iDreamPost
android-app
ios-app

ప్రభాస్ గొప్ప మనసు.. ఆ కారణంతో పారితోషికం తగ్గించుకొన్నాడా?

  • Published Jul 23, 2024 | 11:02 AM Updated Updated Jul 23, 2024 | 11:02 AM

Prabhas Reduced Remuneration: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఆ కారణంతో డార్లింగ్ తన పారితోషికం తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

Prabhas Reduced Remuneration: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఆ కారణంతో డార్లింగ్ తన పారితోషికం తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Jul 23, 2024 | 11:02 AMUpdated Jul 23, 2024 | 11:02 AM
ప్రభాస్ గొప్ప మనసు.. ఆ కారణంతో పారితోషికం తగ్గించుకొన్నాడా?

ప్రభాస్.. పాన్ ఇండియా స్టార్ గా అందరి హీరోల కంటే కాస్త ముందున్నాడనే చెప్పాలి. వరుసగా పాన్ ఇండియా మూవీలు చేస్తూ.. దూసుకెళ్తున్నాడు రెబల్ స్టార్. బహుబలి నుంచి డార్లింగ్ చేసిన ప్రతీ సినిమా పాన్ ఇండియా మూవీనే. ఇక లేటెస్ట్ గా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చిన కల్కి 2898 ఏడీ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రూ. 1000 కోట్ల క్లబ్ చేరడమే కాక.. ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు ప్రభాస్. ఈ క్రమంలోనే డార్లింగ్ కు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ప్రభాస్ తన పారితోషికం తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

వివాదాలకు దూరంగా నిర్మాతలకు అండగా నిలిచే హీరోల్లో ప్రభాస్ ఒకడు. తాజాగా తన గొప్ప మనసును చాటుకుంటూ.. రెమ్యూనరేషన్ తగ్గించుకున్నాడని వార్తలు వైరల్ గా మారాయి. అసలు ఏ కారణంతో డార్లింగ్ ఈ నిర్ణయం తీసుకున్నాడో ఇప్పుడు చూద్దాం. ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ అనే మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని పీపుల్  మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. గతంలో ఈ ప్రొడక్షన్ హౌస్ ‘ఆదిపురుష్’ మూవీని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసింది. ఆ సినిమా నిరాశపరచడంతో ఈ నిర్మాణ సంస్థకు నష్టాలు వచ్చాయి.

అయితే ఈ ఒప్పంద సమయంలో ప్రభాస్ వారికి నేనున్నాను అంటూ భరోసా ఇచ్చాడట. అదీకాక అప్పటికే రాజా సాబ్ మూవీ కూడా ఓకే అయిపోయింది. దాంతో ఇప్పుడు ప్రభాస్ రాజా సాబ్ రెమ్యూనరేషన్ ను తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నాడట. అప్పటి నష్టాలను ఎంతో కొంత పూడ్చటానికి తన వంతు సాయం చేస్తున్నాడన్నమాట. ప్రస్తుతం ప్రభాస్ ఒక్కో సినిమాకు రూ. 150 నుంచి 200 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. కానీ రాజా సాబ్ కోసం తగ్గించి తీసుకుంటున్నాడట. ఈ విషయం వైరల్ కావడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఉప్పొంగిపోతున్నారు. మా డార్లింగ్ ప్రేమకు ఇదొక ఉదాహరణ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మరి తన గొప్ప మనసును చాటుకుంటూ పారితోషికం తగ్గించుకున్న ప్రభాస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş