iDreamPost
android-app
ios-app

టాలీవుడ్ డ్రగ్స్ కేసులు కొట్టేసిన కోర్టు.. 8 కేసుల్లో 6 కేసులు కొట్టివేత!

  • Published Feb 01, 2024 | 5:14 PM Updated Updated Feb 01, 2024 | 5:28 PM

Tollwyood Drugs Case: టాలీవుడ్ సెలబ్రిటీలకు భారీ ఊరట లభించింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులకు సంబంధించి కోర్టు కీలక తీర్పును వెలువరించింది.

Tollwyood Drugs Case: టాలీవుడ్ సెలబ్రిటీలకు భారీ ఊరట లభించింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులకు సంబంధించి కోర్టు కీలక తీర్పును వెలువరించింది.

  • Published Feb 01, 2024 | 5:14 PMUpdated Feb 01, 2024 | 5:28 PM
టాలీవుడ్ డ్రగ్స్ కేసులు కొట్టేసిన కోర్టు.. 8 కేసుల్లో 6 కేసులు కొట్టివేత!

టాలీవుడ్ ఇండస్ట్రీని డ్రగ్స్ మహమ్మారి వెంటాడుతూనే ఉంది. ఇటీవల కూడా కోకాపేటలో లావణ్య అనే యువతిని పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్టు చేశారు. ఆమెకు ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులతో సంబంధాలు ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. గతంలో కూడా ఎక్సైజ్ శాఖ టాలీవుడ్ ప్రముఖులపై డ్రగ్స్ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు 2018లో నమోదు చేసిన కేసులు కీలక మలుపు తీసుకున్నాయి. తాజాగా న్యాయస్థానం టాలీవుడ్ డ్రగ్స్ కేసులను కొట్టివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 8 కేసుల్లో 6 కేసులను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.

ఎక్సైజ్ శాఖకు కోర్టులో చుక్కెదురైంది. 2018 టాలీవుడ్ డ్రగ్స్ కేసులకు సంబంధించి ఎక్సైజ్ శాఖకు ప్రతికూల ఫలితం వచ్చింది. టాలీవుడ్ ఇండస్ట్రీని కలవరపెట్టిన డ్రగ్స్ కేసులు కీలక మలుపు తీసుకున్నాయి. 2018లో ఎక్సైజ్ శాఖ నమోదు చేసిన కేసులకు సంబంధించి న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించింది. సరైన ఆధారాలు లేని కారణంగా కేసులను కొట్టివేస్తున్నట్లు వెల్లడించింది. 2018లో ఎక్సైజ్ శాఖ నమోదు చేసిన 8 కేసుల్లో మొత్తం 6 కేసులను న్యాయస్థానం కొట్టేసింది. కేసుల విచారణకు సంబంధించి ఎక్సైజ్ శాఖ సరైన ప్రొసీజర్ పాటించలేదంటూ న్యాయస్థానం అభిప్రాయ పడింది. కోర్టు నిర్ణయంతో ఈ కేసుల్లో అనుమానితులుగా ఉన్న అందరు సెలబ్రిటీలకు భారీ ఊరట లభించినట్లు అయ్యింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet