iDreamPost
android-app
ios-app

Devara: మూడు రోజుల్లో 300 కోట్లు.. బాక్స్ ఆఫీసుని చెడుగుడు ఆడేస్తున్న దేవర!

  • Published Sep 30, 2024 | 2:59 PM Updated Updated Sep 30, 2024 | 2:59 PM

Devara Movie: జూనియర్ ఎన్టీఆర్ దేవరతో దుమ్ము దులిపేస్తున్నాడు. ఏ థియేటర్ చూసినా హంగామా మామూలుగా లేదు.

Devara Movie: జూనియర్ ఎన్టీఆర్ దేవరతో దుమ్ము దులిపేస్తున్నాడు. ఏ థియేటర్ చూసినా హంగామా మామూలుగా లేదు.

  • Published Sep 30, 2024 | 2:59 PMUpdated Sep 30, 2024 | 2:59 PM
Devara: మూడు రోజుల్లో 300 కోట్లు.. బాక్స్ ఆఫీసుని చెడుగుడు ఆడేస్తున్న దేవర!

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ దేవరతో దుమ్ము దులిపేస్తున్నాడు. ఏ థియేటర్ చూసినా ఈ సినిమా దుమ్మురేపుతోంది. ఎక్కడ చూసినా తారక్ హంగామా మామూలుగా లేదు. సినిమా రిలీజ్ అయ్యి మూడు రోజులయినా హౌస్ ఫుల్స్ ఏమాత్రం ఆగట్లేదు. ఆడియన్స్ లో దేవర వైబ్స్ ఏమాత్రం తగ్గట్లేదు. సినిమా చూసి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బొమ్మ బ్లాక్ బస్టర్ అంటున్నారు. సినిమా చూసి ఫుల్ శాటిస్ఫై అయ్యి వస్తున్నారు. కథలో కంటెంట్ అదిరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలో అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే సూపర్ అంటున్నారు. పాటలయితే అభిమానులకు ఐ ఫీస్ట్ అనే చెప్పాలి.

దేవరపై విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. దాంతో ఆ అంచనాలకు తగ్గట్లే రఫ్ఫాడిస్తుంది. మొత్తానికి దేవర అనుకున్నట్లుగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. తారక్ నట విశ్వరూపానికి పాత రికార్డులు బద్ధలవుతున్నాయి. ప్రస్తుతం దేవర వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు.. ఇతర దేశాల్లో కూడా దేవర చెడుగుడు ఆడేస్తుంది. తారక్ సినిమా కావడంతో తొలి రోజే దేవర సినిమా రికార్డ్ స్థాయిలో వసూళ్లను కొల్లగొట్టింది. తొలి రోజు ఏకంగా 172 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇక రెండో రోజు 243 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది. ఈ సినిమా ఇంకా తగ్గట్లేదు. పిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరూ దేవరకు బ్రహ్మ రథం పడుతున్నారు.

దీంతో మూడో రోజు కూడా దేవర వసూళ్ల తుఫాను సృష్టించింది. మూడో రోజు ముచ్చటగా మ్యాజిక్ ఫిగర్ ని ఈ సినిమా అందుకుంది. మూడో రోజుకే 300 కోట్ల క్లబ్ లో చేరి సంచలనం సృష్టించింది. ఇక మొత్తం మూడు రోజుల్లో 304 కోట్లు వసూలు చేసినట్లు మూవీ టీం తెలిపింది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఆఫీషియల్ పోస్టర్ ని విడుదల చేసింది. ఈ వసూళ్లు ఇంకా పెరుగుతున్నాయి. ఈ వసూళ్లతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కాలర్ ఎగరేస్తున్నారు. దేవర దిగితే బాక్స్ ఆఫీస్ దద్దరిల్లి పోవాల్సిందే అని కామెంట్స్ చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. చూడాలి దేవర ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో.. మరి దేవర రికార్డులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom