iDreamPost

KBC లైవ్​లో కన్నీళ్లు పెట్టుకున్న అమితాబ్.. ఇంకెంత ఏడిపిస్తారంటూ..!

  • Author singhj Published - 09:25 AM, Tue - 10 October 23
  • Author singhj Published - 09:25 AM, Tue - 10 October 23
KBC లైవ్​లో కన్నీళ్లు పెట్టుకున్న అమితాబ్.. ఇంకెంత ఏడిపిస్తారంటూ..!

దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరు అమితాబ్ బచ్చన్. పలు దశాబ్దాలుగా తన అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానుల్ని ఆయన సొంతం చేసుకున్నారు. వయసు పైబడుతున్నా అదే అందం, ఫిట్​నెస్​తో ఇంకా మూవీస్​లో యాక్ట్ చేస్తున్నారు బాలీవుడ్​ బిగ్​బీ. సినిమాలతో పాటు తనను తిరిగి నిలబెట్టిన ‘కౌన్ బనేగా కరోడ్​పతి’ (కేబీసీ) రియాలిటీ షోకూ హోస్ట్​గా వ్యవహరిస్తున్నారు. త్వరలో 81వ పడిలోకి ఈ లెజెండరీ యాక్టర్ అడుగుపెట్టనున్నారు. ఈ తరుణంలో కేబీసీ ప్రొడ్యూసర్స్ ఏదో గ్రాండ్​గా ప్లాన్ చేసినట్లు కనిపిస్తున్నారు. కేబీసీని హోస్ట్ చేస్తున్న టైమ్​లో తన కోసం చేసిన ప్లాన్స్​ను చూసి అమితాబ్ ఆశ్చర్యపోయారు.

కేబీసీ ప్రొడ్యూసర్స్ తన బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం చేసిన ఏర్పాట్లను చూసి అమితాబ్ ఎమోషనల్ అయ్యారు. ఆయన లైవ్​లోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. తాజాగా రిలీజైన కేబీసీ ప్రోమోలో బిగ్​ బీ భావోద్వేగానికి లోనైనట్లు కనిపించారు. ప్రేక్షకులతో పాటు కౌన్ బనేగా కరోడ్​పతి షో నిర్వాహకులకు ఆయన థ్యాంక్స్ చెప్పారు. ‘నన్ను ఇంకా ఎంత ఏడిపిస్తారు? అందరికీ నేను టిష్యూ ఇచ్చేవాడ్ని. ఇప్పుడు నాకూ ఒకటి కావాలి. ఈ షోలో జరుగుతున్న నా పుట్టిన రోజు వేడుకలు అన్నింటి కంటే బెస్ట్ సెలబ్రేషన్స్’ అని ఆ ప్రోమోలో అమితాబ్ చెప్పుకొచ్చారు. ఇందులో బిగ్ బీ ఫొటో ఉన్న హుడీలను ఆడియెన్స్ ధరించారు.

అమితాబ్ బర్త్ డే నేపథ్యంలో కేబీసీలో స్పెషల్​గా మ్యూజిక్ పెర్ఫార్మెన్స్ ఏర్పాట్లు చేశారు. అలాగే సినీ పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి, బొమన్ ఇరానీ, విద్యా బాలన్, విక్కీ కౌశల్ తదితరులు బిగ్​ బీకి విషెస్ చెబుతూ సందేశాలను అందించారు. ఈ వేడుకల్లో కేబీసీ మాజీ విన్నర్స్ బాబీ తావ్డే, హిమానీ బుందేలా, జస్కరన్ సింగ్ కూడా పాల్గొన్నట్లు సమాచారం. కాగా, కౌన్ బనేగా కరోడ్​పతి గత సీజన్​లో అమితాబ్ 80వ పుట్టిన రోజు వేడుకల్ని జరుపుకున్నారు. అప్పట్లో ఆ సెలబ్రేషన్స్​కు బిగ్ బీ భార్య జయా బచ్చన్​తో పాటు కుమారుడు అభిషేక్ బచ్చన్ హాజరై ఆయన్ను ఆశ్చర్యపరిచారు.

ఇదీ చదవండి: ‘గేమ్ ఛేంజర్’ OTT పార్ట్ నర్ ఫిక్స్.. సినీ చరిత్రలో భారీ డీల్!

 

View this post on Instagram

 

A post shared by Sony Entertainment Television (@sonytvofficial)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి