iDreamPost
android-app
ios-app

వీడియో: బిగ్​బాస్ సొహైల్​పై బుల్లెట్ భాస్కర్ సెటైర్స్.. ప్లీజ్ చూడండి అంటూ!

  • Published Mar 11, 2024 | 10:07 PM Updated Updated Mar 11, 2024 | 10:14 PM

బిగ్​బాస్ షో ఫేమ్ సొహైల్​పై బుల్లెట్ భాస్కర్ సెటైర్స్ వేశారు. ప్లీజ్ చూడండి అంటూ ఆయన చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

బిగ్​బాస్ షో ఫేమ్ సొహైల్​పై బుల్లెట్ భాస్కర్ సెటైర్స్ వేశారు. ప్లీజ్ చూడండి అంటూ ఆయన చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

  • Published Mar 11, 2024 | 10:07 PMUpdated Mar 11, 2024 | 10:14 PM
వీడియో: బిగ్​బాస్ సొహైల్​పై బుల్లెట్ భాస్కర్ సెటైర్స్.. ప్లీజ్ చూడండి అంటూ!

బిగ్​బాస్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన వారిలో సొహైల్​ ఒకరు. ఈ షో ద్వారా వచ్చిన క్రేజ్​తో ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడాయన. ‘మిస్టర్ ప్రెగ్నెంట్’తో అలరించిన సోహైల్.. అంతకుముందు ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’, ‘లక్కీ లక్ష్మణ్’ సినిమాలతో మెప్పించారు. అయితే ఈ సినిమాలేవీ కమర్షియల్​గా వర్కౌట్ కాలేదు. అయినా తన ప్రయత్నాలు ఆపని సొహైల్​.. ఇటీవల ‘బూట్​కట్ బాలరాజు’తో మరోమారు ఆడియెన్స్​ ముందుకు వచ్చారు. ఈ ఫిల్మ్​లో నటించి నిర్మాణంలోనూ భాగం పంచుకున్నారు. ప్రమోషన్స్​తో దుమ్మురేపి సినిమా మీద బజ్​ను తెచ్చారు. అయితే ఇది కూడా ప్రేక్షకుల మెప్పును పొందడంలో విఫలమైంది. ఈ సినిమా రిలీజ్ టైమ్​లో దయచేసి తన సినిమా చూడండి అంటూ ఆయన కన్నీళ్లు పెట్టుకోవడం అప్పట్లో వైరల్​గా మారింది. అలాంటి సొహైల్​ మీద జబర్దస్త్ ఫేమ్ బుల్లెట్ భాస్కర్ సెటైర్స్ వేశారు.

‘బూట్​కట్ బాల్​రాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్​లో సినిమా గురించి మాట్లాడుతూ సొహైల్ ఫుల్ ఎమోషనల్ అయ్యారు. మోకాళ్ల మీద కూర్చొని మరీ తన సినిమా చూడాలని ఆడియెన్స్​ను రిక్వెస్ట్ చేశారు. ఇల్లు కోసం తన నాన్న దాచిన రిటైర్మెంట్ పైసలు పెట్టి మరీ ‘బూట్​కట్’ మూవీ తీశానంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే ఇంతగా ప్రమోట్ చేసినా సినిమాను ప్రేక్షకులు ఆదరించలేదు. ఇదిలా ఉంటే.. కమెడియన్ బుల్లెట్ భాస్కర్ సోహైల్​పై సెటైర్స్ వేశారు. ప్లీజ్ తన సినిమా చూడండి అంటూ ‘బూట్​కట్ బాలరాజు’ రిలీజ్ టైమ్​లో సొహైల్ మాట్లాడిన వ్యాఖ్యలను తన స్కిట్​లో వాడుకున్నాడు. జబర్దస్త్ నెక్స్ట్ ఎపిసోడ్​కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో సొహైల్​ను ఇమిటేట్ చేస్తూ, తన మూవీ చూడాంటూ భాస్కర్ సెటైర్స్ వేస్తూ కనిపించారు.

‘థియేటర్​కు వచ్చి సినిమా చూడండి. ముఖేష్​ యాడ్ చూసి రివ్యూ పెట్టడం ఏంటన్న. మిమ్మల్ని నమ్ముకొని సినిమా తీశా’ అంటూ బుల్లెట్ భాస్కర్ వేసిన సెటైర్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. జబర్దస్త్ ప్రోమోలో భాస్కర్ స్కిట్ హైలైట్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్ భిన్నాభిప్రాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలా సెటైర్స్ వేయడం కరెక్ట్ కాదని కొందరు నెటిజన్స్ అంటున్నారు. అయితే అది సొహైల్​​కు సంబంధించినది కాదని.. చాలా ఇండస్ట్రీల్లో ఇలా జరుగుతోందంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి సొహైల్ మీద సెటైర్స్​తో ఒక్కసారిగా అందరి అటెన్షన్​ను తన వైపునకు తిప్పుకున్నాడు బుల్లెట్ భాస్కర్. మరి.. సొహైల్​పై సెటైర్స్ వేస్తూ భాస్కర్ చేసిన స్కిట్ మీద మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabet girişGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş