iDreamPost
android-app
ios-app

విశ్వప్రసాద్ పైన అభినందనల వర్షం

సాధారణంగా కొత్త ఏడాది.. సంక్రాంతి కానుకగా కొత్త సినిమాలు రిలీజ్ కి సిద్దమవుతుంటాయి. కొన్నిసార్లు పెద్ద హీారోల సినిమాలతో చిన్న సినిమాలు ఢీ కొడుతుంటాయి. అదే సమయంలో స్టార్ హీరోలు రిలీజ్ డేట్స్ సర్ధుబాటు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

సాధారణంగా కొత్త ఏడాది.. సంక్రాంతి కానుకగా కొత్త సినిమాలు రిలీజ్ కి సిద్దమవుతుంటాయి. కొన్నిసార్లు పెద్ద హీారోల సినిమాలతో చిన్న సినిమాలు ఢీ కొడుతుంటాయి. అదే సమయంలో స్టార్ హీరోలు రిలీజ్ డేట్స్ సర్ధుబాటు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

విశ్వప్రసాద్ పైన అభినందనల వర్షం

ఈ సంవత్సరం సంక్రాంతి నిజంగా మామూలు సందడి, హడావుడి కాదు. సినిమాల మీద సినిమాలు, రిలీజుల మీద రిలీజులు. ఒక దానితో మరొకటి పోటీ. ఊపిరాడని ఉక్కిరిబిక్కిరి. ఏకంగా పెద్ద సినిమాలు ఐదు ఒకదానితో ఒకటి ఢీ అంటే ఢీ అని తల పడుతున్నాయి. తల పడ్డాయి సరే.. కానీ అవి ఎంత తలనొప్పిగా మారాయంటే…..ధియేటర్ల ఏర్పాటు దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మప్రళయంలా తయారైంది. అప్పుడే ఆరు నెలల క్రితం నుంచే ఈ రిలీజుల గురించి ఎడతెగని చర్చలు జరుగుతూనే ఉన్నాయి. వీటన్నిటినీ ప్రేక్షకుల ముందుకు ఎలా తీసుకెళ్ళాలి? ధియేటర్లు ఎలా సర్దాలి? ఈ విషయంలో ఎవరికీ ఏమీ అంతుపట్టని గడ్డు సమస్యగా మారింది.

సైంధవ్, నా సామి రంగా, గుంటూరు కారం, ఈగిల్, హనుమాన్ సినిమాలు రిలీజ్ కి రెడీ అయిపోయి.  ఎవరో ఒకరు డేట్ మార్చుకుంటే బావుణ్ణు అని సలహాలు, సంప్రదింపులు ముమ్మరంగా జరిగినా ఎవరికి వారే ససేమిరా అనే పరిస్థితి మాత్రమే ఎదురవుతూ వచ్చింది. అందులో మొదట నుంచి ఈగిల్ సినిమా విడుదల విషయంలో కొంత అస్పష్టత నెలకొని ఉన్న మాటైతే వాస్తవం. కానీ, చిత్రనిర్మాత, పీపుల్స్ మీడియా అధినేత టిజి విశ్వప్రసాద్ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగానే ఉన్నారు. బేక్ డోర్ డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. కానీ, నిర్ణయం మార్పు జాడలు చివరి వరకూ కనిపించలేదు. రెండు రోజుల క్రితం మళ్ళీ ఆఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసి, జనవరి 13నాడే విడుదల అని నొక్కి వక్కాణించడం జరిగింది. ఇది మళ్ళీ గందరగోళం పుట్టించింది. దిల్ రాజు సందర్భం వచ్చినప్పుడల్లా సూచనప్రాయంగా చెబుతూనే వచ్చారు. ఆయన వరకూ ఆయన గేమ్ ఛేంజర్ విడుదల తేదీని సుదూరంగా జరిపేసుకున్నారు. అఫ్ కోర్స్….షూటింగ్ కూడా బ్యాలెన్స్ ఉందనుకోండి. దర్శకుడు శంకర్ ఓకే అనేవరకూ తాను రిలీజ్ డేట్ గురించి ఆలోచించే ప్రసక్తే లేదని కొట్టిపారేశారు దిల్ రాజు. ఇక అప్పటి నుంచి అందరినీ అనునయించే పనిలో పడ్డారు దిల్ రాజు.

eagle movie producer

నిన్నటికి వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. నిన్న సాయంత్రం హీరో రవితేజతో ఆంతరంగిక సమావేశం జరిపిన తర్వాత విశ్వప్రసాద్ ఫిల్మ్ ఛాంబర్ సమావేశానికి హాజరై, ఈగిల్ రిలీజ్ డేట్ ఫిబ్రవరి 9కి మార్చుకుంటున్నట్టుగా ఛాంబర్ ముఖ్యులకి తెలియజేశారు. ఆయన నిర్ణయం అందరినీ ఊపిరి పీల్చుకోనిచ్చింది. అందరూ తేలికపడ్డారు ఒక్కసారిగా. ఎందుకంటే ఈగిల్ సినిమా మీద హయ్యస్ట్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నమాట అందరికీ తెలిసిందే. పైగా మాస్ మహరాజ్ రవితేజ సినమా అనగానే, ఒక్క రవితేజ అభిమానులే కాదు, మాస్ ప్రేక్షకులు కూడా ఈగిల్ సినిమా విడుదల గురించి ఎదురుచూశారు. ఈ నేపథ్యంలో విశ్వప్రసాద్ ప్రకటించిన నిర్ణయం సందిగ్ధానికి తెర దించింది. అప్పుడు ఛాంబర్ పెద్ద్లలు హుటాహుటిన మీడియాని పిలిచి ఈ వార్తని ఎంతో ఆనందంతో పంచుకున్నారు. ఈ సమావేశంలో ఇతర చిత్రాల నిర్మాతలు పాలుపంచుకుని, ఈగిల్ నిర్మాతక విశ్వప్రసాద్ కు థ్యాంక్స్ చెప్పడమే కాదు, ఆయన వితరణకి ఆయనపైన అబినందనల వర్షం కురిపించారు. ఇది చాలా శుభపరిణామం అని, తెలుగు చిత్రపరిశ్రమ శ్రేయస్సుకై విశ్వప్రసాద్ నిర్ణయం ఓ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిందని, ఇది సత్సంప్రదాయాన్ని ప్రారంభించినందుకు విశ్వప్రసాద్ ని మనస్ఫూర్తిగా మెచ్చుకున్నారు. నిర్మాత విశ్వప్రసాద్, హీరో రవితేజలకు పండకకి రిలీజవుతున్న చిత్రాల నిర్మాతలు పదేపదే ధేంక్స్ చెప్పారు.