iDreamPost
android-app
ios-app

Pawan Kalyan సిద్దా పాత్ర పవన్ కళ్యాణ్ చేసుంటే

  • Published Apr 26, 2022 | 6:39 PM Updated Updated Apr 26, 2022 | 6:39 PM
Pawan Kalyan సిద్దా పాత్ర పవన్ కళ్యాణ్ చేసుంటే

ఇవాళ తెలుగు మీడియా కోసం ప్రత్యేకంగా ఆచార్య యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. చిరంజీవి చరణ్ కొరటాల శివతో పాటు పూజా హెగ్డే కూడా హాజరు కావడం విశేషం. ఇంతకన్నా పెద్ద లెన్త్ క్యారెక్టర్లు వేసిన సినిమాలకు ఈ స్థాయిలో పొడుగు కాళ్ళ సుందరి ప్రమోషన్ చేయడం గతంలో లేదు. దానికి కారణాలు ఏవైనా సిద్దాకు జోడిగా నటించడం మీద తనకు చాలా అంచనాలు ఉన్నాయి. దీని సంగతలా ఉంచితే ఇంటర్వ్యూలో భాగంగా పలు ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఒకవేళ సిద్దా పాత్రకు రామ్ చరణ్ బదులు పవన్ కళ్యాణ్ అయితే ఎలా ఉండేదన్న ఒక విలేఖరి ప్రశ్నకు చిరు బదులిస్తూ అదే జరిగి ఉంటే ఇంతకన్నా గొప్పగా పండేదని చెప్పడం విశేషం.

జరగలేదు కానీ ఒకవేళ ఆచార్యలో సిద్దాకు చరణ్ కాకుండా పవన్ కళ్యాణ్ ఉండుంటే హైప్ ఏ లెవెల్ లో ఉండేదో ఊహించుకోవడం కష్టమే. ఎందుకంటే మెగాస్టార్ పవర్ స్టార్ కాంబినేషన్ ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నా సాధ్యపడటం లేదు. శంకర్ దాదా జిందాబాద్ క్లైమాక్స్ ఫైట్ లో కొన్ని నిముషాలు కలుసుకుంటారు తప్ప అంతకు మించి లెన్త్ లేదు. శంకర్ దాదా ఎంబిబిబీఎస్ లోనూ జస్ట్ ఒక పాటలో పవన్ మంచం మీద కనిపిస్తారంతే. ఇవి కాకుండా అన్నదమ్ములు కలిసి నటించిన దాఖలాలు లేవు. అంత అన్యోన్యత ఉన్నా కూడా స్క్రీన్ షేర్ చేసుకోకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రస్తావన వచ్చింది.

సుమారు 135 కోట్ల థియేట్రికల్ బిజినెస్ టార్గెట్ తో బరిలో దిగిన ఆచార్యకు లక్ష్యం అంత సులభం కాదు. ఎంత చిరు చరణ్ ల కాంబినేషన్ అయినప్పటికీ ప్రీ రిలీజ్ వైబ్రేషన్స్ ఉండాల్సినంత స్థాయిలో లేవు. టీమ్ మాత్రం గత అయిదారు రోజుల నుంచి అలసట లేకుండా ప్రమోషన్లు చేస్తూనే ఉన్నారు. ఏపి తెలంగాణలో కోరి మరీ టికెట్ హైక్స్ తెచ్చుకున్నారు కాబట్టి మౌత్ టాక్ బలంగా ఉంటేనే కలెక్షన్లు భారీగా వస్తాయి. ఈ రోజు ప్రెస్ మీట్ లో పూజా హెగ్డేతో చిరు చేసిన సరదా అల్లరి వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కొరటాల శివ మాత్రం ట్రైలర్ అసలేమీ చూపించలేదని అసలైన, కంటెంట్ చాలా ఉందని ఊరించడం విశేషం.