iDreamPost
android-app
ios-app

ఈ చిన్నారి.. ఇప్పుడు హీరోయినై ఇండస్ట్రీని మడత పెట్టేస్తోంది!

  • Published Jun 05, 2024 | 5:05 PM Updated Updated Jun 05, 2024 | 5:05 PM

ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయిని గుర్తు పట్టారా..? ఒక్క సినిమాతోనే పాపులారిటీ తెచ్చుకుంది.ఇండస్ట్రీని ఆరు నెల్లలో ఇండస్ట్రీలో టాప్ హీరోలను మడతపెట్టేసింది. ఇంతకు ఆమె ఎవరంటే..?

ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయిని గుర్తు పట్టారా..? ఒక్క సినిమాతోనే పాపులారిటీ తెచ్చుకుంది.ఇండస్ట్రీని ఆరు నెల్లలో ఇండస్ట్రీలో టాప్ హీరోలను మడతపెట్టేసింది. ఇంతకు ఆమె ఎవరంటే..?

  • Published Jun 05, 2024 | 5:05 PMUpdated Jun 05, 2024 | 5:05 PM
ఈ చిన్నారి.. ఇప్పుడు హీరోయినై ఇండస్ట్రీని మడత పెట్టేస్తోంది!

టాలెంట్ ఎవరి సొత్తు కాదని నిరూపిస్తున్నారు కొంత మంది బ్యూటీస్. ఫస్ట్ సినిమాతోనే వెల్ ట్రైన్ అయ్యి వస్తున్నారు. లేదంటే చైల్డ్ ఆర్టిస్టుగా అడపాదడపా సినిమాలు చేసి.. ఆ తర్వాత హీరోయిన్ల అవతారం ఎత్తుతున్నారు. ఇప్పటి వరకు ఎంతో మంది బాల నటీనటులు హీరోలు, హీరోయిన్లుగా మారి ఇండస్ట్రీని ఏలిన సంగతి విదితమే. చైల్డ్ ఆర్టిస్టుల్లో ఎక్కువగా ఆడ పిల్లలే త్వరగా పరిశ్రమలోకి వచ్చేస్తున్నారు. శ్రీదేవి మొదలుకుని ఇప్పుడు వచ్చిన కావ్య కళ్యాణ్ రామ్ వరకు ఇదే పంథాను కొనసాగిస్తున్నారు. ఇలా అడుగుపెడుతూనే సక్సెస్ అందుకుంటున్నారు. ఈ కోవలోకే వస్తుంది ఈ చిన్నారి కూడా. ఈ ఫోటోలో అమ్మాయిని గుర్తించారా..?

ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమను ఓ షేక్ చేసేసింది. ఒక్కసారిగా ఏడెనిమిది సినిమాలు ఫటా ఫట్ చేసి కామ్ అయిపోయింది. ఇప్పుడు కొత్త సినిమాలేమీ ఒప్పుకోవడం లేదు. కానీ మొన్నటి వరకు వరుస సినిమా ఛాన్సులతో మిగిలిన టాప్ హీరోయిన్లను నిద్ర లేకుండా చేసిందంటే అతిశయోక్తి కాదు. ఇంతకు అంతలా తోటి నటీమణులను భయపెట్టిన ఈ బ్యూటీ ఎవరంటే శ్రీలీల. చూస్తే నమ్మేటట్టు లేదు కదూ.. నిజమే ఆమె మన బ్యూటీ క్వీనే. అమెరికాలో పుట్టి పెరిగిన 16 అణాల తెలుగింటి ఆడపడుచు. చాలా మంది ఆమె తెలుగు సినిమా పెళ్లి సందడి అనుకుంటారు. కానీ అంతకంటే ముందే చైల్డ్ ఆర్టిస్టుగా ఓ సినిమాలో నటించింది.  ఆమె తొలి సినిమా కూడా కన్నడ కాదు.. తెలుగు మూవీనే. అంజలి హీరోయిన్ గా నటించిన చిత్రాంగద మూవీలో సింధు తులానీ చిన్నప్పటి పాత్రలో మెప్పించింది శ్రీలీలనే.

వినడానికి వింతగా ఉన్న ఇది నిజం. ఎంబీబీఎస్ చదువుతున్న ఈ డాక్టరమ్మ.. కన్నడ మూవీ కిస్‌తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత భారతే అనే చిత్రంలో నటించింది. రెండేళ్ల గ్యాప్ తీసుకుని తెలుగులోకి ఎంటర్ అయ్యింది ఈ బ్యూటీ. పెళ్లి సందడి చేసింది. అది సోసో అనిపించగా.. మళ్లీ శాండిల్ వుడ్ వైపు వెళ్లిపోయింది. ఆ సమయంలో రవితేజ హీరోగా వచ్చిన ధమాకాలో శ్రీలీల నటించింది. అందులో ఆమె డ్యాన్స్, యాక్టింగ్‌కు ఫిదా అయిపోయారు ఆడియన్స్. అంతే వరుస పెట్టి ఛాన్సులు కొల్లగొట్టింది. స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మాన్, గుంటూరు కారం సినిమాల్లో నటించింది. వీటిల్లో గుంటూరు కారం, భగవంత్ కేసరి హిట్‌గా నిలిచాయి. పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్‌లో నటిస్తుంది. అయితే ఈ మూవీ షూటింగ్ లేట్ అవుతుంది. ప్రస్తుతం చదువుపై శ్రద్ధపెట్టిన ఈ భామ.. ఇప్పుడు కొత్త సినిమాలు ఒప్పుకోవట్లేదు. ఛాన్సులొస్తున్నా తిరస్కరిస్తోంది అమ్మడు.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetine girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom