iDreamPost
android-app
ios-app

‘యానిమల్’ ప్రమోషన్స్​ కోసం సందీప్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. అన్ స్టాపబుల్​ కు..!

  • Author Soma Sekhar Published - 03:48 PM, Thu - 9 November 23

యానిమల్ మూవీ టీమ్ ప్రమోషన్లను స్టార్ట్ చేసింది. అందులో భాగంగా అన్ స్టాపబుల్ షోలో బాలయ్యతో కలిసి సందడి చేయనున్నారు.

యానిమల్ మూవీ టీమ్ ప్రమోషన్లను స్టార్ట్ చేసింది. అందులో భాగంగా అన్ స్టాపబుల్ షోలో బాలయ్యతో కలిసి సందడి చేయనున్నారు.

  • Author Soma Sekhar Published - 03:48 PM, Thu - 9 November 23
‘యానిమల్’ ప్రమోషన్స్​ కోసం సందీప్ రెడ్డి మాస్టర్ ప్లాన్.. అన్ స్టాపబుల్​ కు..!

ఇటు హీరోగా అటు రాజకీయ నాయకుడిగా తన కెరీర్ లో రాణిస్తూ వస్తున్నాడు నందమూరి బాలకృష్ణ. ఈ రెండింటితో పాటుగా హోస్ట్ గా మారి అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షోను విజయవంతంగా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ షో విజయవంతంగా రెండు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇక తాజాగా మూడో సీజన్ ను కూడా ప్రారంభించింది. దీనిని అన్ స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్ పేరుతో ఈ సీజన్ కు సంబంధించిన తొలి ఎపిసోడ్ రిలీజ్ అయ్యింది. బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి మూవీ ప్రమోషన్లతో తొలి ఎపిసోడ్ అంతా సాగిపోయింది. ఇక ఇప్పుడు 2వ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ కు సర్వం సిద్దమైనట్లు సమాచారం. ఈ ఎపిసోడ్ కు పాన్ ఇండియా మూవీ ‘యానిమల్’ టీమ్ రానున్నట్లు తెలుస్తోంది.

అన్ స్టాపబుల్ షోతో బాలయ్య తనలో ఉన్న మరో టాలెంట్ ను బయటపెట్టాడు. హోస్ట్ గా ఈ షోలో తనను తప్ప ఇంకెవ్వరినీ ఊహించుకోలేని విధంగా తనదైన ముద్రవేశాడు బాలయ్య. ఇప్పటికే అన్ స్టాపబుల్ షో 2 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇప్పడు మూడవ సీజన్ లోకి అడుగుపెట్టింది. దీనిని అన్ స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా. ఇందుకు సంబంధించిన తొలి ఎపిసోడ్ లో భగవంత్ కేసరి టీమ్ సందడి చేసిన విషయం తెలిసిందే. తాజాగా 2వ ఎపిసోడ్ లో సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ‘యానిమల్’ మూవీ టీమ్ సందడి చేయనున్నట్లు సమాచారం.

రణ్ బీర్ కపూర్, రష్మిక మందన్నా, సందీప్ రెడ్డి ఈ ఎపిసోడ్ కు రానున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది యానిమల్. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ ను గట్టిగానే ప్లాన్ చేశాడు సందీప్ రెడ్డి. అందులో భాగంగా బాలయ్య అన్ స్టాపబుల్ షోలో ఈ సినిమా యూనిట్ హంగామా సృష్టించనుంది. బాలయ్య అడిగే తుంటరి ప్రశ్నలకు సందీప్, రణ్ బీర్, రష్మిక ఏ విధంగా ఆన్సర్స్ ఇస్తారో తెలియాలంటే ఈ ఎపిసోడ్ వచ్చేదాక ఆగాల్సిందే. ఇక యానిమల్ టీజర్, ట్రైలర్ లకు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో.. ఈ మూవీప భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇక మాస్టర్ ప్లాన్ తో డైరెక్టర్ ప్రమోషన్స్ ప్రారంభించాడని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మరి యానిమల్ టీమ్ బాలయ్య షోలో ఏ రేంజ్ లో హంగామా చేస్తుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet