iDreamPost
android-app
ios-app

Devara Movie: ‘దేవర’ నుంచి క్రేజీ అప్​డేట్.. NTR-జాన్వీ సర్​ప్రైజ్ మామూలుగా లేదు!

  • Published Sep 02, 2024 | 7:30 PM Updated Updated Sep 02, 2024 | 7:44 PM

Devara Movie, Jr NTR, Janhvi Kapoor: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర’ చిత్రం నుంచి తాజాగా మరో అప్​డేట్ వచ్చేసింది. ఇందులో తారక్, జాన్వీ సర్​ప్రైజ్ అదిరిపోయింది.

Devara Movie, Jr NTR, Janhvi Kapoor: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర’ చిత్రం నుంచి తాజాగా మరో అప్​డేట్ వచ్చేసింది. ఇందులో తారక్, జాన్వీ సర్​ప్రైజ్ అదిరిపోయింది.

  • Published Sep 02, 2024 | 7:30 PMUpdated Sep 02, 2024 | 7:44 PM
Devara Movie: ‘దేవర’ నుంచి క్రేజీ అప్​డేట్.. NTR-జాన్వీ సర్​ప్రైజ్ మామూలుగా లేదు!

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర’ చిత్రం అప్​డేట్స్ కోసం ఫ్యాన్స్​తో పాటు మూవీ లవర్స్, ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నెలలోనే మూవీ రిలీజ్ ఉండటంతో ఇకపై ప్రచారం మరింత హోరెత్తించనున్నారు. అందుకు తగ్గట్లే మూవీ టీమ్ అప్​డేట్స్​ను ప్లాన్ చేస్తోందని తెలిసింది. ఇప్పటికే ‘దేవర’ నుంచి ఓ టీజర్, రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. ఫియర్ సాంగ్​తో పాటు చుట్టమల్లే పాట కూడా చార్ట్​బస్టర్​గా నిలిచింది. దీంతో థర్డ్ సింగిల్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి తాజాగా క్రేజీ అప్​డేట్ వచ్చింది. మూడో పాట ఎప్పుడు వస్తుందో అనౌన్స్ చేశారు. అలాగే తారక్-జాన్వీ నుంచి కూడా ఓ సర్​ప్రైజ్ వచ్చింది.

‘దేవర’ థర్డ్ సింగిల్​ను సెప్టెంబర్ 4వ తేదీన విడుదల చేస్తామని మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు. ‘దావుడి’ అంటూ సాగే ఈ పాటలో ఎన్టీఆర్-జాన్వీ ఎలా కనిపించనున్నారో కూడా హింట్ ఇచ్చారు. ఈ మేరకు ఓ పోస్టర్​ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ పాటలోని ప్రతి బీట్ అదిరిపోతుందని.. విజిల్స్ వేయడం ఖాయమంటూ మూవీ టీమ్ ట్విట్టర్​లో పెట్టిన పోస్ట్​లో వెల్లడించింది. సాంగ్ నెక్స్ట్​ లెవల్​లో ఉంటుందని తెలిపింది. ఇక, ‘దావుడి’ పాటకు సంబంధించిన పోస్టర్​లో డ్యాన్స్ చేస్తూ రొమాంటిక్ పోజులో కనిపించారు తారక్-జాన్వీ. తన మీద పడిపోతున్న జాన్వీని పట్టుకుంటూ కనిపించారు ఎన్టీఆర్. ఇతర డ్యాన్సర్లు తారక్​ను పట్టుకొని ఉండటాన్ని ఆ పోస్టర్​లో చూడొచ్చు. ఇదంతా చూస్తుంటే.. ఈ పాట ఫుల్ డ్యాన్స్ నంబర్​గా కనిపిస్తోందని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు.

ఎన్టీఆర్-జాన్వీ డ్యాన్స్​తో దుమ్ము రేపడం ఖాయమని నెటిజన్స్ చెబుతున్నారు. సరైన పాట దొరికితే తారక్ చెలరేగడం పక్కా అని.. ఆ పాట ఇదేనని కామెంట్స్ చేస్తున్నారు. తారక్-జాన్వీ జంట అదిరిపోయిందని, ఇద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తుంటే సూపర్బ్​గా ఉందని అంటున్నారు. సిల్వర్ స్క్రీన్​పై ఈ కపుల్​ను చూసేందుకు వెయిట్ చేయలేకపోతున్నామని, సెప్టెంబర్ 27న థియేటర్లలో పండుగేనని చెబుతున్నారు. తారక్ చాలా రీఫ్రెషింగ్​గా కనిపిస్తున్నారని.. ఆయన లుక్స్, స్టైల్, స్వాగ్ అదిరిపోయాయని కామెంట్స్ చేస్తున్నారు. రిలీజ్ డే పాజిటివ్ టాక్ వస్తే ‘దేవర’తో ఆయన కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని.. బాక్సాఫీస్​ వద్ద ఊచకోత తప్పదని అంటున్నారు నెటిజన్స్. మరి.. ‘దావుడి’ పాటలో తారక్-జాన్వీ లుక్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.