iDreamPost
android-app
ios-app

నలుగురు హీరోలు కలిసి దిగిన రేర్ ఫోటో! ఏ మూవీ కోసం కలిశారంటే?

  • Published Aug 27, 2024 | 6:03 PM Updated Updated Aug 27, 2024 | 6:03 PM

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జునలు కలిసి ఒక్క మూవీలోనూ నటించలేదు. కానీ ఏదైనా ఈవెంట్లలో ఈ నలుగురు కనిపిస్తే సినీ ప్రియులకు గూస్ బంప్స్ రావడం పక్కా. అలాంటిది ఓ పిక్ వైరల్ అవుతుంది. ఈ నలుగురు కలిసిన ఈ పిక్ ఏ సందర్భంలోనిదో తెలుసా..?

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జునలు కలిసి ఒక్క మూవీలోనూ నటించలేదు. కానీ ఏదైనా ఈవెంట్లలో ఈ నలుగురు కనిపిస్తే సినీ ప్రియులకు గూస్ బంప్స్ రావడం పక్కా. అలాంటిది ఓ పిక్ వైరల్ అవుతుంది. ఈ నలుగురు కలిసిన ఈ పిక్ ఏ సందర్భంలోనిదో తెలుసా..?

  • Published Aug 27, 2024 | 6:03 PMUpdated Aug 27, 2024 | 6:03 PM
నలుగురు హీరోలు కలిసి దిగిన రేర్ ఫోటో! ఏ మూవీ కోసం కలిశారంటే?

తొలి తరం స్టార్ హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు వంటి స్టార్స్ జోడీలుగా యాక్ట్ చేసి ఆకట్టుకున్నారు. కానీ ఆ తర్వాత తరం యాక్టర్స్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జునలు కలిసి ఒక్క మూవీలోనూ నటించలేదు. వెంకటేశ్ త్రిమూర్తులు మూవీలోని ఓ పాటలో ఈ నలుగురు స్టార్ హీరోలు కనిపిస్తారు. వీరిలో ఏ పెయిర్ జత కట్టినా చూడాలని అనుకుంటూ ఉంటారు. కానీ కుదరలేదు. కానీ ఈ నలుగురు సినిమా వేడుకల్లో కనిపిస్తే ఫుల్ ఖుషీ అయిపోతుంటారు ఫ్యాన్స్. తాజాగా ఈ నలుగురు హీరోలు కలిసి దిగిన పిక్ ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇదే ఆ పిక్. చిరు, బాలయ్య, వెంకీ, నాగ్ నలుగురు ఒక్కచోట కనిపిస్తున్నారు. అయితే ఇది షూటింగ్ సమయంలో క్లిక్ మనిపించిన పిక్‌. ఇది ఏ సినిమా షూటింగ్ సమయంలో తీసినదో చెప్పగలరా..?

ఈ ఫోటోలో స్టార్ హీరోలతో పాటు.. హీరోయిన్లు కూడా కనిపిస్తున్నారు కదా. టాలీవుడ్‌ను 80-90ల్లో ఓ ఊపు ఊపేసిన స్టార్ హీరోయిన్స్ మీనా, రోజా, రమ్యకృష్ణ, నగ్మా కూడా కనిపిస్తున్నారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి గెటప్ చూస్తుంటే ముగ్గురు మొనగాళ్లు షూటింగ్ అప్పటిదిలా కనిపస్తుంది. 1994లో విడుదలైన ఈ చిత్రంలో చిరంజీవి త్రిబుల్ రోల్‌లో నటించారు. అందులో మీనా మినహాయించి మిగిలిన ముగ్గురు యాక్ట్ చేశారు. అలాగే అదే సమయంలో నాగార్జున, మీనా పెయిర్ కూడా కనిపిస్తుంది. అల్లరి అల్లుడు, ప్రెసిడెంట్ గారి పెళ్లాం షూటింగ్ అయ్యి ఉండొచ్చు. అలాగే ముగ్గురు మొనగాళ్లు ఓపెనింగ్ షాట్‌కు ఈ స్టార్ హీరోలు వచ్చి ఉండొచ్చునని తెలుస్తుంది. మొత్తానికి నలుగురు హీరోలు ఒకే చోట కనిపించే సరికి పిక్చర్‌కే నిండుతనం వచ్చింది.

ప్రస్తుతం ఈ నలుగురు హీరోలు పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. విశ్వంభరతో చిరంజీవి ఫుల్ వర్క్ ఫోర్సులో ఉంటే.. వెంకటేశ్.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న మరో సినిమా రాబోతుంది. ఇందులో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లు. బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. బాలయ్య, బోయపాటి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తుండగా.. కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో మరో మూవీ చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. నాగార్జున ప్రస్తుతం ఒక ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న కుబేరలో నటిస్తున్నారు. ఇందులో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ లీడ్ రోల్ చేస్తున్న సంగతి విదితమే. వీరంతా తర్వాతి తరంతో నటించారు కానీ.. వారి తరం స్టార్ నటులతో యాక్ట్ చేయడం అరుదు.

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet girişjojobet giriş