Tirupathi Rao
Jabardasth Mahidhar Allegations On Bigg Boss Adi Reddy: జబర్దస్త్ మహిధర్ కూడా బిగ్ బాస్ రివ్యూస్ చేస్తూ ఉంటాడు అని తెలిసిందే. అయితే ఈయన బిగ్ బాస్ ఆదిరెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. బిగ్ బాస్ స్కామర్ అంటూ విమర్శలు చేశారు.
Jabardasth Mahidhar Allegations On Bigg Boss Adi Reddy: జబర్దస్త్ మహిధర్ కూడా బిగ్ బాస్ రివ్యూస్ చేస్తూ ఉంటాడు అని తెలిసిందే. అయితే ఈయన బిగ్ బాస్ ఆదిరెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. బిగ్ బాస్ స్కామర్ అంటూ విమర్శలు చేశారు.
Tirupathi Rao
బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్ మొదలవ్వగానే.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా రివ్యూస్, రివ్యూవర్స్ కనిపిస్తూ ఉంటారు. అయితే వారిలో మరీ ప్రముఖంగా బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ ఆదిరెడ్డి వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. లక్షల్లో వ్యూస్.. వేలల్లో లైక్స్, వందల్లో కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఆదిరెడ్డి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతాడు అని కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు. అయితే ఆదిరెడ్డి చేసేవి అన్నీ తప్పుడు రివ్యూస్.. చెప్పే మాటలు అన్నీ అబద్ధాలు, బాయాస్డ్ రివ్యూ ఇస్తాడు అంటూ.. తోటి బిగ్ బాస్ రివ్యూవర్, జబర్దస్త్ ఆర్టిస్ట్ మహిధర్ ఆరోపించాడు. ఆదిరెడ్డి బిగ్గెస్ట్ బిగ్ బాస్ స్కామర్ అంటూ ఒక థంబ్ నెయిల్ పెట్టి వీడియో కూడా విడుదల చేశాడు. అసలు మహిధర్ చేసిన ఆ వీడియోలో ఏముందంటే?
ఈ వీడియోలో మహిధర్ మాట్లాడుతూ.. “నేను గతంలో ఆదిరెడ్డిని 9 ప్రశ్నలు అడిగాను. వాటికి ఆయన ఫోన్ చేసి 5 ప్రశ్నలకు సమాధానం చెప్పారు. రెండింటికి పొంతన లేకుండా ఆన్సర్ ఇచ్చారు. మిగిలిన రెండు ప్రశ్నలకు అసలు సమాధానం చెప్పలేను అన్నారు. ఈ వీడియో చూశాక మీరు నాకు ఫోన్, మెసేజ్ చేయకండి. యూట్యూబ్ లోనే రెస్పాండ్ అవ్వండి. నాకు కాల్ చేయద్దు, మెసేజ్ చేయద్దు. బయటకు ఆదిరెడ్డి గురించి మీకు తెలిసిన వాటికంటే నాకు ఇంకా ఎక్కువ తెలుసు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ఫ్లాప్ కావడానికి ఈయనే ప్రధాన కారణం. పల్లవి ప్రశాంత్ ని గెలిచేలా చేసింది.. శివాజీని కావాలని నెగిటివ్ చేశాడు అనేది నిజం. ఆయన కావాలని చేసినా.. కొన్ని అలా జరిగిపోతున్నా కూడా కారణం మాత్రం ఆయనే అవుతున్నాడు. ఆదిరెడ్డి ఒక ఫెయిల్యూర్డ్ రివ్యూవర్. ఏది జరిగినా దానికి ఒక బ్యాక్ స్టోరీ చెప్పాలి కదా. కానీ, ఆయన మాత్రం కొన్నింటికి బ్యాక్ స్టోరీ చెప్పరు. అలా చెప్పకపోవడం వల్ల ఆడియన్స్ కి అసలు నిజం తెలియడం లేదు. నేను అడిగితే అన్నింటికి అలా చెప్పలేం అన్నారు.
సీజన్ 5లో నన్ను నెగిటివ్ చేశారు అని యాంకర్ రవి ఫార్మల్ కంప్లైంట్ చేశాడు. అందుకు ఆయన నేను నెగిటివ్ చేస్తే.. మీరు ఎలా నెగిటివ్ అవుతారు అంటూ ఒక వీడియోలో చెప్పారు. 25 శాతం పీపుల్ ని ఈయన రీచ్ అవుతున్నాడు. ఒక్కరే 25 శాతం మందిని ఇన్ స్పైర్ చేస్తున్నారు. కాబట్టి ఆయన రెస్పాన్సిబుల్ గా ఉండాలి. ఈయన ఒక కంటెస్టెంట్ గా వెళ్లాడు. వచ్చిన తర్వాత ఆయన రివ్యూలకు ఎక్కువ రీచ్ పెరిగింది. ఎందుకంటే ఒక కంటెస్టెంట్ గా ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి.. బాగా చెప్తాడు అనుకుంటారు. కానీ, ఈయన ఒక సాధారణ యూట్యూబర్ గా చెప్తున్నాడు. ఇన్ అండ్ అవుట్ ఎక్స్ ప్లెయిన్ చేయాలి. కానీ, అది చేయడం లేదు. న్యూట్రల్ అనే ముసుగులో పల్లవి ప్రశాంత్ కి సపోర్ట్ చేశారు. అందుకే ఇక నుంచి ఆదిరెడ్డి రివ్యూస్ కి రీ రివ్యూ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాను. ఆయన నుంచి ఒక రోజులో వచ్చిన అన్ని వీడియోస్ కి రీ రివ్యూ చేస్తాను. ఈ రివ్యూ పేరు ఆపరేషన్ ఆదిరెడ్డి.. ఈ పేరు మీద ఇంక కింటిన్యూగా రివ్యూస్ వస్తాయి” అంటూ జబర్దస్త్ మహిధర్ వీడియోలో చెప్పుకొచ్చాడు.