ఈ యాక్టర్‌ని గుర్తుపట్టారా..? టాలీవుడ్‌ను నెక్ట్స్ స్టేజ్‌కి తీసుకెళ్లిన హీరో..!

ఈ ఫోటోలో కనిపిస్తున్న యాక్టర్‌ని గుర్తుపట్టారా..? లేడీ గెటప్ లో మెస్మరైజ్ చేస్తున్న ఈ నటుడు టాలీవుడ్‌ను నెక్ట్స్ స్టేజ్‌కి తీసుకెళ్లిన హీరో. ఎన్నో ఏళ్ల నుండి కళామతల్లికి సేవలందిస్తున్నాడు. ఇంతకు ఆ నటుడు ఎవరంటే..?

ఈ ఫోటోలో కనిపిస్తున్న యాక్టర్‌ని గుర్తుపట్టారా..? లేడీ గెటప్ లో మెస్మరైజ్ చేస్తున్న ఈ నటుడు టాలీవుడ్‌ను నెక్ట్స్ స్టేజ్‌కి తీసుకెళ్లిన హీరో. ఎన్నో ఏళ్ల నుండి కళామతల్లికి సేవలందిస్తున్నాడు. ఇంతకు ఆ నటుడు ఎవరంటే..?

సినిమా కోసం నటీనటులు మేకోవర్ అవుతుంటారు. క్యారెక్టర్ కోసం ప్రాణం పెట్టేస్తుంటారు. కథ డిమాండ్ చేస్తే గుండు గీయించుకుని యాక్ట్ చేసిన స్టార్స్ ఉన్నారు. అయితే కెరీర్ స్టార్టింగ్‌లో అయితే ప్రయోగాల జోలికి వెళతారు కానీ.. స్టార్ హోదా వచ్చాక అది కూడా ఇండస్ట్రీలో టాప్ పోజిషన్‌లో రాణిస్తున్న సమయంలో డిఫరెంట్ రోల్ చేయాలంటే కాస్తంత తడబడుతుంటారు. కానీ ఈ స్టార్ ఇవేమీ లెక్కచేయకుండా ఫీమేల్ గెటప్‌లో ఆకట్టుకున్నాడు. ఈ ఫోటోలో లేడీ గెటప్‌లో కనిపిస్తున్న నటుడ్ని గుర్తుపట్టారా..? ఎవరో చెప్పుకోండి చూద్దాం. ఆయన.. తెలుగు ప్రేక్షకుల అభిమాన హీరో. టాలీవుడ్‌ను నెక్ట్స్ స్టేజ్‌కి తీసుకెళ్లిన హీరో. ఎంతో మందికి మెంటర్. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా భావిస్తున్న మెగాస్టార్ చిరంజీవి. ఆయన లేడీ గెటప్ వేసిన ఈ సీన్ ఏ మూవీలోదో తెలుసా..?

అది 1980వ దశకం.. చిరంజీవి సుప్రీమ్ హీరోగా స్టార్ డమ్ తెచ్చుకుంటున్న సమయం. 1985 నాటికే 75 సినిమాలు పూర్తి చేశారు. వరుస పెట్టి యాక్షన్ అండ్ ఫ్యామిలీ చిత్రాలతో ఫుల్ ఫాంలో ఉన్నారు. దొంగ, జ్వాల, వేట, విజేత, కొండ వీటి రాజా వంటి చిత్రాలు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలొచ్చాయి. ఆ సమయంలోనే చిరు నుండి వచ్చిన కామెడీ ఎంటర్ టైనర్ చంటబ్బాయి. హాస్య చక్రవర్తి, క్లీన్ కామెడీ చిత్రాల దర్శకుడు జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కింది. ఇప్పుడు మీరు చూస్తున్న పిక్ ఆ సినిమాలోనిదే. 1986లో మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు నాడే ఈ చిత్రం విడుదలై సక్సెస్ అయ్యింది. ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణ మూర్తి నవల చంటబ్బాయి ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు జంధ్యాల. ఈ సినిమాలో సుహాసిని హీరోయిన్. జగ్గయ్య, ముచ్చర్ల అరుణ, చంద్రమోహన్, సుధాకర్ కీలక పాత్రలు పోషించారు.

ఇక ఈ మూవీలో చిరంజీవి డిటెక్టివ్‌గా యాక్ట్ చేశారు. అనుకోకుండా సుహాసిని ఓ హత్య కేసులో ఇరుక్కుపోతుంది. అప్పటికే ఆమెను ప్రేమిస్తూ ఉంటాడు మన చిరు. అయితే ఆమెను అనుమానించాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఓ పాట వస్తుంది. అదే ‘నేను ప్రేమ పూజారి, ఏదీ పోదు చేజారీ’ సాంగ్‌లో వివిధ రూపాల్లో కనిపిస్తాడు. హరిదాసుగా, పోతురాజు, అలాగే మోడ్రన్ అమ్మాయి మిస్ మేరీ గెటప్‌లో కాసేపు కనిపించి మెస్మరైజ్ చేశాడు మన మెగాస్టార్. ఈ పాత్ర కోసం మీసాలు తీసేసి నటించాడు ఈ స్టార్ హీరో. కానీ మంచి అప్లాజ్ వచ్చేసరికి తాను పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఆ నటుడు ఆ తర్వాత ఇండస్ట్రీలో టాప్ హీరోగా మారి.. బాక్సాఫీసును శాసించాడు. ఇప్పటికీ అదే ఆరా కొనసాగుతుంది. ప్రస్తుతం ఆయన విశ్వంభర చేస్తున్నారు. ఈ రోజు ఈ అంజనా పుత్రుడి పుట్టిన రోజు. ఇంకా మంచి సినిమాలు తీసి.. మరింత మంది అభిమానుల్ని సంపాదించుకోవాలని ఆశిద్దాం.

Show comments