iDreamPost
android-app
ios-app

Devara All Time Record: దేవర మరో రికార్డ్.. ప్రభాస్, మహేశ్ రికార్డ్స్ గల్లంతు!

  • Published Sep 25, 2024 | 11:11 AM Updated Updated Sep 25, 2024 | 11:11 AM

Devara Record: రిలీజ్ కు ముందే దేవర ఊచకోత ప్రారంభమైంది. సెప్టెంబర్ 27న ప్రపంచం వ్యాప్తంగా విడుదల కాబోతున్న దేవర సినిమా ఇప్పటికే అనేక రికార్డులను కొల్లగొట్టింది. తాజాగా మరో ఆల్ టైమ్ రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

Devara Record: రిలీజ్ కు ముందే దేవర ఊచకోత ప్రారంభమైంది. సెప్టెంబర్ 27న ప్రపంచం వ్యాప్తంగా విడుదల కాబోతున్న దేవర సినిమా ఇప్పటికే అనేక రికార్డులను కొల్లగొట్టింది. తాజాగా మరో ఆల్ టైమ్ రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

  • Published Sep 25, 2024 | 11:11 AMUpdated Sep 25, 2024 | 11:11 AM
Devara All Time Record: దేవర మరో రికార్డ్.. ప్రభాస్, మహేశ్ రికార్డ్స్ గల్లంతు!

మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఆయన అభిమానులు అయితే సెప్టెంబర్ 27 కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులు నిద్రకూడా సరిగ్గాపోవడం లేదు అతిశయోక్తి కాదు. దేవర కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సెప్టెంబర్  27న దేవర ప్రపంచ వ్యాప్తంగా  గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇక సినిమా రిలీజ్ కావడం..బాక్సాపీస్ ను బద్దలు కొట్టడమే మిలిగింది. దేవర రిలీజ్ కంటే ముందు అనేక రికార్డులను క్రియేట్ చేసింది. తాజాగా మరో ఆల్ టైమ్ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ముఖ్యంగా ప్రభాస్, మహేష్ బాబుల రికార్డులను గల్లంతు అయ్యాయి. మరి.. ఆ రికార్డులు ఏమిటి?. ఆ వివరాలు ఏమిటో?. ఇప్పుడు చూద్దాం…

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసిన దేవర మ్యానియానే కనిపిస్తోంది. టికెట్స్ కోసం రికమండేషన్లు, బెనిఫిట్ షోల కోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. అలానే ఎప్పుడు లేని విధంగా ప్రతి ఒక్కరి మధ్య దేవర గురించే డిష్కర్షన్లు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 27న రిలీజ్ కానున్న దేవరకు  రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ప్రీమియర్లు వేస్తున్నారు. కృష్ణ, గుంటూరు, సీడెడ్ లో అయితే ఈ వేడీ కాస్తా ఎక్కువగా ఉంది. ఇక ప్రతి స్టార్ కి అడ్డగా భావించే థియేటర్స్  హైద్రాబాద్ లోని ఆర్టీసీ క్రాస్  రోడ్డులో ఉన్నాయి.

ఆర్టీసీ క్రాస్ రోడ్డులో రికార్డు కొడితే ఫ్యాన్స్ కు వచ్చే కిక్కే వేరు. ఇప్పటి వరకు ఇక్కడ  తొలి రోజు హయ్యాస్ట్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా కల్కి ఉంది. ఆర్టీసీ క్రాస్ రోడ్డులో తొలి రోజు కల్కి సినిమా 87 లక్షలు సాధించింది. ఆ తరువాత మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం 82 లక్షలు, ఆర్ఆర్ఆర్  75.87 లక్షలుగా ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. కాగా ఇప్పుడు దేవర ట్రెండ్స్ చూస్తే.. ఈ మూడు రికార్డులను బద్దలు కొట్టేలా ఉంది. దేవరను ఆర్టీసీ క్రాస్ రోడ్డుల్లోని అన్ని థియేటర్లలో ఏడు షోలను ప్రదర్శించనున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఉన్న 7 థియేటర్స్ లో తొలి రోజు 46 షోస్ పడనున్నాయి.

ఇందుకు సంబంధించి బుకింగ్స్ ప్రారంభించగా..నిమిషాల వ్యవధిలోనే టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ షోల గ్రాస్ అటు ఇటుగా  1.25 కోట్లుగా ఉండే అవకాశం ఉంది. ఈ రేంజ్ కలెక్షన్లు డే వన్ లో సాధించడం అనేది ఆర్టీసీ క్రాస్ రోడ్డు చరిత్రలోనే మొదటి సారి. తాజాగా కలెక్షన్లతో ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ప్రభాస్, మహేశ్ బాబుల పేరిట ఉన్న రికార్డులు గల్లంతైనట్లు అయింది. మొత్తంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఫస్ట్ డే కోటి రూపాయలు కలెక్షన్లు సాధించిన తొలి  హీరోగా తారక్ నిలిచాడు. మొత్తంగా రిలీజ్ కు ముందే దేవర రికార్డు వేటను కొనసాగిస్తున్నాడు. మరి..ముందు ముందు దేవర మరెన్ని రికార్డులు బద్దలు కొడతాడో చూడాలి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom