iDreamPost
android-app
ios-app

వీడియో: జబర్దస్త్ తన్మయి తండ్రి మృతి.. పాడె మోస్తూ కన్నీరు మున్నీరు..

  • Published Aug 26, 2024 | 2:40 PM Updated Updated Aug 26, 2024 | 2:40 PM

Jabardasth Tanmay Father Passed Away: జబర్దస్త్ లో లేడీ గెటప్స్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది తన్మయ్. ఇప్పుడు తన ఇంట్లో విషాదం నెలకొనడంతో పుట్టెడు దుఃఖంలో ఉంది.

Jabardasth Tanmay Father Passed Away: జబర్దస్త్ లో లేడీ గెటప్స్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది తన్మయ్. ఇప్పుడు తన ఇంట్లో విషాదం నెలకొనడంతో పుట్టెడు దుఃఖంలో ఉంది.

  • Published Aug 26, 2024 | 2:40 PMUpdated Aug 26, 2024 | 2:40 PM
వీడియో: జబర్దస్త్ తన్మయి తండ్రి మృతి.. పాడె మోస్తూ కన్నీరు మున్నీరు..

జబర్దస్త్ తన్మయి పుట్టెడు దుఃఖంలో ఉంది. తన తండ్రిని కోల్పోయి కన్నీరు మున్నీరు అవుతోంది. నాన్న.. నాన్న.. అంటూ గుండెలు పగిలేలా ఏడుస్తున్న దృశ్యాలు నెటిజన్స్ ని కలచివేస్తున్నాయి. తన తండ్రి అంతిమ యాత్ర దృశ్యాలను తన్మయి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. “మా నాన్న ఎప్పుడూ నా సూపర్ హీరోనే. నాన్న అంటే ఒక ఎమోషన్.. నేను మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నాను. కానీ, మీరు ఎప్పుడూ నా మనసులో ఉంటారు. కొడుకైనా కూతురైనా నేను మీ బిడ్డని” అంటూ తన్మయి తన పోస్టులో రాసుకొచ్చింది. తన్మయి పోస్ట్ చేసిన వీడియో చూసి అభిమానులు, ఫాలోవర్స్, నెటిజన్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు. RIP అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తన్మయి తండ్రి ఆత్మకు శాంతి చేకూరలని ఆకాంక్షించారు.

తన్మయి జబర్దస్త్ షో ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం. కొన్నేళ్లుగా జబర్దస్త్ లో తన్మయి ప్రేక్షకులను అలరిస్తోంది. లేడీ గెటప్స్ తో తన్మయి బాగా పాపులర్ అయ్యింది. తను ఎక్కువ శాతం జబర్దస్త్ లోనే కనిపిస్తూ ఉంటుంది. శ్రీదేవీ డ్రామా కంపెనీలో కూడా అప్పుడప్పుడు సందడి చేస్తుంటుంది. అయితే తన్మయి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గానే ఉంటుంది. ఆమెకు ఇన్ స్టాగ్రామ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే రీల్స్ చేస్తూ ఫాలోవర్స్ ని ఆకట్టుకుంటుంది. ఎక్కువ శాతం జబర్దస్త్ ఆర్టిస్టులతో కలిసి రీల్స్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే తన్మయి తండ్రిని కోల్పోయి ఇలా పుట్టెడు దుఃఖంలో ఉండటం చూసి ఫాలోవర్స్, అభిమానులు కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Jabardasth Tanmay (@jabardasth_tanmayi)

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetgrandpashabetcasibomcasibomcasibombetcio giriş