iDreamPost
android-app
ios-app

విడుదలకు ముందే రికార్డుల ఊచకోత కోస్తున్న దేవర! తాజాగా మరో రికార్డ్..

  • Published Sep 24, 2024 | 6:49 PM Updated Updated Sep 24, 2024 | 6:49 PM

Devara: జూనియర్ ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' లాంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' సినిమాతో రాబోతున్నారు.

Devara: జూనియర్ ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' లాంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' సినిమాతో రాబోతున్నారు.

  • Published Sep 24, 2024 | 6:49 PMUpdated Sep 24, 2024 | 6:49 PM
విడుదలకు ముందే రికార్డుల ఊచకోత కోస్తున్న దేవర! తాజాగా మరో రికార్డ్..

పాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ లాంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అభిమానులకు ఎలాంటి సినిమా కావాలో ఎన్టీఆర్ కి బాగా తెలుసు. అలా జాగ్రత్తలు తీసుకున్న ఎన్టీఆర్ కొరటాల సినిమా ఒకే చేశారు. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమాతో రాబోతున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. విడుదలకు ముందే అదిరిపోయే రికార్డులు నమోదు చేస్తుంది. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా పార్ట్-1 సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో దేవర ఫీవర్ మాములుగా లేదు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా కావడం వలన అన్ని ఏరియాల్లో హైప్ నెలకొంది. అటు USAలో కూడా ఇదే ఫీవర్ కొనసాగుతోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా USA ప్రీ సేల్స్ లో రోజుకో రికార్డుని నమోదు చేస్తుంది. తాజాగా అక్కడ మరో అరుదైన రికార్డుని నమోదు చేసింది. ప్రీ సేల్స్ లో ప్రభంజనం సృష్టించింది. నార్త్‌ అమెరికాలో ‘దేవర’ ప్రీ సేల్స్‌లో ఏకంగా 2 మిలియన్‌ డాలర్ల మార్క్‌ను అలవోకగా దాటేసింది. ఈ మార్క్ చాలా మంది హీరోల లైఫ్ టైం గ్రాస్. సినిమా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే తప్ప ఆ మార్క్ ని దాటలేరు. అలాంటిది ఈ రికార్డుని కేవలం విడుదలకు ముందే దేవర సినిమా చాలా అలవోకగా దాటేసింది. దీన్ని బట్టి జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని తెలుపుతూ దేవర నిర్మాణ సంస్థ ఓ ప్రత్యేక పోస్టర్‌ ని కూడా విడుదల చేసింది. రిలీజ్‌కు మరో మూడు రోజులు ఉండడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ రికార్డుతో దేవర రికార్డుల ఊచకోత ఖాయం అంటున్నారు అభిమానులు. చూడాలి ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు నమోదు చేస్తుందో..

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వి కపూర్ తారక్ సరసన ఫిమేల్ లీడ్ లో నటించింది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ పాత్ర పోషించారు. సీనియర్ టాలీవుడ్ హీరో శ్రీకాంత్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి పాట ఆకట్టుకుంది. ఈ సినిమాని యువసుధ ఆర్ట్స్ తో కలిసి నందమూరి కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో తన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈ సినిమాకి అనిరుద్ రవి చందర్ సంగీత దర్శకుడిగా పని చేశారు. ఇక విడుదలకు ముందే USA ప్రీ సేల్స్ లో దేవర సృష్టించిన తాజా రికార్డుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetjojobetMadridbetJojobetjojobetJojobetjojobetJojobetjojobetjojobetjojobetcasibomcasibomcasibomcasibomcasibom girişşanlıurfa haberbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet