Serial Actor: కమిట్ మెంట్ ఇస్తేనే ఆఫర్లు.. బ్రహ్మముడి అప్పు రియల్ లైఫ్ కష్టాలు!

ప్రముఖ బుల్లితెర ఛానెల్ లో ప్రసారమైన 'బ్రహ్మముడి' సీరియల్ నటి కమిట్‌మెంట్ ఇవ్వలేదని వేధింపులు గురైయ్యనని భావోద్వేగానికి గురయ్యింది. అసలు ఏం జరిగిదంటే..

ప్రముఖ బుల్లితెర ఛానెల్ లో ప్రసారమైన 'బ్రహ్మముడి' సీరియల్ నటి కమిట్‌మెంట్ ఇవ్వలేదని వేధింపులు గురైయ్యనని భావోద్వేగానికి గురయ్యింది. అసలు ఏం జరిగిదంటే..

సాధారణంగా ఎదుటవారు పడే కష్టాలు విన్నా.. చూసినా.. అబ్బా వీరిది సీరియల్ కష్టాలురా బాబు అంటాం. ఎందుకంటే.. సీరియల్ లో చూపించే కష్టాలు ఆ రేంజ్ లో ఉంటాయి. మరి ఆ సిరియల్స్ లో పాత్రను జీవించే నటులకు కూడా నిజ జీవితంలో అనేక కష్టాలు ఉంటాయి. ఎందుకంటే కోటి ఆశలతో.. నటన మీద ఉన్నా ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగు పెడుతుంటారు. ఈ క్రమంలోనే ఎన్నో అవమానాలు, మరెన్నో ఇబ్బందులకు ఎదుర్కొంటారు. ఒకనొక సమయంలో డైరెక్టర్లు, ప్రొడ్యుసర్ లతో క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులకు గురవుతుంటారు. ఇప్పుడు ప్రముఖ బుల్లితెర ఛానెల్ లో ప్రసారమైన ‘బ్రహ్మముడి’ సీరియల్ నటి కూడా తన రియల్ లైఫ్ లో కమిట్‌మెంట్ ఇవ్వలేదని వేధింపులకు గురైయ్యనని తెలియజేసింది.

స్టార్ మా ఛానెల్ లో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న ‘బ్రహ్మముడి’ సిరియల్ కోసం అందరికి తెలిసిందే. సాయంత్రం 7 అయిదంటే చాలు ప్రతిఒక్కరు ఈ సీరియల్ ప్రేమికులే. అంతలా ఈ సిరియల్ ప్రేక్షకులను అలరిస్తుంది. అయితే ఈ సీరియల్ లో కనకం ముగ్గురు కూతుళ్లలో మగరాయుడిగా అలరించే అప్పు క్యారెక్టరైజేషన్ మాత్రం భలే గమ్మత్తుగా ఉంటుంది. అమ్మాయి అంటే ఎంతో అణకువుగా లొంగి, వొంగి ఉండాలి. కానీ, అప్పు మాత్రం ఆ మాటలకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. అలానే ఫ్యాంటూ షర్ట్ వేసుకొని మగరాయుడిలా ఉంటుంది. మరి,  సీరియల్ లో అంతా  డేరింగ్ అండ్ డాషింగ్‌ పాత్ర పోషిస్తున్న ఈ నటి పేరు ‘నైనిషా రాయ్’. ఈమె బెంగాలీ కి చెందిన అమ్మాయి. చిన్నతనం నుంచే సినిమాలపై ఉన్న ఆసక్తితో బెంగాలీ మూవీస్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. ఆ తర్వాత చదువు పూర్తి చేసుకొని  బెంగాలీ సినిమాల్లో నటించింది. అనంతరం.. తెలుగులో కూడా పలు సీరియల్స్ లో నటించింది. అయితే, రీయల్ లైఫ్ లో ఈ అమ్మాడు ఎన్ని కష్టాలు పడిందో.. రియల్ లైఫ్ లో కూడా అన్నే కష్టాలు పడింది. బెంగాలీ కుటుంబానికి చెందిన నైనిషా రాయ్ తండ్రి ఒక లెక్చలర్ కాగా.. తల్లి హౌస్ వైఫ్. అయితే.. నైనిషా ఇండస్ట్రీకి రావడం.. పేరెంట్స్ కి ఇష్టం లేకపోవడంతో కూతురితో బంధం తెంచుకున్నారు. దీంతో నైనిషా తన పేరెంట్స్ గురించి మాట్లాడుతూ.. ‘వాళ్ల ఆలోచనలో వాళ్లు కరెక్టేమో కానీ.. నాకు మాత్రం వాళ్లు చేసింది తప్పు’ అని చెప్పింది.

అలాగే ఇండస్ట్రీలో తనకు ఎదురైన అనుభవాలు గురించి మాట్లడుతూ.. ‘ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత.. కనీసం తినడానికి తిండి లేకుండా ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. ఆకలి తీర్చుకోవడానికి నా రక్తాన్ని నేనే డొనేట్ చేసి కడుపునింపుకున్నాను. అన్ని కష్టాలను ఎదుర్కొని నటిగా ప్రయత్నిస్తే.. మరి నాకేంటి? అని ఎదురైన పరిస్థితులు నా లైఫ్‌లో చాలానే ఉన్నాయి. నేనూ క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందుల్ని చాలా ఎదుర్కొన్నా. నేను కమిట్ మెంట్ ఇస్తాననే ఉద్దేశంలోనే నాకు ఓ ఆఫర్ కూడా ఇచ్చారు. అది షూటింగ్ స్టార్ట్ కాబోతుంది.. ఇక వాళ్లు నన్ను రమ్మని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు. అలా నాకు ఇష్టంలేని పని చేయనని.. వాళ్లని కొట్టి మరి వచ్చేశాను. ఆ తర్వాత నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. ఈ కష్టాలను అభవించలేక.. చనిపోవాలని అనుకుని ఆత్మహత్య కూడా చేసుకున్నాను. ఎందుకంటే నా కష్టం చెప్పుకోవడానికి ఎవరూ లేరు, అలాగని తిరిగి ఇంటికి వెళ్లలేను. నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, అది చంపుకోలేను’.అంటూ తన కష్టాలను చెప్పుకొచ్చింది బ్రహ్మముడి అప్పు అలియాస్ నైనిషా రాయ్.

అయితే నైనిషా మొదట ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సీరియల్‌తో బుల్లితెర పై అడుగుపెట్టింది. ఆ తర్వాత ‘శ్రీమంతుడు’, ‘భాగ్య రేఖ’ ‘హంసగీతం’, ‘ఇంటిగుట్టు’ ఇలా చాలా సీరియల్స్‌లో నటించింది. వీటితో పాటు ఈటీవీలో ప్రసారం అయిన ‘శ్రీమంతుడు’ అనే సీరియల్‌లో హీరోయిన్‌గా నటించింది నైనిషా రాయ్. అయితే నైనిషాకు ఎక్కువగా గుర్తింపు తెచ్చిపెట్టిన సీరియల్స్ మాత్రం ‘కలిసి ఉంటే కలదు సుఖం’ ‘బ్రహ్మముడి’, ‘వంటలక్క’ సీరియల్స్ మాత్రమే. అలాగే నైనిషా.. 2021లో ‘కథానిక’ అనే తెలుగు సినిమాలో నటించడంతో పాటు.. 2023లో ‘ప్లాన్ బి’ అనే సినిమాలోనూ నటించింది. మరి, బ్రహ్మముడి సీరియల్ నైనిషా రియల్ లైఫ్ కష్టాల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments