iDreamPost
android-app
ios-app

ఈ అమ్మాయి బిగ్ బాస్ కంటెస్టెంట్ తల్లి.. ఎవరో గుర్తుపట్టారా.?

  • Published Sep 10, 2024 | 9:21 PM Updated Updated Sep 10, 2024 | 9:21 PM

ఈ ఫోటోలో ఉన్న యువతిని గుర్తుపట్టారా..? ఎంటర్ ప్రెన్యూర్, ప్రొడ్యూసర్, విద్యా వేత్త, ఓ స్టార్ యాక్టర్ తల్లి కూడా. తాజాగా ఆమె నాన్నమ్మగా ప్రమోట్ అయ్యింది. ఇంతకు ఆమె ఎవరంటే..?

ఈ ఫోటోలో ఉన్న యువతిని గుర్తుపట్టారా..? ఎంటర్ ప్రెన్యూర్, ప్రొడ్యూసర్, విద్యా వేత్త, ఓ స్టార్ యాక్టర్ తల్లి కూడా. తాజాగా ఆమె నాన్నమ్మగా ప్రమోట్ అయ్యింది. ఇంతకు ఆమె ఎవరంటే..?

  • Published Sep 10, 2024 | 9:21 PMUpdated Sep 10, 2024 | 9:21 PM
ఈ అమ్మాయి బిగ్ బాస్ కంటెస్టెంట్ తల్లి.. ఎవరో గుర్తుపట్టారా.?

ఈ ఫోటోలో కనిపిస్తున్న యువతిని గుర్తు పట్టారా..? చూసేందుకు సాదా సీదాగా కనిపిస్తుంది కానీ ఆమె బ్యాగ్రౌండ్ మామూలుగా లేదు. ఎంటర్ ప్రెన్యూర్, ప్రొడ్యూసర్, ఓ స్టార్ యాక్టర్ తల్లి, విద్యా వేత్త కూడా. తాజాగా నాన్నమ్మగా ప్రమోట్ అయ్యింది. ఎప్పటి నుండో ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఆమె.. సెన్సార్ బోర్డ్, ఫిల్మ్ ఛాంబర్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఇంతకు ఆమె ఎవరో తెలుసా..? చెబితే నిజంగానే షాక్ అవుతారు. బిగ్ బాస్ 5 కంటెస్టెంట్ మానస్ నాగుల పల్లి తల్లి పద్మిని. ఈ ఫోటోను ఆమె పంచుకున్నారు.  చాలా మందికి బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చాక ఆమె తెలిసింది.. కానీ ఇండస్ట్రీలో ఉన్న వారికి సుపరిచితురాలే. కొడుక్కి మంచి సపోర్టుగా నిలిచి..కంటెస్టెంట్లకు బూస్టప్ ఇచ్చి మరింత ఫేమ్ అయ్యారు. ఎవరికీ తెలియని విషయం ఏంటంటే.. మానస్ తల్లి వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్.

పద్మిని నాగుల పల్లి డబుల్ ఎంఎ, బీఎడ్ చేశారు. ఆమెకు టీచింగ్ ఫీల్డ్‌లో ఉన్నారు. పెర్సీ హై స్కూల్, పద్మినీ గ్రూప్ ఆప్ స్కూల్స్ పేరుతో విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారు. ఎంతో మంది నిరుపేద పిల్లలకు ఉచితంగా విద్యా బుద్దులు చెప్పించారు. అంతే కాకుండా తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, సెన్సార్ బోర్డు సభ్యురాలు. నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ఆమెకు కొడుకంటే విపరీతమైన ఇష్టం.  తాజాగా మానస్ పలు ఇంటర్వ్యూలో పాల్గొని అమ్మ గురించి పలు విషయాలు పంచుకున్నాడు. అమ్మ డాక్టర్ చదవాలని అనుకుందని, కానీ చిన్న వయస్సులోనే పెళ్లి చేయడంతో అది సాధ్యపడలేదని, అందుకే తనను కూడా డాక్టర్ చేయాలనుకుందని చెప్పాడు. కానీ అనూహ్యంగా నటనలోకి వచ్చినప్పుడు ఎంకరేజ్ చేసినట్లు చెప్పుకొచ్చాడు.

Padmini Nagulapalli, Maanas Nagulapalli 1

ఇక మానస్ విషయానికి వస్తే.. చైల్ట్ ఆర్టిస్టుగా ఎన్నో చిత్రాల్లో నటించాడు. నరసింహా నాయుడు, వీడే, అర్జున్ వంటి చిత్రాల్లో నటించాడు. మానస్ అసలు పేరు రామ్ తేజ. 2011లో ఝలక్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. గ్రీన్ సిగ్నల్, కాయ్ రాజా కాయ్, గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్, గోలీ సోడా.. ఇలా పలు చిన్న చిత్రాల్లో హీరోగా నటించాడు. అవేమీ గుర్తింపు తీసుకురాలేదు. 2021లో ప్రసారమైన బిగ్ బాస్ తెలుగు 5లో మానస్ అడుగుపెట్టాక.. బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్లో రాజ్ పాత్రలో అదరగొడుతున్నాడు మానస్. గత ఏడాది శ్రీజను వివాహం చేసుకున్న ఈ జంటకు ఈ నెల 10న బాబు జన్మించాడు. ఈ విషయాన్ని మానస్, ఆయన తల్లి పద్మిని షేర్ చేసుకున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Padmini Nagulapalli (@padmini.nagulapalli.7)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet