింగ్ అనే చెప్పాలి. తెలుగునాట ఆయనకు మంచి ఇమేజ్, మార్కెట్ ఉన్నప్పటికీ పెద్ద హీరోల సినిమాలను తట్టుకొని కలెక్షన్స్ సాధించడం అంత ఈజీ కాదు. ధనుష్ కావాలనే రిస్క్ చేస్తున్నారా? అనేది అర్థం కావడం లేదు. తమిళంలో ఎలాగూ రికవరీ బాగుంటుంది కాబట్టి తెలుగు మార్కెట్ కలెక్షన్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వడం లేదా అనేది క్లారిటీ లేదు. అయితే సినిమా బాగుంటే తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తారనే నమ్మకంతోనే తీవ్ర పోటీ మధ్య కూడా ‘కెప్టెన్ మిల్లర్’ను ధనుష్ తీసుకొస్తున్నట్లు ఆయన అభిమానులు చెబుతున్నారు. మరి.. ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ విషయంలో రిస్క్ తీసుకోవడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ‘యానిమల్’ ప్రమోషన్స్ కోసం సందీప్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. అన్స్టాపబుల్కు..!
The much awaited #CAPTAINMILLER is all set for a grand Release this PONGAL / SANKRANTI 2024 #CaptainMillerFromPongal#CaptainMillerFromSankranti @dhanushkraja @ArunMatheswaran @NimmaShivanna @sundeepkishan @gvprakash @priyankaamohan @SathyaJyothi pic.twitter.com/qTtUW4N55P
— Vamsi Kaka (@vamsikaka) November 8, 2023