iDreamPost
android-app
ios-app

మహేష్ ని ఢీ కొట్టేందుకు.. త్రివిక్రమ్ మార్క్ స్పెషల్ క్యారెక్టర్?

  • Author ajaykrishna Updated - 05:42 PM, Mon - 28 August 23
  • Author ajaykrishna Updated - 05:42 PM, Mon - 28 August 23
మహేష్ ని ఢీ కొట్టేందుకు.. త్రివిక్రమ్ మార్క్ స్పెషల్ క్యారెక్టర్?

సూపర్ స్టార్ మహేష్ బాబు.. డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా త్రివిక్రమ్.. ఈ సినిమాను ప్లాన్ చేశాడని ఆల్రెడీ సినిమా నుండి విడుదలైన గ్లింప్స్ చూస్తే అర్ధమవుతుంది. త్రివిక్రమ్ – మహేష్ కాంబినేషన్ లో ఇదివరకు అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. ఆ రెండు సినిమాలలో మహేష్ ని డిఫరెంట్ గా ప్రెజెంట్ చేశాడు త్రివిక్రమ్. అతడులో సైలెంట్ గా బుల్లెట్స్ లాంటి డైలాగ్స్ చెప్పించిన త్రివిక్రమ్.. అదే మహేష్ తో ఖలేజాలో నాన్ స్టాప్ డైలాగ్స్ చెప్పించాడు. ఇప్పుడు గుంటూరు కారంలో మాస్ క్యారెక్టర్ లో ప్రెజెంట్ చేయనున్నాడు.

ఇక ఈ సినిమాలో మహేష్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా గుంటూరు మిర్చి యార్డ్ నేపథ్యంలో ఉండబోతుందని టాక్ నడుస్తోంది. అయితే.. మహేష్ బాబుని ఢీ కొట్టేందుకు ఓ క్రేజీ క్యారెక్టర్ డిజైన్ చేసాడట త్రివిక్రమ్. అంటే.. అది విలన్ రోల్ లాంటిదే అని.. చాలా వైల్డ్ గా ఉంటుందని అంటున్నారు. మరోవైపు సినిమాని ఇంటర్వెల్ నుండి సెకండాఫ్ అంతా ఆ క్యారెక్టర్ రన్ అవుతుందని సమాచారం. మొత్తమ్మీద త్రివిక్రమ్.. మహేష్ కోసం సాలిడ్ స్క్రిప్ట్ నే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఆ క్యారెక్టర్ లో ఎవరు కనిపిస్తారు? అనేది తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉండగా.. మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే ఫ్యాన్స్ లో అంచనాలు పీక్స్ కి చేరుకున్నాయి. ఎందుకంటే.. వీరి కాంబినేషన్ మూవీస్ కి టీవీ స్క్రీన్ పై సూపర్ క్రేజ్ ఉంది. ఓ రకంగా అతడు, ఖలేజా రెండు సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ కి ఆల్ టైమ్ ఫేవరేట్స్ లిస్ట్ లో ఉంటాయి. ఇక ఈ సినిమాలో మహేష్ క్యారెక్టర్ నేమ్ ఏంటో తెలియదు. కానీ.. బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ గా ఉంటుందని.. బీడీ త్రీడి డైలాగ్ వింటే అర్థమైంది. కాగా.. సంక్రాంతికి గుంటూరు కారం రిలీజ్ అవుతుందని మహేష్ బాబు ఇటీవలే క్లారిటీ ఇచ్చాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకు.. తమన్ సంగీతం అందిస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్ లో సినిమాని రిలీజ్ చేయాలని మేకర్స్ యోచిస్తున్నారట. మరి గుంటూరు కారం గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetavrupabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet