iDreamPost
android-app
ios-app

ఫ్యాన్స్ కు ఎగిరిగంతేసే న్యూస్.. ‘అన్ స్టాపబుల్’ షోలో చిరంజీవీ, బాలకృష్ణ!

  • Published Aug 10, 2024 | 6:02 PM Updated Updated Aug 10, 2024 | 6:02 PM

Balakrishna Unstoppable Show: అన్‌స్టాపబుల్‌ కొత్త సీజన్‌ను సరికొత్త సర్‌ప్రైజ్‌లతో మేకర్స్ సిద్ధం చేస్తున్నారట. ఇప్పటికే టాలీవుడ్‌లోని పలువురు హీరోలు, దర్శకులు, ఇతర సెలబ్రిటీలతో అన్ స్టాపబుల్ షో సందడి చేసింది. ఇప్పుడు మరింత ఫుల్‌ జోష్‌తో  ఈ షో సాగేలా మేకర్స్‌ ప్లాన్ చేశారట. ఈ క్రమంలోనే ఓ సర్ ఫ్రైజింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.

Balakrishna Unstoppable Show: అన్‌స్టాపబుల్‌ కొత్త సీజన్‌ను సరికొత్త సర్‌ప్రైజ్‌లతో మేకర్స్ సిద్ధం చేస్తున్నారట. ఇప్పటికే టాలీవుడ్‌లోని పలువురు హీరోలు, దర్శకులు, ఇతర సెలబ్రిటీలతో అన్ స్టాపబుల్ షో సందడి చేసింది. ఇప్పుడు మరింత ఫుల్‌ జోష్‌తో  ఈ షో సాగేలా మేకర్స్‌ ప్లాన్ చేశారట. ఈ క్రమంలోనే ఓ సర్ ఫ్రైజింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.

  • Published Aug 10, 2024 | 6:02 PMUpdated Aug 10, 2024 | 6:02 PM
ఫ్యాన్స్ కు ఎగిరిగంతేసే న్యూస్.. ‘అన్ స్టాపబుల్’ షోలో చిరంజీవీ, బాలకృష్ణ!

టాలీవుడ్ స్టార్ హీరోలు చాలా మంది వివిధ షోలకు హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా హోస్ట్ గా అందరిని ఆకట్టుకుంటున్నారు. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, నాని వంటి వారు పలు షోల్లో హోస్ట్ గా వ్యవహరించారు. ఇక నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ అనే టాక్ షో కి హోస్ట్ గా వ్యహరిస్తున్న సంగతి తెలిసింది. సక్సెస్ పుల్ గా మూడు సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే కొత్త సీజన్ కోసం ఏర్పాట్లు జరుగుతోన్నాయి. ఇప్పటికే ఈ షోకు సంబంధించి ఏర్పాట్లు పూరయ్యాయి.

అన్‌స్టాపబుల్‌ కొత్త సీజన్‌ను సరికొత్త సర్‌ప్రైజ్‌లతో మేకర్స్ సిద్ధం చేస్తున్నారట. ఇప్పటికే టాలీవుడ్‌లోని పలువురు హీరోలు, దర్శకులు, ఇతర సెలబ్రిటీలతో అన్ స్టాపబుల్ షో సందడి చేసింది. ఇప్పుడు మరింత ఫుల్‌ జోష్‌తో  ఈ షో సాగేలా మేకర్స్‌ ప్లాన్ చేశారట. ఈ నేపథ్యంలోనే ఈసారి ముఖ్య అతిథిగా టాలీవుడ్ మెగాస్టార్‌ చిరంజీవి రానున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించకపోయినట్పికీ దాదాపు ఖరారైంది. వాస్తవానికి ఈ ప్రచారం అన్ స్టాపబుల్ షో ప్రారంభమైన ప్రతీ సీజన్‌లోనూ సాగింది. కానీ గత సీజన్లలో అది కుదరలేదు. అయితే ఈ సారి మాత్రం ఈ ప్రచారం కార్యరూపం దాల్చేలా ప్లాన్ చేస్తున్నారు. అధికారికంగా ప్రకటన రావడమే తరువాయి.

Balayya

చిరు పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రకటన వెలువడవచ్చని టాక్‌ వినిపిస్తోంది. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవిది, బాలకృష్ణలది ప్రత్యేక స్థానం. వీరిద్దరికి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 90 దశకంలో వీరి సినిమాలకు పోటాపోటీగా రిలీజ్ అయ్యేవి. మాస్‌ హీరోలుగా వాళ్లకున్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరు ఒక వేదికపై కనిపించడం చాలా అరుదు. అలా చూడాలని ఇరువురి ఫ్యాన్స్ కూడా కోరుకున్నారు. ఆవారి కల అన్ స్టాపబుల్ షో రూపంలో నిజం కానుంది.

టాలీవుడ్ స్టార్‌లు ఒకే వేదికపై కనిపిస్తే, అభిమానులకు అంతకుమించిన  వినోదం ఏముంటుంది. ఈ సర్ ఫ్రైజ్ తో పాటు మరికొన్ని సర్‌ప్రైజ్‌ ఉంటాయని తెలుస్తుంది. అయితే ఈ వార్త తెలిసిన నందమూరి,  మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక వీరిద్దరి కలయికలో వచ్చే ఎపిసోడ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ హీరోల ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ కూడా వీరిద్దరిని ఒకే స్టేజ్ పై చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా చిరు – బాలయ్య కలిసి ఒకే వేదికపై కనిపిస్తే ఆ కిక్కే వేరని పలువురు సినీ లవర్స్ అభిప్రాయా పడుతున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom