iDreamPost
android-app
ios-app

Tollywood: హీరోయిన్ కేథరీన్.. పాన్ ఇండియా మూవీ “ఫణి” టైటిల్ లాంఛ్!

  • Published Oct 03, 2024 | 6:54 PM Updated Updated Oct 03, 2024 | 6:54 PM

Phani Movie: వీఎన్ ఆదిత్య తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమాకు ఫణి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మూవీని ఓ.ఎం.జీ ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై, ఏయు & ఐ స్టూడియో సమర్పణలో మీనాక్షి అనిపిండి నిర్మిస్తున్నారు.

Phani Movie: వీఎన్ ఆదిత్య తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమాకు ఫణి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మూవీని ఓ.ఎం.జీ ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై, ఏయు & ఐ స్టూడియో సమర్పణలో మీనాక్షి అనిపిండి నిర్మిస్తున్నారు.

Tollywood: హీరోయిన్ కేథరీన్.. పాన్ ఇండియా మూవీ “ఫణి” టైటిల్ లాంఛ్!

 

సీనియర్ డైరెక్టర్ వీఎన్ ఆదిత్య తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమాకు ఫణి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మూవీని ఓ.ఎం.జీ ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై, ఏయు & ఐ స్టూడియో సమర్పణలో డాక్టర్‌ మీనాక్షి అనిపిండి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో క్రేజీ హీరోయిన్ కేథరీన్ లీడ్ రోల్ లో నటిస్తున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్, ఓ.ఎమ్.జీ ప్రొడక్షన్స్ బ్యానర్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం అమెరికాలోని డల్లాస్ లో జరిగింది. సినిమా టైటిల్ ను డాక్టర్ తోటకూర ప్రసాద్ లాంఛ్ చేయగా, ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర బ్యానర్ లోగోను లాంచ్ చేశారు. ఈ వేడుకలో డాక్టర్ ఆళ్ల శ్రీనివాస రెడ్డి, డాక్టర్ ఇస్మాయిల్ సుహైల్ పెనుగొండ అతిథులుగా పాల్గొన్నారు. ఫణి సినిమా టీమ్ కు తమ బెస్ట్ విషెస్ అందించారు.

ఇందులో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్, నిర్మాత డా. మీనాక్షి అనిపిండి మాట్లాడుతూ.. “నేను ఇప్పటిదాకా మీకు బాగా మ్యూజిక్ చేస్తానని, పాటలు పాడతానని తెలుసు. ఫణి సినిమాతో వీఎన్ ఆదిత్య గారి దర్శకత్వంలో మా ఓ.ఎం.జీ ప్రొడక్షన్ బ్యానర్ పై తొలి ప్రయత్నం చేస్తున్నాము. ఈ రోజు మా ఫణి మూవీ టైటిల్ లాంఛ్ కు వచ్చిన నిర్మాత అనిల్ సుంకర గారికి, తోటకూర ప్రసాద్ గారికి, ఇతర అతిథులు అందరికీ థ్యాంక్స్. ఆల్రెడీ 50 పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ చేశాం. మిగతా షూటింగ్ పూర్తి చేసి త్వరలోనే పాన్ ఇండియా రిలీజ్ కు తీసుకొస్తాం. మీ అందరి సపోర్ట్ తో మా ఓ.ఎం.జీ సంస్థలో మరిన్ని మూవీస్ చేయాలని కోరుకుంటున్నా.” అని అన్నారు.

నటుడు మహేశ్ శ్రీరామ్ మాట్లాడుతూ.. “ఫణి మూవీలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. డాక్టర్ వీఎన్ ఆదిత్య గారి దర్శకత్వంలో నటించడం ఎంతో సంతోషంగా ఉంది. ఆయన సినిమాలను మనం ఎంతగానో ఇష్టపడతాం. ఓ.ఎం.జీ ప్రొడక్షన్స్ ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. ఫణి మూవీ షూటింగ్ కు ప్రతి రోజు ఎగ్జైట్ మెంట్ తో వెళ్లాను. మిమ్మల్ని థ్రిల్ చేసేలా ఫణి మూవీ ఉంటుంది.” అని అన్నారు.

నటి నేహా కృష్ణ మాట్లాడుతూ.. “ఫణి మూవీ టైటిల్ లాంఛ్ కు వచ్చిన మీ అందరికీ థ్యాంక్స్. మీరు మా మూవీకి ఇలాగే సపోర్ట్ అందిస్తూ ఉండాలి. ఫణి మూవీతో నాకు నటిగా మంచి గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన ఓ.ఎం.జీ ప్రొడక్షన్స్, డాక్టర్ వీఎన్ ఆదిత్య గారికి థ్యాంక్స్”. అని అన్నారు.

ముఖ్య అతిథిగా వచ్చిన ప్రొడ్యూసర్ అనిల్ సుంకర మాట్లాడుతూ.. “ఓ.ఎం.జీ ప్రొడక్షన్స్ టాలీవుడ్ మూవీ మేకింగ్ లోకి రావడం హ్యాపీగా ఉంది. ప్రస్తుతం 90శాతం టాలీవుడ్ మూవీ ప్రొడక్షన్ చేస్తున్నది అమెరికాలో ఉంటున్న తెలుగు ప్రొడ్యూసర్సే. ఫణి మూవీ టైటిల్ బాగుంది. మీనాక్షి గారి మ్యూజిక్ ఆకట్టుకుంది. డాక్టర్ వీఎన్ ఆదిత్య గారికి, ఇతర టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఓ.ఎం.జీ ప్రొడక్షన్స్ లో మరిన్ని మూవీస్ రావాలి.” అని అన్నారు.

క్రీజీ హీరోయిన్ కేథరీన్ మాట్లాడుతూ.. “ఫణి మూవీ కథ విన్న వెంటనే చేస్తానని చెప్పాను. ఈ కథ నన్ను అంతగా ఇంప్రెస్ చేసింది. నా కెరీర్ లో చేస్తున్న ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఇదే. వీఎన్ ఆదిత్య గారితో వర్క్ చేయడం వండర్ ఫుల్ ఎక్సీపిరియన్స్ ఇచ్చింది. ఆయనకు ఫిలిం మేకింగ్ మీద ఉన్న డెడికేషన్ కు హ్యాట్సాఫ్. ఆయన చాలా నాలెజ్డ్ పర్సన్. ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఓ.ఎం.జీ సంస్థ తమ తొలి చిత్రానికి నన్ను సెలెక్ట్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. త్వరలోనే మీ ముందుకు ఓ మంచి థ్రిల్లర్ మూవీతో రాబోతున్నాం.” అని అన్నారు.

ఇక డైరెక్టర్ వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ.. “ఫణి మూవీ టైటిల్ లాంఛ్ చేసిన డాక్టర్ తోటకూర ప్రసాద్ గారికి, బ్యానర్ లాంఛ్ చేసిన ప్రొడ్యూసర్ అనిల్ సుంకర గారికి , ఇతర గెస్ట్ లు అందరికీ థ్యాంక్స్. మీనాక్షి మ్యూజిక్ డైరెక్టర్ గా నాకు బాగా తెలుసు. తను సినిమా ప్రొడ్యూస్ చేస్తానని అన్నప్పుడు ముందు ఒక షార్ట్ ఫిలిం చేయి, ప్రొడ్యూసర్ ఇబ్బందులు తెలుస్తాయి అన్నాను. కథ చెప్పండి అంది. అలా ఒక కథ చెప్పి సాయంత్రమే షూటింగ్ అంటే వెంటనే ఏర్పాట్లు చేసింది. అప్పుడు అనుకున్నా తను ప్రొడ్యూసర్ గా రాణిస్తుందని. ఫణి సినిమా కథ చెప్పగానే కేథరీన్ నాకు బాగా నచ్చింది, తప్పకుండా చేస్తానని అంది. ఆమె ధైర్యానికి అభినందనలు. ఎందుకంటే కమర్షియల్ హీరోయిన్స్ లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేయాలంటే, అదీ కొత్త ప్రొడక్షన్ హౌస్ అంటే అంత ఈజీగా ఒప్పుకోరు. కేథరీన్ లేకుంటే మా ఫణి మూవీ లేదు. ఈ మూవీకి వర్క్ చేస్తున్న కాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్స్. మీ సపోర్ట్ తో త్వరలోనే సినిమాను కంప్లీట్ చేస్తాం. ప్రీ రిలీజ్, ప్రీమియర్స్ లో మళ్లీ మనందరం కలుసుకుందాం.” అని అన్నారు. ఇక మీనాక్షి అనిపిండి త్వరలోనే వాకో సిటీ లో తను నిర్మించబోయే “ఫిష్ ఐ ” స్టూడియో బ్రోచర్ ని మాస్టర్ ధన్విన్ పాకా,మాస్టర్ శ్రీకర్ కల్లూరి లాంచ్ చేశారు.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomjojobetMadridbetMadridbetjojobetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetmarsbahis girişesrar satın algrandpashabet