iDreamPost
android-app
ios-app

వీడియో: జబర్దస్త్ లోకి కొత్త జడ్జిగా హీరో శివాజీ! ప్రోమో అదుర్స్

  • Published Sep 10, 2024 | 9:16 PM Updated Updated Sep 11, 2024 | 7:06 AM

Jabardasth Latest Promo: ఎన్నో ఏళ్ల నుంచి బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ ఉంది. ఈ షో ద్వారా ఎంతో మంది కామెడియన్స్ గా గుర్తింపు సంపాదించారు. అలానే చాలా మంది స్టార్లు జడ్జీలుగా వ్యవహరించారు. తాజాగా జబర్దస్త్ లోకి కొత్త జడ్డి ఎంట్రీ ఇవ్వనున్నారు.

Jabardasth Latest Promo: ఎన్నో ఏళ్ల నుంచి బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ ఉంది. ఈ షో ద్వారా ఎంతో మంది కామెడియన్స్ గా గుర్తింపు సంపాదించారు. అలానే చాలా మంది స్టార్లు జడ్జీలుగా వ్యవహరించారు. తాజాగా జబర్దస్త్ లోకి కొత్త జడ్డి ఎంట్రీ ఇవ్వనున్నారు.

  • Published Sep 10, 2024 | 9:16 PMUpdated Sep 11, 2024 | 7:06 AM
వీడియో: జబర్దస్త్ లోకి కొత్త జడ్జిగా హీరో శివాజీ! ప్రోమో అదుర్స్

తెలుగు బుల్లితెరపై ఎన్నోషోలు ఆకట్టుకుంటాయి. కామెడీ షోలకు అయితే కొదవేలేదు. ఇక పండగలకు, ప్రత్యేక సందర్భాల్లో కూడా స్పెషల్ ప్రోగ్రామ్స్ వస్తుంటాయి. అయితే కామెడీ షోల్లో జబర్దస్త్ కి ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ ఉంది. ఈ షో ద్వారా ఎంతో మంది కామెడియన్స్ గా గుర్తింపు సంపాదించారు. అంతేకాక ఇక్కడ వచ్చిన ఫేమ్ తో వెండితెరపై కూడా మెరిశారు.  అలానే ఈ షోకు చాలా మంది స్టార్ యాక్టర్లు జడ్జీలుగా వ్యవహరించారు. తాజాగా జబర్దస్త్ షోలోకి కొత్త జడ్జీ వచ్చారు. తాజాగా విడుదలైన ప్రోమోలో ఆ విషయం వెల్లడైంది.

జబర్దస్త్ షో మేకర్స్ తరచూ.. ప్రోమోలను రిలీజ్ చేస్తుంటారు. ప్రతి వారానికి సంబంధించిన  ప్రోమోలను ముందుగానే రిలీజ్ చేస్తుంటారు. ఇక జబర్దస్త్ నుంచి వచ్చే ప్రోమోల కోసం ఆడియన్స్ సైతం ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలోనే వచ్చే వారానికి సంబంధించిన..తాజాగా జబర్దస్త్ షో ప్రోమో రిలీజ్ అయింది. ఈ ప్రోమో మొత్తం చాలా సూపర్ గా ఉంది. బుల్లెట్ భాస్కర్, రాఘవ, ఇమాన్యుయేల్ టీమ్స్ చేసిన కామెడీ అదిరిపోయింది. ఈ ప్రోమో మొత్తం ఐదు నిమిషాలు ఉంది. తాజాగా ప్రోమో ద్వారా మేకర్స్ ఆడియ్స్ కి ఓ అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు. ఈ షోలోకి కొత్త జడ్జిని ఆహ్వానించారు. టాలీవుడ్ హీరో శివాజీ జబర్దస్త్ జడ్జిగా వచ్చారు.

సీనియర్ నటీ ఖుష్బుతో కలిసి శివాజీ సందడి చేశాడు. గతంలో ఈ షోలో కమెడియన్ కృష్ణభగవాన్, ఇంద్రజ లు జడ్జిలుగా వ్యవహరించారు. వీరితో పాటు ఖుబ్బు సైతం జడ్డిగా ఉన్నారు. జబర్దస్త్ టీమ్ కి పోటీగా కృష్ణభగవాన్ కూడా పంచ్ లు వేస్తూ.. ఆడియన్స్ ను అలరించే వారు. తాజాగా ఆయన స్థానంలో హీరో శివాజీ ఎంట్రీ ఇచ్చారు. ఆయన రావడంతోనే జబర్దస్ టీమ్స్ సెటైర్లు స్టార్ చేశారు.  అదే స్థాయిలో శివాజీ కూడా వారిపై రివర్స్ కౌంటర్లు వేశాడు. మొత్తంగా ప్రోమో సరదా సరదాగా సాగిపోయింది. ప్రస్తుతం జబర్దస్త్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు వీక్షించి..మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet