తీవ్ర విషాదంలో కమెడియన్ యాదమ్మరాజు.. మిస్ యూ సర్ అంటూ..

తెలుగు బుల్లితెరపై ఇప్పటి వరకు ఎంతోమంది కమెడియన్లు తమ టాలెంట్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఇక జబర్ధస్త్ కామెడీ షోతో ఎంతోమంది ఔత్సాహికులు తమదైన కామెడీ టైమింగ్ తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచారు. తర్వాత వెండితెరపై కమెడియన్, హీరోలుగా వెలిగిపోయారు. బుల్లితెరపై వచ్చిన పటాస్ ప్రోగ్రామ్ ద్వారా కొంతమంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అలాంటి వారిలో యాదమ్మ రాజు ఒకరు. సంతోష్ డైరెక్షన్ లో హరి అనే అతని స్నేహితుడితో పటాస్ లో తన కామెడీ తో అందరినీ కడుపుబ్బా నవ్వించిన యాదమ్మ రాజు తర్వాత జబర్ధస్త్ లో ఛాన్స్ దక్కించుకున్నాడు. ఇప్పుడు పలు చిత్రాల్లో కమెడియన్ గా నటిస్తున్నాడు. తాజాగా యాదమ్మ రాజు తీవ్ర విషాదంతో చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

తెలుగు బుల్లితెరపై వస్తున్న కమెడియన్లలో ఒకరు యాదమ్మ రాజు. ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా తన సొంత టాలెంట్ తో మంచి కమెడియన్ గా ఎదిగాడు. తెలుగులో వచ్చిన పటాస్ ప్రోగ్రామ్ లో చిన్న చిన్న కామెడీ స్కిట్స్ తో ప్రేక్షకులను నవ్వించిన యాదమ్మ రాజు.. తర్వాత బుల్లితెరపై వరుసగా ఛాన్సులు దక్కించుకున్నాడు. జబర్ధస్త్, ఎక్స్ ట్రా జబర్ధస్త్ కామెడీ షో ద్వారా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటున్నాడు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే యాదమ్మ రాజు తన ఇన్‌స్టాగ్రామ్ తీవ్ర విషాదంలో ఓ పోస్ట్ చేశాడు. ‘అక్టోబర్ 3 నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు.. నాకు ఎల్‌కేజీ నుంచి పదవ తరగతి చదువు చెప్పిన మా గురువు ఇక లేరు. నేను చిన్నప్పటి నుంచి ఎలా ఉండాలో ఆయన నేర్పించారు, నేను ఏదైనా తప్పు చేస్తే కొట్టి మరి నాతో సరి చేయించేవారు.. సమాజంలో క్రమశిక్షణతో ఉండాలో చెప్పారు, నేను స్కూల్ ఫీజ్ కట్టలేని సమయంలో ఆయనే కట్టి నన్ను చదివించారు.. నేను ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాను అంటే ఆయన నన్ను ముందుకు నడిపించిన తీరే కారణం..అలాంటి మా ప్రిన్సిపాల్ సర్ ని మిస్ అవుతున్న.. రెస్ట్ ఇన్ పీస్ డా. ఫెడ్రిక్ ఫ్రాన్సిస్ సర్.., ఎంతోమందికి విద్యాబుద్దులు నేర్పించిన గొప్ప గురువు ’ అంటూ ఎమోషనల్ గా పోస్ చేశాడు.

ఈ కాలంలో బంధాలు, బంధుత్వాలు అనేవి పూర్తిగా మర్చిపోయారు.. కష్టాల్లో ఉన్నవారిని పట్టించుకోవడం మానేశారు. అలాంటిది యాదమ్మ రాజు ఇప్పటికీ తన గురువును ఇంతగా గుర్తుపెట్టుకొని ఆయనపై చూపించిన అభిమానానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత చదువు నేర్పిన గురువుని, పని నేర్పించిన గురువుని జీవితాంతం గుర్తు పెట్టుకోవాలి అని అంటారు పెద్దలు. కానీ ఈ కాలంలో అలాంటి వారు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. తన జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి చేరుకున్నాఅని ఎన్నో ఇంటర్వ్యూలో యాదమ్మ రాజు చెప్పడం చూశాం. స్టెల్లా అనే యువతిని ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం బుల్లితెర, వెండితెరపై కనిపిస్తున్నాడు.

Show comments