iDreamPost
android-app
ios-app

దానికి ఒప్పుకోకపోతే ఛాన్సులు రావనే భయంతో.. క్యాస్టింగ్ కౌచ్ పై నటి సత్య కామెంట్స్

  • Published Feb 22, 2024 | 9:14 PM Updated Updated Feb 22, 2024 | 9:15 PM

Actress Satya Krishnan Comments: సాధారణంగా సినీ ఇండస్ట్రీ అనగానే చాలా మంది హీరోయిన్లు క్యాస్టింగ్ కౌచ్ గురించి మట్లాడుతుంటారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ సత్య కృష్ణన్ ఈ విషయంపై సెన్సేషన్ కామెంట్స్ చేశారు.

Actress Satya Krishnan Comments: సాధారణంగా సినీ ఇండస్ట్రీ అనగానే చాలా మంది హీరోయిన్లు క్యాస్టింగ్ కౌచ్ గురించి మట్లాడుతుంటారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ సత్య కృష్ణన్ ఈ విషయంపై సెన్సేషన్ కామెంట్స్ చేశారు.

  • Published Feb 22, 2024 | 9:14 PMUpdated Feb 22, 2024 | 9:15 PM
దానికి ఒప్పుకోకపోతే ఛాన్సులు రావనే భయంతో.. క్యాస్టింగ్ కౌచ్ పై నటి సత్య కామెంట్స్

క్యాస్టింగ్ కౌచ్ సినీ ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న మహమ్మారి అంటారు. హీరోయిన్లు, ఇతర క్యారెక్టర్ పాత్రల్లో నటించేందుకు అవకాశాల కోసం వచ్చే అమ్మాయిలను పడకగదికి పిలిపించుకునే ప్రక్రియనే క్యాస్టింగ్ కౌచ్ అంటారు. ఇటీవల క్యాస్టింగ్ కౌచ్ పై ఎంతోమంది హీరోయిన్లు స్పందించారు. గతంలో తాము ఎదుర్కొన్న కష్టాలు, ఇబ్బందుల గురించి బహిరంగంగా మాట్లాడుతున్నారు. క్యాస్టింగ్ కౌచ్ ని ఎదిరించి ఇండస్ట్రీలో నిలబడిన ఎంతోమంది నటీమణులు ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీలో తనదైన నటనతో ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించిన నటి సత్య కృష్ణన్. తాజాగా క్యాస్టింగ్ కౌచ్ పై ఓపెన్ గా మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న నటి సత్య కృష్ణన్ గారి గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. పాతికేళ్లుగా ఆమె తెలుగు ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తున్నారు. టాలీవుడ్ లో వొదిన, అక్క, తల్లి ఇలా ఎన్నో రకాల పాత్రల్లో నటి మెప్పించారు. ఎక్కవగా కామెడీ పాత్రల్లో నటించారు.  డాలర్ డ్రీమ్ తో కెరీర్ ప్రారంభించిన సత్య తర్వాత ఆనంద్, బొమ్మరిల్లు మూవీస్ తో బాగా పేరు సంపాదించుకుంది. ఆమె నటన, హస్కీ వాయిస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. చాలా వరకు మీడియా, సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు సత్య. తాజాగా తన పర్సనల్ విషయాలు, క్యాస్టింగ్ కౌచ్ పై మాట్లాడారు.

మా కుటుంబంలో అందరూ ఉద్యోగాలు చేసేవారే.. ఇండస్ట్రీ వైపు నేను మాత్రమే వచ్చాను. నా భర్తది తమిళ కుటుంబం. పెళ్లైన తర్వాత సినిమాలు చేస్తానంటే మా అత్తింటి వాళ్లు ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. కెరీర్ బిగినింగ్ లో చాలా ఇబ్బందులు పడ్డాను. అయినా కూడా వాటన్నింటిని ఎదుర్కొని ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నాను. నాకు నచ్చిన పాత్రల్లోనే నటిస్తాను..  కామెడీ ఓరియెంటెడ్ పాత్రలంటే చాలా ఇష్టం. సినీ ఇండస్ట్రీలో ఆడవాళ్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అన్నదాంట్లో చాలా నిజం ఉంది. అవి ఒక్క ఇండస్ట్రీలోనే కాదు.. చాలా రంగాల్లో ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలోనే ఎక్కువగా ఫోకస్ అవుతుంది. అందమైన వాళ్లంటే ఎవరైనా వెంటపడతారు.. వాడుకోవాలని చూస్తారు. కానీ మనల్ని మనం కాపాడుకొంటూ కెరీర్ ని చక్కదిద్దుకున్నవాళ్లే మంచి సక్సెస్ ని చూస్తారు. భయంతో లొంగిపోయిన వాళ్ల కెరీర్ పెద్దగా ఉండదు.. అది చాలా మంది విషయంలో జరిగింది. నాకు ఎప్పుడూ ఎలాంటి సమస్యలు రాలేదు అని అన్నారు. మరి శ్రీ సత్య కామెంట్స్ పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom