iDreamPost
android-app
ios-app

త్రిషకు చిరంజీవి కాస్ట్లీ గిఫ్ట్.. ధర ఎంతంటే..?

  • Published Mar 11, 2024 | 11:59 AM Updated Updated Mar 11, 2024 | 11:59 AM

మెగాస్టార్ చిరంజీవి, కోలీవుడ్ చందమామ త్రిష పెయిర్ మరోసారి జతకట్టబోతుంది. సుమారు 19 ఏళ్ల తర్వాత ఈ జోడి విశ్వంభరతో బిగ్ స్క్రీన్ పై సందడి చేసేందుకు సిద్ధమైంది. మల్లిడి విశిష్ట దర్శకుడిగా వస్తున్న ఈ చిత్రం

మెగాస్టార్ చిరంజీవి, కోలీవుడ్ చందమామ త్రిష పెయిర్ మరోసారి జతకట్టబోతుంది. సుమారు 19 ఏళ్ల తర్వాత ఈ జోడి విశ్వంభరతో బిగ్ స్క్రీన్ పై సందడి చేసేందుకు సిద్ధమైంది. మల్లిడి విశిష్ట దర్శకుడిగా వస్తున్న ఈ చిత్రం

  • Published Mar 11, 2024 | 11:59 AMUpdated Mar 11, 2024 | 11:59 AM
త్రిషకు చిరంజీవి కాస్ట్లీ గిఫ్ట్.. ధర ఎంతంటే..?

బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం విశ్వంభర. సోషియో ఫాంటసీ మూవీగా రూపొందుతున్న విశ్వంభర.. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతుంది. సిస్టర్ సెంటిమెంట్ ఉండనున్నట్లు తెలుస్తోంది. త్రిష, సురభి వంటి తారలతో సెట్స్ కళకళలాడుతోంది. స్టాలిన్ తర్వాత చిరంజీవి సరసన ఆడిపాడనుంది త్రిష. ఇకపోతే ఇందులో మృణాల్, ఇషా చావ్లా, మీనాక్షి చౌదరి స్టార్ హీరోయిన్లు కూడా అలా మెరవబోతున్నారని టాక్ నడుస్తోంది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ఇటీవల ఓ సాంగ్ షూట్ కూడా పూర్తయినట్లు సమాచారం.

ఇంచుమించు 19 ఏళ్ల తర్వాత చిరు, త్రిష జతకట్టబోతున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ త్రిషకు చిరంజీవి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. అది ఆమెకు బాగా నచ్చడంతో.. మెగాస్టార్ చిరంజీవికి ధన్యవాదాలు తెలిపింది. ఇంతకు ఆమెకు ఈ జగదీక వీరుడు ఏం ఇచ్చారంటే.. ఇది టెంపరేజర్డ్ కంట్రోల్ మగ్. ఇదొక స్మార్ట్ మగ్ అని అర్థమౌతుంది. ఈ సర్ ప్రైజ్ గిఫ్టుకు ఫిదా అయిన ఈ బ్యూటీ.. తనకు నచ్చిందని పేర్కొంటూ.. చిరుకు ధ్యాంక్స్ చెప్పింది. ప్రస్తుతం ఈ మగ్ ఈ కామర్స్ సంస్థల్లో లభిస్తున్నాయి. ఈ మగ్ విలువ రూ. 35 వేలకు పై చిలుకు అన్నట్లుగా తెలుస్తోంది. ఈజీగా క్యారీ చేయడానికి వీలుగా ఉండటంతో ట్రావెలింగ్ సమయంలో కూడా యూజ్ ఫుల్‌గా ఉంటుంది. ఇందులో అద్బుతమైన ఫీచర్స్ ఉన్నాయి. సెల్ ఫోన్‌లో యాప్ సాయంతో టెంపరేచర్ ఆపరేట్ చేసుకోవచ్చు.

ఇక త్రిష విషయానికి వస్తే.. 40 సంవత్సరాలు వచ్చినా తరగని అందంతో హీరోలకు పోటీగా నటిస్తోంది. 96 మూవీ తర్వాత క్యాచీగా సినిమాలు ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఇటీవల వచ్చిన పొన్నియల్ సెల్వన్ ఆమె నటనతో పాటు బ్యూటీకి కూడా మెస్మరైజ్ అయ్యారు ఫ్యాన్స్. అటు లియోలో కూడా ఇళయ దళపతి విజయ్ సరసన నటించడమే కాదూ.. ఇద్దర పిల్లల తల్లిగానూ మెప్పించింది. నాయకి బైలింగ్వల్ మూవీ తర్వాత నేరుగా తెలుగు సినిమా చేయలేదు త్రిష. ఇప్పుడు విశ్వంభరతో రాబోతుంది. వచ్చే ఏడాది మూవీ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో రామ్, ఐడెంటిటీ, విదా ముయార్చి, థగ్ లఫ్ వంటి బడా ప్రాజెక్టులు ఉన్నాయి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetjolly girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş