Nidhan
టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం జీవితంపై ఓ పుస్తకం వచ్చేసింది. ఆ బుక్ పేరు ఏంటి? దానికి సంబంధించిన మరిన్ని విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం జీవితంపై ఓ పుస్తకం వచ్చేసింది. ఆ బుక్ పేరు ఏంటి? దానికి సంబంధించిన మరిన్ని విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Nidhan
బ్రహ్మానందం.. తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరిది. తనదైన స్పెషల్ టైమింగ్‌తో, డైలాగ్ డెలివరీతో టాలీవుడ్లో ఎంతో పేరు తెచ్చుకున్నారాయన. ఎన్నో వందల సినిమాల్లో నటించిన బ్రహ్మానందం.. తన కామెడీతో ఆడియెన్స్‌ను కడుపుబ్బా నవ్వించారు. అభిమానులు ముద్దుగా బ్రహ్మీ అని పిలుచుకునే ఈ లెజెండరీ నటుడు.. ఇండస్ట్రీలోని ప్రతి స్టార్ హీరోతో యాక్ట్ చేశారు. కొన్నేళ్ల పాటు ఆయన లేని సినిమా అంటూ ఉండేది కాదంటేనే క్రేజ్ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. కమెడియన్స్‌లో ఆయన పోషించినన్ని రోల్స్ ఎవరూ చేయలేదనే చెప్పాలి. రేలంగి, అల్లు రామలింగయ్య తర్వాత టాలీవుడ్లో అంత పేరు ప్రఖ్యాతులు పొందిన కమెడియన్ అంటే బ్రహ్మీ పేరే గుర్తొస్తుంది. అలాంటి ఆయన జీవితం మీద ఒక పుస్తకం రూపొందింది. అవును, బ్రహ్మీ అభిమానులకు శుభవార్త. ఈ స్టార్ కమెడియన్ లైఫ్ పై ఒక బుక్ వచ్చేసింది.
బ్రహ్మానందం తన ఆటోబయోగ్రఫీని తానే రాసుకోవడం విశేషం. ఈ పుస్తకానికి ‘నేను.. మీ బ్రహ్మానందం’ అనే పేరు పెట్టారు. తన జీవితంలోని విశేషాలతో పాటు అనుభవాలు, జ్ఞాపకాలను ఈ బుక్‌లో రాసుకొచ్చారు. అంతా దేవుడి దయ.. అంతా ఆయనే.. అన్నీ ఆయన చేస్తున్నవే అనుకోవడం ఆస్తికత్వం అని పుస్తకంలో రాసుకొచ్చారు బ్రహ్మీ. ఇదంతా నా కష్టార్జితం, నా స్వయంకృషి, నా ఆలోచనల ప్రతిఫలం అనుకోవడం నాస్తికత్వమని అందులో తెలిపారాయన. ‘ఆస్తికత్వం, నాస్తికత్వం.. ఈ రెండు భావాలు కాడికి కట్టిన రెండు ఎద్దుల్లాంటివి! నా పద్ధతి నాదే అని ఆస్తికత్వం అటు లాక్కెళ్లినా, కాదు.. నా పద్ధతి నాదే అని నాస్తికత్వం ఇటు లాక్కెళ్లినా సరైనటువంటి ఫలాలను మనం అందుకోలేకపోతాం. అటు చేస్తున్న పని శ్రద్ధగా, అంకితభావంతో, నవ్యతతో చేయాలి. ఇటు స్వామి అనుగ్రహం తోడవ్వాలి. ఈ రెండూ కలిస్తేనే జీవితమనే బండి సక్రమంగా సాగుతుందని నా విశ్వాసం’ అని ఈ పుస్తకంలో రాసుకొచ్చారు బ్రహ్మానందం.
ఎవరి నుంచి జాలి పొందడానికి తాను ఈ పుస్తకం రాయలేదని బ్రహ్మానందం ఈ బుక్‌లో పేర్కొన్నారు. తాను సాధించిన విజయసోపానాన్ని అందరి ముందుంచి తానింత గొప్పవాడ్ననని చెప్పుకోవడానికీ పుస్తకం రాయలేదని తెలిపారు. తన జీవితంలోని మైలురాళ్లను గుర్తుచేసుకోవడంలో భాగంగానే ఈ బుక్ రాసినట్లు అందులో స్పష్టం చేశారు. ఇక, కెరీర్ విషయానికొస్తే.. కరోనా తర్వాత బ్రహ్మానందం సినిమాలు చేయడం తగ్గించేశారు. చాలా సెలక్టివ్‌గా నచ్చిన మూవీస్ చేస్తున్నారు. ఇటీవల ‘కీడా కోలా’ ఫిల్మ్‌లో ఓ స్పెషల్ క్యారెక్టర్ చేశారాయన. ఈ తరుణంలో తన ఆటోబయోగ్రఫీ బుక్‌తో అందర్నీ సర్ప్రైజ్ చేశారు. మరి.. బ్రహ్మానందం ఆత్మకథ ఆధారంగా వచ్చిన పుస్తకం చదివేందుకు మీరెంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఈ చిన్నది.. ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. గుర్తుపట్టారా..?
We @AnvikshikiPub are extremely thankful to Brahmanandam garu for giving us the opportunity to publish his autobiography. pic.twitter.com/vCq4KUNuis
— Venkat Siddareddy (@vrsiddareddy) December 28, 2023