iDreamPost
android-app
ios-app

Kalki 2898 AD: కల్కి నుండి క్రేజీ అప్డేట్.. ఆ పాత్రలో న్యాచురల్ స్టార్ నాని

  • Published Jan 29, 2024 | 5:02 PM Updated Updated Jan 29, 2024 | 7:22 PM

మహానటితో స్టార్ డైరెక్టర్ గా మారిన నాగ్ అశ్విన్.. డార్లింగ్ ప్రభాస్ కాంబోలో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం కల్కి 2898 ఏడీ. మే 9న ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ విడుదల కానుంది. అయితే ఈ సినిమా నుండి ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.

మహానటితో స్టార్ డైరెక్టర్ గా మారిన నాగ్ అశ్విన్.. డార్లింగ్ ప్రభాస్ కాంబోలో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం కల్కి 2898 ఏడీ. మే 9న ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ విడుదల కానుంది. అయితే ఈ సినిమా నుండి ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.

  • Published Jan 29, 2024 | 5:02 PMUpdated Jan 29, 2024 | 7:22 PM
Kalki 2898 AD: కల్కి నుండి క్రేజీ అప్డేట్.. ఆ పాత్రలో న్యాచురల్ స్టార్ నాని

సినీ నిర్మాణ రంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సంస్థ వైజయంతి మూవీస్. ఈ సంస్థ నుంచి రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్.. కల్కి 2898 ఏడీ. గ్లోబల్ స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. భారతీయ పురాణాల ఆధారంగా ఇతిహాస, సైన్స్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం మే 9న పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. దీపికా పదుకొనే, అమితాబచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని, పశుపతి వంటి నటులు యాక్ట్ చేస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్లను షురూ చేసింది. టీజర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని వినికిడి. అయితే ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.

కల్కి మూవీలో స్టార్ కాస్ట్ పెద్దదే.. అందులో నో డౌట్. అయితే ఇంకొంత మంది పేర్లు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ కూడా నటించబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ఎనౌన్స్ చేయకుండా హైడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఇప్పుడు గూస్ బంప్స్ లాంటి వార్త హల్ చల్ చేస్తోంది. ఇందులో న్యాచురల్ స్టార్ నాని కూడా ఓ కీ రోల్ ప్లే చేశాడట. క్లైమాక్స్ కు ముందు వచ్చే ఓ కీలక ఘట్టంలో నాని కనిపించబోతున్నాడట. కృపా చార్య అనే పాత్ర పోషిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. అలాగే పరుశురాముడిగా జూనియర్ ఎన్టీఆర్‌ ను కూడా సంప్రదించారని తెలిసింది. వింటుంటేనే ఒళ్లు పులకరిస్తోంది.. ఇది గనుక నిజమైతే థియేటర్లలో గూస్ బంప్స్ రావడం ఖాయం.

మహానటి మూవీ తర్వాత నాగ్ అశ్విన్ నుండి వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ఇది. చాలా గ్యాప్ తీసుకుని ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు కెప్టెన్. 2021లో ప్రారంభమైన ఈ చిత్రం.. సుమారు రూ. 600 కోట్లతో నిర్మితమవుతుంది. ఇప్పటికే ఈ సినిమా గ్లింప్స్ విడుదలైన సంగతి విదితమే. మే 9న విడుదల నేపథ్యంలో ఇటీవల రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ ప్రమోషన్ స్టార్ చేశారు. ఇక ట్రైలర్ రిలీజ్ కూడా త్వరలోనే హాలీవుడ్ రేంజ్‌లో ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు. అమెరికాలో అత్యధికంగా పాల్గొనే ఈవెంట్ ‘ది సూపర్ బౌల్’లో రిలీజ్ చేయాలని భావిస్తుస్తోందట చిత్ర యూనిట్. ఇప్పుడు ఈ క్యామియో పాత్రల్లో టాప్ హీరోలంతా కనిపిస్తే.. బాక్సాఫీసు బద్దలు కావడం ఖాయమే. మరి ఈ విషయంలో ఏమంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş