iDreamPost
android-app
ios-app

Niharika Konidela: స్మాల్ ఫిల్మ్ మేకర్స్​కు ఆశాకిరణంగా నిహారిక.. ‘కమిటీ కుర్రోళ్లు’తో నయా ట్రెండ్​!

  • Published Aug 12, 2024 | 8:37 PM Updated Updated Aug 12, 2024 | 8:37 PM

Committee Kurrollu: మెగా డాటర్ నిహారిక నిర్మించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘కమిటీ కుర్రోళ్లు’. గత శుక్రవారం ఆడియెన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ సక్సెస్​ఫుల్​గా రన్ అవుతోంది.

Committee Kurrollu: మెగా డాటర్ నిహారిక నిర్మించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘కమిటీ కుర్రోళ్లు’. గత శుక్రవారం ఆడియెన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ సక్సెస్​ఫుల్​గా రన్ అవుతోంది.

  • Published Aug 12, 2024 | 8:37 PMUpdated Aug 12, 2024 | 8:37 PM
Niharika Konidela: స్మాల్ ఫిల్మ్ మేకర్స్​కు ఆశాకిరణంగా నిహారిక.. ‘కమిటీ కుర్రోళ్లు’తో నయా ట్రెండ్​!

మెగా డాటర్ నిహారిక నిర్మాతగా మారి ప్రొడక్షన్ సైడ్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆమె నిర్మాణంలో తెరకెక్కిన తొలి చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. గత శుక్రవారం రిలీజైన ఈ మూవీకి ఆడియెన్స్ నుంచి మంచి అప్లాజ్ లభిస్తోంది. విడుదలైన మూడ్రోజుల్లోనే ఈ సినిమా లాభాల్లోకి ఎంటర్ అవ్వడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ‘కమిటీ కుర్రోళ్లు’ ఫిల్మ్ మూడు రోజుల్లోనే రూ.6.04 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని అంటున్నారు. పంద్రాగస్టుకు పెద్ద సినిమాలు వస్తాయి కాబట్టి వచ్చే మూడ్రోజులు ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మరిన్ని వసూళ్లు రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రంతో ఇండస్ట్రీలోకి ఏకంగా 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్లు పరిచయం అవ్వడం విశేషం. ఈ సినిమాతో నిహారిక చాలా విషయాల్లో సక్సెస్ అయ్యారు.

విలేజ్ నేటివిటీ కథకు ఓకే చెప్పడంలోనే నిహారిక తన టేస్ట్ ఏంటో చూపించారు. కొత్త నటుల్ని పెట్టుకొని భయపడకుండా చిత్రాన్ని తెరకెక్కించడంతో ప్రయోగాలకు వెరవనితత్వం తనదని ప్రూవ్ చేశారు. సినిమా మేకింగ్ దగ్గర నుంచి మార్కెటింగ్, ప్రమోషన్స్, బిజినెస్, రిలీజ్ వరకు ‘కమిటీ కుర్రోళ్లు’కు అన్నీ తానై నిలిచారు. ఆమె థింకింగ్, ఎనర్జీ, టేస్ట్.. చూస్తుంటే తెలుగు చిత్రసీమకు నయా టార్చ్ బేరర్ దొరికినట్లు అనిపిస్తోందని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. టాలీవుడ్​లో ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. దేశంలో తెరకెక్కుతున్న అత్యంత భారీ చిత్రాల్లో మెజారిటీవి మన దగ్గరే తీస్తున్నారు. వందల కోట్ల బడ్జెట్ అనేది ఇక్కడ కామన్ అయిపోయింది. బడా సినిమాల పని బాగానే ఉంది. కానీ చిన్న చిత్రాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.

బడ్జెట్, మార్కెటింగ్, ప్రమోషన్స్​ను దాటుకొని థియేటర్లు దక్కించుకొని చిన్న సినిమాలు రిలీజ్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. చిన్న చిత్రాలు తీసేవాళ్లు ఇప్పుడు తగ్గిపోయారు. అప్పట్లో దాసరి నారాయణరావు లాంటి వాళ్లు ఒకవైపు బడా మూవీస్ చేస్తూనే సొంత బ్యానర్​లో స్మాల్ మూవీస్ తెరకెక్కించేవారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా అప్పుడప్పుడు తన బ్యానర్​లో ‘బలగం’ లాంటి చిన్న చిత్రాలతో వస్తున్నారు. కానీ రిగరస్​గా దీనిపై పని చేసే వారు కరువయ్యారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలో మెగా డాటర్ నిహారిక ముందుకొచ్చి నిర్మాతగా మారి ‘కమిటీ కుర్రోళ్లు’ పేరుతో స్మాల్ బడ్జెట్ మూవీ తీసి మంచి విజయాన్ని అందుకున్నారు. నిహారిక చేస్తున్న ప్రయత్నాలు ఆమెను చిన్న చిత్రాల టార్చ్ బేరర్​గా ప్రొజెక్ట్ చేస్తున్నాయి. ఆమె దూకుడు చూసిన నెటిజన్స్.. ఇలాంటి నిర్మాతల అవసరం ఇండస్ట్రీకి ఎంతో ఉందని అంటున్నారు. మన మూలాల్ని గుర్తు చేస్తూ మట్టి కథలు చెప్పేవారు, చిన్న చిత్రాలను కాపాడే నిహారిక వంటి వారు మరింత మంది రావాలని కోరుకుంటున్నారు.